https://oktelugu.com/

Subrahmanya Sashti 2024: సుబ్రహ్మణ్య షష్టి. దర్శించుకోవాల్సిన ఆలయాలు ఇవే..

తమిళనాడులోని తిరుపరంకుండ్రంలోని సుబ్రహ్మణ్యస్వామి ఆలయం ఎంతో ప్రాచుర్యం పొందింది. కొండపై ఉన్న ఈ ఆలయాంలోని శిల్పకళ ఆకట్టుకుంటుంది. అందమైన పరిసర ప్రాంతాలు ఉన్నాయి. పంగుని ఉతిరమ్‌ ఉత్సవానికి లక్షల మంది వస్తారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : December 8, 2024 / 02:00 AM IST

    Subrahmanya Sashti 2024

    Follow us on

    Subrahmanya Sashti 2024: దుష్ట విక్షణ, శిష్ట రక్షణ అనేది ప్రతీ యుగంలో జరుగుతంది. ఈ మహోన్నత కార్యాన్ని నెరవేర్చేందుకు అవతార పురుషులు, మహనీయులు జన్మిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే దుష్ట శిక్షణకు ఉద్భవించాడు సుబ్రహ్మణుడు. పరమ శివుని తేజస్స నుంచి షష్టి తిథిరోజు సుబ్రహ్మణ్యస్వామి అవతరించాడు. ఆ రోజునే సుబ్రహ్మణ్య షష్టి అంటారు.

    దీపావళి తర్వాత..
    ఏటా సుబ్రహ్మణ్య షష్టి దీపావళి పండుగ తర్వాత వస్తుంది. దీనిని స్కంద షష్టి అని కూడా పిలుస్తారు. ఈసారి సుబ్రహ్మణ్య షష్టి 2024 డిసెంబర్‌ 7న(శనివారం)వచ్చింది. దక్షిణ భారత దేశంలో సుబ్రహ్మణ్య షష్టిని ఘనంగా జరుపుకుంటారు. ఈ రోజు ఉపవాసం ఉండి సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధిస్తారు. తమిళనాడులో ఈ షష్టిని ఎంతో వైభవంగా జరుపుకుంటారు. కుక్కే సుబ్రహ్మణ్య షష్టి లేదా కార్తికేయ సుక్షబహ్మణ్య షష్టి పేరుతో వివిధ ఆలయాల్లో పూజలు, ఉత్సవాలు నిర్వహిస్తారు. తమిళనాడులో ప్రాచుర్యం పొందిన సుబ్రహ్మణ్యస్వామి ఆలయాలు ఉన్నాయి వాటి గురించి తెలుసుకుందాం.

    తిరుపరంకుండ్రం..
    తమిళనాడులోని తిరుపరంకుండ్రంలోని సుబ్రహ్మణ్యస్వామి ఆలయం ఎంతో ప్రాచుర్యం పొందింది. కొండపై ఉన్న ఈ ఆలయాంలోని శిల్పకళ ఆకట్టుకుంటుంది. అందమైన పరిసర ప్రాంతాలు ఉన్నాయి. పంగుని ఉతిరమ్‌ ఉత్సవానికి లక్షల మంది వస్తారు.

    తిరుచెందూర్‌..
    తిరుచెందూర్‌లోని సుబ్రహ్మణ్యస్వామి ఆలయం తమిళనాడులో ఉంది. ప్రముఖ ఆలయాల్లో ఒకటి. ఇది బంగాళాఖాతం ఒడ్డున ఉంది. ఈ ఆలయం వాస్తు శిల్పానికి ప్రసిద్ధి చెందినది. స్కంద షష్టి రోజు ఇక్కడ జరిగే పూజల కోసం లక్షల మంది వస్తారు. ఇక్కడ సూర్యోదయం, సూర్యాస్తమయం అంద్భుతంగా ఉంటాయి.
    దండాయుతపాణి ఆలయం..
    దండయుతపాణిస్వామి ఆలయం తమిళనాడులోని దిండిగల్‌ జిల్లాలో పళనిలో ఉంది. ఎత్తయిన కొండపై ఉన్న ఈ ఆలయానికి అద్భుతమైన ప్రవేశద్వారం ఉంది. శిల్పకళ ఆకట్టుకుంటుంది. ఈ ఆలయానికి భక్తులతోపాటు సాహస యాత్రీకులు వస్తారు.

    స్వామినాథ స్వామి ఆలయం..
    స్వామిమలైలో ఉన్న స్వామినాథ స్వామి ఆలయంలో సుబ్రహ్మణ్య షష్టి రోజు ప్రత్యేక పూజలు చేస్తారు. కొండపై ఉన్న ఈ ఆలయం షష్టి రోజు ప్రత్యేక పూజలు చేస్తారు. సందర్శకులకు ఆలయం ప్రత్యేక అనుభూతి ఇస్తుంది. మనిషి జీవితంలోని ఆరు దశలకు ప్రతీకగా ఈ ఆలయంలో 60 మెట్లు ఉంటాయి. ఇక్కడ సుబ్రహ్మణ్యుని కల్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది.

    తిరుత్తణి..
    తిరుత్తణిలో ఉనన సుబ్రహ్మణ్యస్వామి ఆలయం ఆధ్యాత్మిక అనుభూతిని అందించడంతోపాటు అద్భుతమైన ప్రకృతి సౌదర్యాన్ని అందిస్తుంది. ఈ ఆలయంలో 365 మెట్లు ఉంటాయి. వాటి మీదుగానే గుడిలోకి వెళ్లాలి. ఈ ఆచారాన్ని అందరూ పాటిస్తారు.

    పజముదిర్చోలై..
    తమిళనాడులోని పురాతన ఆలయాల్లో జపముదిర్చోలైలో ఉన్న సుబ్రహ్మణ్యస్వామి ఆలయం ఒకటి. కార్తియేయుని ఆరు నివాసాలలో ఒకటిగా దీనిని భావిస్తారు. కార్తిక మాసంలో ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. భారీగా భక్తులు వస్తారు.

    కల్యాణ సుబ్రహ్మణ్య స్వామి..
    తమిళనాడు కల్యాణ పులియంకుళం పట్టణంలో కల్యాణ సుబ్రహ్మణ్యస్వామి ఆలయం ఉంది. ఈ ముగుగన్‌ ఆలయంలో సుబ్రహ్మణ్య షష్టి రోజు విశేష పూజలు నిర్వహిస్తారు. స్వామి కల్యాణం వైభవంగా జరిపిస్తారు.