America: ప్రమాదాలు చెప్పి రావు.. కొన్ని ప్రమాదాలు చిన్న గాయాలతో బయట పడతుంటాం. కొన్ని ప్రమాదాల్లో ప్రాణాలే పోతాయి. అయితే ఇక్కడ కొన్నిసార్లు మన ప్రేమయం ఉండదు. అయినా ప్రమాదానికి గురవుతుంటాం. గాయపడతాం. కొందరు ప్రాణాలు కూడా కల్పోతున్నారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వాలు బాధితులకు సాయం అందిస్తుంటాయి. అయితే ప్రైవేటు సంస్థల్లో జరిగిన ప్రమాదాలకు ఆ సంస్థ నిర్వాహకులే బాధ్యత వహించాల్సి ఉంటుంది. కానీ కొన్ని సంస్థలు తమకు సంబంధం లేదు అన్నట్లు వ్యవహిస్తుంటాయి. సంస్థల్లో పనిచేసిన కార్మికులు ప్రమాదాల బారిన పడినా పట్టించుకోవడం లేదు. కొన్ని రెస్పాన్సిబుల్‌గా ఆదుకుంటున్నాయి. అమెరికాలో ఓ పార్కులో జరిగిన ప్రమాదంలో బాలుడు మృతిచెందాడు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన పార్కు నిర్వాహకులకు కోర్టు భారీగా జరిమానా విధించింది.
ఏం జరిగిందంటే..
అమెరికాలోని ఓర్లాండ్‌లోని ఓ పార్కులో ఫ్రీపాల్ టవర్ నుంచి పడి బాలుడు మృతిచెందాడు. ఈ కేసుకు సంబంధించి ఫ్లోరిడా కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. మృతుడి కుటుంబానికి రూ.2,624 కోట్ల పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. 2022లో టైర్ సాంప్సన్(14) తన ఫుట్‌బాల్ టీంతో కలిసి ఓర్లాండ్‌లోని ఐకాన్ పార్కుకు వెళ్లాడు. ఆ సమయంలో ఫ్రీపాల్ టవర్ ఎక్కాడు. ఒక రైడ్‌లో 129 కిలోల బరువు మాత్రమే మోయగలదు. అయితే సాంప్పన్ బరువు 173 కిలో గ్రాములు. బరువు ఎక్కువగా ఉన్నా.. సిబ్బంది అతడిని రైడ్‌కు అనుమతించారు. ఈ సమయంలో సాంప్సన్ పెట్టుకున్న సీటుబెల్టు ఊడిపోయింది. దీంతో అతను 70 అడుగుల దూరం ఎగిరిపడి మరణించాడు.
కోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులు..
ప్రమాదం పార్కు సిబ్బంది నిర్లక్ష్యంతోనే జరిగిందని బాలుడి తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించారు. కార్పొరేషన్ల నిర్లక్ష్యంపై ఫిర్యాదు చేశాడు. రైడ్‌కు సంబంధించిన తయారీదారులు ప్రయాణికుల భద్రతకన్నా.. ఆదాయంపైనే దృష్టి పెట్టారని పేర్కొన్నారు. అందుకే తమ కుమారుడు మృతిచెందాడని తెలిపారు. విచారణ జరిపిన న్యాయస్థానం సంచల తీర్పు ఇచ్చింది. మృతుడి కుటుంబ సభ్యులకు 310 మిలియన్ డాలర్లు(రూ.2,624 కోట్లు) పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. కార్పొరేషన్ల భద్రత విషయంలో జావాబుదారీతనం తీసుకుఆరవాలని ఈ తీర్పు ఇస్తున్నట్లు వెల్లడించింది. దీంతో నిర్వాహకులు మృతుడి తల్లిదండ్రులకు 155 మిలియన్ డాలర్ల చొప్పున పరిహారం అందించనున్నారు.