Annadata Sukhibhava: తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు రైతులకు ప్రత్యేక గుర్తింపును ఇస్తున్నాయి. పెట్టుబడి సాయం కోసం వివిధ పథకాలను ఏర్పరిచి నగదు సాయాన్ని అందిస్తున్నాయి. గత ప్రభుత్వం ఇచ్చిన మొత్తానికంటే ఎక్కువ మొత్తంలోనే ఇస్తామని 2024 ఎన్నికల్లో హామీ ఇచ్చిన పార్టీలు అధికారంలోకి వచ్చాయి. దీంతో ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. తెలంగాణలో ఇప్పటికే రుణమాఫీ పేరుతో రైతులకు ఉన్న అప్పులన్నీ తీర్చేస్తున్నారు. త్వరలో రైతు భరోసా అందించేందుకు కృషి చేస్తున్నారు. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్లోనూ రైతులు తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాలను కోరుతున్నారు. అయితే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు సిద్ధమవుతోంది. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారంగానే సాయం చేయడానికి ప్రణాళిక వేస్తున్నారు. ఆ వివారాల్లోకి వెళితే..
ఆంధ్రప్రదేశ్లో 2024 ఎన్నికల్లో కూటమి ఇచ్చిన హామీ ప్రకారం రైతులకు ‘అన్నదాత సుఖీభవ: పథకం కింద ఏడాదికి రూ.20 వేల పెట్టుబడి సాయం అందించాలి. అంతకు ముందు ఉన్న వైసిపి ప్రభుత్వం ‘రైతు భరోసా’ కింద సంవత్సరానికి రూ. 13వేల సాయం అందించేది. అయితే తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రూ. 20,000 అందిస్తామని హామీ ఇచ్చింది. ఇందులో పీఎం కిసాన్ సమాన్ యోజన కింది మొత్తం రూ, 6000 తీసేయగా మిగిలిన రూ. 14,000 రెండు విడతల్లో అందించాలి. సంక్రాంతి కానుకగా మొదటి విడత అంది ఇస్తామని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తెలిపింది. ఈ నేపథ్యంలో సంక్రాంతి వస్తున్న సమయంలో రైతులు ‘ అన్నదాత సుఖీభవ’ పథకం డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు.
ఈ సమయంలో కూటమి ప్రభుత్వం లోని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చేం నాయుడు అన్నదాత సుఖీభవ పథకం సంబంధించిన డబ్బులను త్వరలోనే రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రకటించారు. స్వయాన వ్యవసాయ శాఖ మంత్రి ప్రకటించడంతో రైతుల్లో ఆశలు రేకేత్తాయి. అయితే మంత్రి ప్రకటించిన ప్రకారం గడువులోగా రైతుల ఖాతాల్లో అన్నదాత సుఖీభవ మొత్తం జమ అయితే ప్రభుత్వంపై నమ్మకం ఏర్పడుతుంది. లేనిపక్షంలో రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది.
ఎందుకంటే పక్క రాష్ట్రం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తికాకముందే రైతు రుణమాఫీ ని చేసింది. ఆంధ్రప్రదేశ్లో రైతు రుణమాఫీ పథకం లేదు. కానీ అన్నదాత పథకం మొత్తం గడువులోగా జమ అయితే అయితే చాలు అని అనుకుంటున్నారు. మరోవైపు చాలామంది రైతులు అప్పులు చేసి పంట పెట్టుబడులను పెట్టారు. ప్రభుత్వం నుంచి అన్నదాత సుఖీభవ డబ్బులు వస్తాయని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో ప్రభుత్వం గడుపులోగా రైతు కు మొదటి విడత డబ్బులు అందజేయడం వల్ల ఎంతో ప్రయోజనాలు కలగనున్నాయి. అయితే కూటమి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. అయితే సంక్రాంతి కానుకగా రైతును సంతృప్తి పరచాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ అదే నిజమైతే రైతుల్లో నిజమైన సంతోషాన్ని నింపినట్లేనని కొందరు అనుకుంటున్నారు.