Vaibhav Suryavanshi: టీమిండియా అండర్ 19 జట్టులో సంచలన ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు వైభవ్ సూర్య వంశీ. ఐపీఎల్ లో రాజస్థాన్ జట్టు తరఫున ఆడుతున్న వైభవ్.. సెంచరీ సాధించాడు. గొప్ప గొప్ప బౌలర్ల బౌలింగ్లో బీభత్సంగా పరుగులు చేశాడు. ఏమాత్రం భయం అనేది లేకుండా బ్యాటింగ్ చేస్తూ సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నాడు. సంచలన ఆటతీరుతో అదరగొడుతున్నాడు. వైభవ్ తన ఆట తీరు కాకతాళీయం కాదని.. ప్రొఫెషనల్ గేమ్ ప్లానింగ్ తన బ్లడ్ లో ఉందని నిరూపిస్తున్నాడు.
వైభవ్ ప్రస్తుతం జరుగుతున్న అండర్ 19 ఆసియా కప్ లో యూఏఈ జట్టుతో తలపడిన మ్యాచ్లో ఏకంగా 170+ పరుగులు చేసి అదరగొట్టాడు.. సిక్సర్ ల మోత మోగించి సరికొత్త చరిత్ర సృష్టించాడు. అయితే వైభవ్ ఈ స్థాయిలో ఆడుతున్న నేపథ్యంలో అతనికి కష్టాలు అమ్మాయిలు రూపంలో ఎదురవుతున్నాయి. వైభవ్ మేనేజర్ గా అతని తండ్రి సంజీవ్ సూర్యవంశీ కొనసాగుతున్నాడు. వైభవ్ వాడుతున్న ఫోన్లు మొత్తం అతడి ఆధీనంలోనే ఉన్నాయి.. అయితే ఇటీవల వైభవ్ కు అమ్మాయిలనుంచి సందేశాలు రావడం మొదలైంది. అంతేకాదు కొంతమంది అమ్మాయిలు తమను ప్రేమించాలని వైభవ్ మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. డేటింగ్ చేస్తావా అంటూ సందేశాలు పంపిస్తున్నారు. ఇంకా కొందరైతే ఒంటి మీద నూలు పోగు కూడా లేకుండా ఫోటోలు దిగి.. అతడికి పంపిస్తున్నారు. అతడిని దారుణంగా రెచ్చగొడుతున్నారు.
ఇటీవల కాలంలో ఈ తరహా సందేశాలు, ఫోటోలు విపరీతంగా పెరగడంతో వైభవ్ తండ్రి కి విపరీతమైన కోపం వచ్చింది. తన బాధను మొత్తం మీడియా ముఖంగా అతడు పంచుకున్నాడు. “వైభవ్ కు ఈ రేంజ్ పాపులారిటీ రావడం ఒక తండ్రిగా గర్వంగా ఉంది. అతడికి అభిమానులు కూడా విపరీతంగా పెరిగారు. ఇది నాకు అత్యంత ఆనందం కలిగిస్తోంది. కానీ కొంతమంది అమ్మాయిలు అతడి వాట్స్అప్ కు చూడకూడని స్థితిలో ఉన్న దృశ్యాలు పంపిస్తున్నారు. రెచ్చగొట్టే సందేశాలు పంపిస్తున్నారు. అతడి ఏకాగ్రతను దెబ్బతీసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవి చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. ఇలాంటి సందేశాలు పంపి అతడి కెరియర్ తో ఆటలాడకూడదు. అతడు ఎంతో కష్టపడి ఇక్కడ దాకా వచ్చాడు. ఇంకా అతడు సాధించాల్సింది చాలా ఉంది. చేయాల్సింది కూడా చాలామంది. అలాంటప్పుడు అతని ఏకాగ్రతకు భంగం కలిగించకుండా ఉంటే బాగుంటుందని” సంజీవ్ అమ్మాయిలకు విన్నవించాడు.
మరోవైపు వైభవ్ ప్రస్తుతం జరుగుతున్న అండర్ 19 ఆసియా కప్ లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. బీభత్సమైన ఫామ్ లో ఉన్న అతడు.. ప్రత్యర్థి జట్టు బౌలర్ల పై ఏమాత్రం కనికరం చూపించడం లేదు. సూపర్ సానిక్ వేగంతో పరుగులు చేస్తూ సంచలనం సృష్టిస్తున్నాడు. వైభవ్ తన జోరు ఇలానే కొనసాగిస్తే.. క్రికెట్లో సరికొత్త రికార్డులు సృష్టించే ఆటగాడిగా రూపాంతరం చెందుతాడని మాజీ క్రికెటర్లు వ్యాఖ్యానిస్తున్నారు.