GHMC Commissioner: తెలంగాణ ప్రభుత్వం వారం వ్యవధిలోనే మరోమారు ఐఏఎస్‌ల బదిలీలు చేపట్టింది. గత వారం 18 జిల్లాల కలెక్టర్లను మార్చిన ప్రభుత్వం తాజాగా 44 మంది ఐఏఎస్‌లను బదిలీ చేసింది. ఈ క్రమంలో గ్రేటర్ హైదరాబాద్(జీహెచ్‌ఎంసీ) కమిషనర్‌గా అమ్రపాలిని నియమించింది. ప్రస్తుత కమిషనర్ రొనాల్డ్ రాస్‌ను ట్రాన్స్‌కో కమిషనర్‌గా బదిలీ చేసింది. తెలంగాణ సర్కార్ తాజాగా తీసుకన్న నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
హెచ్‌ఎండీఏ నుంచి..
అమ్రపాలి ప్రస్తుతం హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ(హెచ్‌ఎండీఏ)లో జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్‌గా ఉనానరు. ఆమెను జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా నియమిస్తూ సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల రొనాల్డ్ రాస్ సెలవుపై వెళ్లగా అమ్రపాలిని ఇన్‌చార్జిగా నియమించారు. ఆ సమయంలో విధులను సమర్థవంతంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితోపాటు ప్రభుత్వ ప్రజల ప్రశంసలు పొందారు. ఈ క్రమంలో ఆమెను పూర్తి కమిషనర్‌గా నియమిస్తే సమర్థవంతగా పనిచేస్తారని భావించి ఈ నియామకం చేసినట్లు తెలుస్తోంది.
ఒంగోలులో పుట్టి...
అమ్రపాలి సొంత గ్రామం ఒంగోలు నగర చివరన ఉన్న ఎన్.అగ్రహారం. కాటా వెంకటరెడ్డి–పద్మావతి దంపతుల మొదటి సంతానం. విశాఖలో ఉన్న చదువులు చదివారు. ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌లో 2010 ఏఐఎస్ బ్యాచ్‌కు చెందిన అమ్రపాలి రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకే కేటాయించారు. రాష్ట్రంలో పలు జిల్లాల కలెక్టర్‌గా పని చేశారు. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్న సమయంలో కేంద్ర సర్వీస్‌లకు వెళ్లారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తిరిగి రాస్ట్రానికి వచ్చారు. ఆమెను జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా నియమించడంపై హర్షం వ్యక్తమవుతోంది.
Also Read: Revanth Reddy: కేసీఆర్ చేసిన తప్పే.. రేవంత్ చేస్తున్నాడు.. రిజల్డ్ రిపీట్!
లేడీ సింగంగా..
అమ్రపాలి తన పనితీరుతో లేడీ సింగంగా గుర్తింపు తెచ్చుకున్నారు. విధు నిర్వహణలో చాలా కఠినంగా వ్యవహరిస్తారు. ఎక్కడా రాజీ పడే ప్రసక్తే ఉండదు. అవతలి వాళ్లు ఎలాంటి వారైనా, ఆమె చట్ట ప్రకారం పనిచేసుకుపోతారు. ఎవ్వరినీ కేర్ చెయ్యరు. రేవంత్‌రెడ్డి సీఎం అయ్యాక ఆమెకు కీలక బాధ్యతలను అప్పగిస్తున్నారు. గతేడాది హెచ్‌ఎండీఏ కమిషనర్‌గా నియమితులయ్యారు. ఆ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు. 7,200 చదరపు కిలోమీటర్లు, ఏడు జిల్లాల పరిధిలో ఉన్న హెచ్‌ఎండీఏపై తన మార్కు వేశారు. దీంతో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ప్రమోషన్ లభించింఇ.
సవాళ్లు..
జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా నియమితులైన అమ్రపాలి ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. సిటీ వేగంగా విస్తరిస్తోంది. జనాభా సంఖ్య పెరుగుతోంది. ట్రాఫిక్ సమస్యలు చాలా ఉన్నాయి. కుక్కల పెడద పెరిగింది. వర్షాకాలంలో వరదలు నగరాన్ని ముంచెత్తుతున్నాయి. మ్యాన్ హోళ్లు, డ్రెయినేజీలు ప్రమాదకరంగా మారతాయి. ఈ నేపథ్యంలో గ్రేటర్ సిటీని అంతర్జాతీయ స్థాయిలో మరింతగా అభివృద్ధి వైపు నడిపించాల్సిన బాధ్యత ఆమెపై ఉంటుంది.
Also Read: AP Cabinet : నిరుద్యోగులకు ఏపీ క్యాబినెట్ గుడ్ న్యూస్
భర్త ఐపీఎస్..
ఇక ఆమ్రపాలి భర్త సమీర్ శర్మ ఐపీఎస్ అధికారి. 2011 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ఆయనను 2018 ఫిబ్రవరి 18న పెళ్లి చేసుకున్నారు. సమీర్ శర్మది జమ్మూకశ్మీర్. ప్రస్తుతం ఆయన డామన్, డయ్యూలో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్(ఎస్పీ)గా విధులు నిర్వర్తిస్తున్నారు.