Pradeep Rawat: తెలుగు , హిందీ , తమిళం అని తేడా లేకుండా ప్రతీ భాషలోనూ వరుసగా సినిమాలు చేస్తూ, విలన్ గా, కమెడియన్ గా ఆడియన్స్ కి తిరుగులేని ఎంటర్టైన్మెంట్ ని అందించిన ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ నిన్న తన నివాసం లో గుండెపోటు వచ్చి మరణించిన ఘటన యావత్తు సినీ లోకాన్ని శోక సంద్రం లోకి నెట్టేసింది. మన టాలీవుడ్ ఆడియన్స్ కి ప్రదీప్ రావత్ ‘సై’ సినిమాతో పరిచయం అయ్యాడు. ఈ సినిమాలో ఆయన పోషించిన భిక్షు యాదవ్ పాత్ర ని ఇప్పటికీ మరచిపోలేము. ఆ తర్వాత ఛత్రపతి, గజినీ, భద్ర , అందరివాడు , లక్ష్మి , స్టాలిన్ , దేశముదురు , యోగీ, జగడం, మస్కా , రగడ , వాల్తేరు వీరయ్య , ఇలా ఒక్కటా రెండా ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో ఆడియన్స్ లో అలరించాడు.
రెండు నెల క్రితం విడుదలైన ‘గాయపడ్డ సింహం’ సినిమాలో కూడా ప్రదీప్ రావత్ నటించారు. అలా కెరీర్ పరంగా ఫుల్ బిజీ గా ఉన్నటువంటి ప్రదీప్ రావత్ ఇలా చనిపోవడం సినీ ఇండస్ట్రీ కి ఘోరమైన నష్టం అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. ఈ సందర్భంగా సినీ ఇండస్ట్రీ కి చెందిన ప్రముఖులు ప్రదీప్ రావత్ కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ , ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.ఇదంతా పక్కన పెడితే ప్రదీప్ రావత్ గురించి ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి. ఈయనకు చాలా లేటు వయస్సు లో వివాహం జరిగింది. తనకు 54 ఏళ్ళ వయస్సు వచ్చినప్పుడు కళ్యాణి అనే తెలుగు అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ‘స్టాలిన్’ మూవీ షూటింగ్ సమయం లో ఆమెతో పరిచయం ఏర్పడిందని ప్రదీప్ గతంలో జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు.
ఆమెతో ఏర్పడిన పరిచయం గురించి ప్రదీప్ ఆ ఇంటర్వ్యూ లో చెప్తూ ‘ఆమెని తొలిచూపులోనే ప్రేమించాను. ఒక ప్రముఖ వ్యక్తి చేత మధ్యవర్తిత్వం చేయించి , నా ప్రేమని అతని ద్వారా తెలిపి పెళ్లి చేసుకునే ప్రయత్నం చేసాను , వర్కౌట్ కాలేదు. కానీ విధి మేమిద్దరం కలిసి జీవించాలని రాసి పెట్టుంది. ఒకరోజు ఆమె కారు పాడవ్వడంతో, నా కారు ఎక్కారు. అక్కడి నుండి ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది’ అంటూ చెప్పుకొచ్చారు ప్రదీప్ రావత్. వీళ్లిద్దరికీ విక్రమ్ , సింగ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.