USA Forrest : సరదాగా మూడు గంటలపాటు కొండల్లో నడుద్దామని వెళ్లిన ఓ వ్యక్తి అక్కడ దారి తప్పాడు. దారి కనుక్కోవడానికి పది రోజులు పట్టింది. ఈ పది రోజులు నీళ్లు తాగుతూనే, పండ్లు తింటూ బతికాడు.
అమెరికాలో…
అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన లూకాస్ మెక్లిష్ జూన్ 11న సరదాగా ది శాంటక్రజ్ పర్యవతాలపై మూడు గంటలు గడిపేందుకు వెళ్లాడు. అతను కొద్దిసేపు నడిచాక దారి తప్పాడు ఆ మార్గంలో ఉండాల్సిన గుర్తులు కార్చిచ్చు కారణంగా ధ్వంసమయ్యాయి. దీంతో గందరగోళానికి గురయ్యాడు. జూన్ 16 వరకు ఎదరు చూసిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
డ్రోన్ల సాయంతో గాలింపుతో..
కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో మెక్లిష్ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఎవరో సాయం కోసం అరవడం గమనించినా కచ్చితంగా అతడు ఎక్కడ ఉన్నాడో గుర్తించలేకపోయారు. కొన్ని రోజులపాటు గాలించినా ఫలితం లేకపోయింది. దీంతో వారం రోజులు డ్రోన్లతో గాలించారు. చివరకు బిగ్ బేసిన్ రెడ్ వుడ్ స్టేట్ పార్కులో చిక్కుకున్నట్లు గుర్తించారు. అత్యంత నీరసంగా ఉన్న అతడిని రెస్క్యూ చేశారు.
మూడు వస్తువులే..
ఇక అతడి వద్ద ఒక ఫ్లాష్ లైటు, ఫోల్డింగ్ సీజర్స్, బూట్లు మాత్రమే ఉన్నాయి. పది రోజులు గుట్టల్లో పారే సెలయేటి నీటిని తాగుతూ బతికేశాడు. రోజుకు ఒక గ్యాలన్ నీటిని తాగి ప్రాణాలు నిలిపుకున్నాడు. అడవిలో అక్కడక్కడా లభించే వైల్డ్ బెర్రీస్ తింటూ కడుపు నింపుకున్నట్లు వెల్లడించాడు. అమెరికాలోని ఇలాంటి చిట్టడవుల్లో తప్పిపోతే ప్రాణాలతో బయటకు రావడం చాలా కష్టం.