WTC Points Table: వన్డే, టీ 20 ఫార్మాట్లో టీమ్ ఇండియాకు తిరుగులేదు. టి ట్వంటీ ఫార్మాట్ లో టీమ్ ఇండియా వరల్డ్ కప్ సాధించింది. వన్డే విభాగంలో ఛాంపియన్స్ ట్రోఫీ అందుకుంది. కానీ టెస్ట్ ఫార్మాట్లో మాత్రం టీమిండియా అంచనాలు అందుకోలేకపోతోంది. అంతేకాదు స్వదేశంలో కూడా వైట్ వాష్ లకు గురవుతోంది. దీంతో టీమ్ ఇండియా 2025 -27 లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్ వెళ్లే అవకాశాలను దూరం చేసుకుంటున్నది.
ఐసీసీ ప్రకటించిన వరల్డ్ బెస్ట్ ఛాంపియన్ పాయింట్ల పట్టికలో భారత జట్టు స్థానం దారుణంగా దిగజారింది. న్యూజిలాండ్ వేదికగా జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో భాగంగా రెండవ టెస్టులో వెస్టిండీస్ జట్టుపై కివిస్ విజయం సాధించింది. దీంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ పాయింట్లు పట్టికలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ విజయం ద్వారా న్యూజిలాండ్ జట్టు పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరుకుంది. భారత జట్టు ఐదు నుంచి ఆరవ స్థానానికి పడిపోయింది. పాకిస్తాన్ కంటే కిందికి భారత జట్టు దిగజారడం సగటు అభిమానిని కలవరపరుస్తోంది. 2025 -27 సీజన్లో భారత జట్టు మొత్తం తొమ్మిది టెస్టులు ఆడింది. నాలుగు విజయాలు సాధించింది, అదే సంఖ్యలో ఓటములు నమోదు చేసింది. ఒక మ్యాచ్ డ్రా చేసుకుంది. భారత్ ఖాతాలో 52 పాయింట్లు ఉన్నాయి.. విజయాల శాతం 48.15 నమోదయింది.
పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఐదు మ్యాచ్లు ఆడిన ఆ జట్టు.. ఐదు విజయాలతో ఫస్ట్ ప్లేస్ లో ఉంది. 60 పాయింట్లు, నూటికి నూరు విజయాల శాతంతో నెంబర్ వన్ ప్లేస్ లో ఉంది. సౌత్ ఆఫ్రికా నాలుగు మ్యాచ్లు ఆడి.. మూడు విజయాలు సాధించింది. ఒక మ్యాచ్ ఓడిపోయింది. సౌత్ ఆఫ్రికా ఖాతాలో 36 పాయింట్లు ఉన్నాయి. విజయాల శాతం 75 గా ఉంది. న్యూజిలాండ్ జట్టు రెండు మ్యాచ్లు ఆడి.. ఒక విజయం సాధించింది. న్యూజిలాండ్ ఖాతాలో 16 పాయింట్లు, విజయాల శాతం 66.67 గా ఉంది. శ్రీలంక రెండు మ్యాచ్లు ఆడి.. ఒక మ్యాచ్లో విజయం సాధించింది. శ్రీలంక జట్టు ఖాతాలో 16 పాయింట్లు, విజయాల శాతం 66.67 గా నమోదయింది. పాకిస్తాన్ జట్టు రెండు మ్యాచ్లు ఆడి.. ఒక విజయం, మరో పరాజయాన్ని నమోదు చేసింది. పాకిస్తాన్ ఖాతాలో 12 పాయింట్లు, విజయాల శాతం 50 గా నమోదయింది. ఇక భారత్ కంటే దిగువ స్థానంలో ఇంగ్లాండ్ ఉంది. ఇంగ్లాండ్ ఏడు మ్యాచ్ లు ఆడింది. రెండు విజయాలు, నాలుగు ఓటములు తన ఖాతాలో వేసుకుంది.. 26 పాయింట్లు, విజయాల శాతం 30.95 గా నమోదయింది. బంగ్లాదేశ్ రెండు మ్యాచ్లు ఆడి, రెండు ఓడిపోయింది. వెస్టిండీస్ ఏడు మ్యాచ్ లు ఆడి.. ఆరు ఓడిపోయింది..