PM Modi: భారత ప్రధానిగా వరుసగా మూడోసారి బాధ్యతలు చేపట్టి తొలి ప్రధాని పండిత్ జవహర్‌లాల్ నెహ్రూ రికార్డును సమం చేశారు నరేంద్ర మోదీ. 3.0 తర్వాత ఆయన విదేశీ పర్యటనలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. గడిచిన ఐదు నెలల్లో నాలుగు సార్లు విదేశీ పర్యటనలకు వెళ్లారు. తాజాగా ఐదోసారి.. ఐదు రోజుల పర్యటనకు శనివారం(నవంబర్ 16న) బయల్దేరి వెళ్లారు. మొదట నైజీరియా చేరుకున్నారు. అక్కడ మోదీకి ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా నైజీరియా అధ్యక్షుడితో పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చింరు.
అత్యున్నత పురస్కారం..
ఇక ఆదివారం నైజీరియా అధ్యక్షుడు బొలా అహ్మద్ టినుబును మోదీ కలిశారు. నైజీరియా అధ్యక్షుడి అధికారిక నివాసంలో ఇద్దరూ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నైజీరియా అధ్యక్షుడు బొలా అహ్మద్ టినుబు.. భారత ప్రధాని మోదీకి తమ దేశ అత్యున్నతమైన పురస్కారం గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది నైజెర్ ప్రధానం చేశారు. తనకు అత్యున్నత పురస్కారం ప్రధానం చేసిన అధ్యక్షుడికి మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఇది భారత దేశానికి, శతాబ్దాలుగా ఇండియా–నైజీరియా మధ్య కొనసాగుతున్న బంధానికి దక్కిన గౌరవంగా మోదీ అభివర్ణించారు.
21 వరకు విదేశీ పర్యటన..
ఇదిలా ఉంటే.. మోదీ విదేశీ పర్యటన నవంబర్ 21 వరక కొనసాగుతుంది. నైజీరియా తర్వాత మోదీ బ్రెజిల్ వెళ్తారు. తర్వాత గుయానాలో పర్యటిస్తారు. ఇక నైజీరియా అధ్యక్షుడు టిసుబు ఆహ్వానం మేరకు ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలను పటిష్టం చేసుకునేందుకు ఇరు దేశాధినేతలు అంగీకారం తెలిపారు.
PM @narendramodi receives Nigeria’s second-highest national award – the Grand Commander of the Order of the Niger. Its a pride moment for every Indian for such a honor to our beloved leader.
Jai Hind #PMModiInNigeria pic.twitter.com/joWG4Rrrli
— Pralhad Joshi (@JoshiPralhad) November 17, 2024