Kalki 2898 AD Characters : కల్కి మూవీ లోని ఆ 4 పాత్రలను పురాణాల ఆధారంగా తీసుకున్నారనే విషయం మీకు తెలుసా..?

Kalki 2898 AD Characters ఇక 27వ తేదీన సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి ఈ సినిమా సక్సెస్ అవుతుందా లేదా అనేది తెలియాలంటే రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే...

Written By: NARESH, Updated On : June 24, 2024 3:24 pm

Kalki 2898 AD Characters

Follow us on

Kalki 2898 AD Characters : ప్రస్తుతం ఎక్కడ చూసినా కల్కి సినిమా ఫీవర్ నడుస్తుంది. మరో మూడు రోజుల్లో ఈ సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించిన ప్రచార చిత్రాలు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటున్నాయి. అలాగే సినిమా యూనిట్ నిర్వహిస్తున్న ప్రమోషన్స్ కూడా ప్రతి ఒక్కరిని ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేసేలా చేస్తున్నాయి. ఇక ఈ సినిమాని కనక మనం ఒక్కసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఈ సినిమాలోని పాత్రలను మహాభారతాన్ని ఆధారంగా చేసుకొని రూపొందించిన పాత్రలు గా మనకు తెలుస్తున్నాయి. మొదట అమితాబచ్చన్ పోషించిన పాత్ర గురించి తెలుసుకుంటే మహాభారతం లోని అశ్వద్ధామ పాత్రని రిఫరెన్స్ గా తీసుకొని ఆయన పాత్రని డిజైన్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక మహాభారతంలో కౌరవులందరూ చనిపోయిన తర్వాత ఉత్తర గర్భాన్ని విచ్చిత్తి చేసిన కారణంగా శ్రీకృష్ణుడు అశ్వద్ధామ కి ఒక శాపం అయితే పెడతాడు.

చిరంజీవి గా ఉంటున్న నీవు కుళ్లిన శరీరం తో అనుక్షణం నరకాన్ని అనుభవిస్తూ బతకమని శపిస్తాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన హిమాలయాల్లో ఇప్పటికీ బతికున్నాడని చెప్తుంటారు. మరి దానిలో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియదు. కానీ ప్రస్తుతం కల్కి అవతారానికి ఆయన సహాయం చేసే పాత్రలో నటించబోతున్నట్టుగా తెలుస్తుంది… ఇక ప్రభాస్ పోషించిన భైరవ పాత్రను కనక చూసుకున్నట్లయితే పురాణాల ప్రకారం బైరవుడు అనే పాత్ర శివుడి అంశ ద్వారా జన్మించిందే. ముఖ్యంగా శివుడికి ఐదు రూపాలు (తత్పురుష, అఘోర, సద్యోజత,వాసుదేవ, ఈశాన) ఉంటాయి. ఇక బ్రహ్మ కి కూడా ఒకప్పుడు ఐదు తలకాయలు ఉండేవి అలా బ్రహ్మ కూడా నేను శివుడి మాదిరిగానే పరబ్రహ్మ స్వరూపుడిని అంటూ అహంకారాన్ని చూపించేవాడు. నాకు ఐదు తలలు ఉన్నాయి. కాబట్టి నేను కూడా శివుడి అంతటి గొప్పవాణ్ణి అంటూ అహంకారాన్ని చూపించి శివుడిని తన కాళ్లు పట్టుకోవాల్సిందిగా కోరాడు. దాంతో ఆగ్రహానికి గురైన శివుడి లోపల నుంచి భైరవుడు అనే ఒక అవతారం వచ్చి బ్రహ్మ అయిదోవ తలను గిల్లేస్తాడు.దాంతో ఆ తల తన చెయ్యికి అతుక్కొని ఉంటుంది. అది ముల్లోకాలు తిరిగిన ఆ తల విడిపోదు.

ఇక చివరికి శ్రీమహావిష్ణువు ఆజ్ఞ మేరకు కాశీకి వెళ్లగానే ఆ తల తన చేయి నుంచి విడిపోయి అక్కడ పడుతుంది. ఇక అప్పుడు కాశీ విశ్వనాధుడు బైరవుడుని ఆ క్షేత్ర పాలకుడిగా చేస్తాడు. ఇక ఇటీవల రిలీజ్ అయిన కల్కి ప్రచార చిత్రాలను కనక మనం చూసినట్లయితే ఈ విషయం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వీటిని ఆధారంగా చేసుకొనే భైరవ పాత్ర ను క్రియేట్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక భైరవ పాత్ర కల్కిని రక్షించి తనకు హెల్ప్ చేసే పాత్రగా మనకు ప్రచార చిత్రాలను చూస్తే ఈజీగా అర్థమవుతుంది…

ఇక కమల్ హాసన్ పోషిస్తున్న కలి పాత్ర ను చూసుకుంటే మానవుడి అరిషడ్వర్గాలను తాళ్ల లాగా చుట్టి తన మెడలో వేసుకుని మానవుడిని ఆడిస్తూ ఉంటాడు. ఇక మానవుల్లో ఉన్న సుఖ సంతోషాలు అత్యాశ చావనంతవరకు కలి మానవుడిని ఏదో ఒక రూపంలో హింసిస్తూనే ఉంటాడు. ఇదే పాత్రని బేస్ చేసుకుని కమల్ హాసన్ ఒక విచిత్రమైన గెటప్ తో మనకు కనిపించబోతున్నాడు. మరి కలి మీద కల్కి ఎలాంటి పోరాటం చేస్తాడు అనేది ఈ సినిమాలో మనకు చూపిస్తున్నారు…

ఇక దీపికా పదుకొనే పాత్రను కనక చూసినట్టయితే ఈమె ‘సమ్ 80 ‘ అనే పాత్రను పోషిస్తుంది. అంటే పురాణాల ప్రకారం కల్కి శంభల అనే గ్రామం లో విష్ణుయశుడు , సుమతిల కుమారుడిగా పుడతాడని పురాణాల్లో చెప్పారు. ఇక ఇప్పుడు దానికి తగ్గట్టుగానే సుమతి పేరును సమ్ 80 గా పెట్టినట్టుగా తెలుస్తుంది. అలాగే దీపిక పదుకొనే కడుపులో నుంచే కల్కి పుట్టబోతున్నాడు అనేది కూడా మనకు ట్రైలర్ లో చాలా క్లియర్ కట్ గా చూపించారు. ఇక మొత్తానికైతే ఈ నలుగురి పాత్రలని పురాణాల ఆధారంగా చేసుకొని దర్శకుడు ఈ సినిమాని చిత్రీకరించాడు అనేది మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇక 27వ తేదీన సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి ఈ సినిమా సక్సెస్ అవుతుందా లేదా అనేది తెలియాలంటే రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే…