Sri Lanka: ఇక వీసా లేకుండానే శ్రీలంకకు… భారత్‌తోపాటు 35 దేశాలకు అనుమతి..!

మనం ఏ దేశానికి వెళ్లాలన్నా.. వీసా తప్పనిసరి. ప్రపంచంలో ఏ దేశ పౌరుడైనా.. మరో దేశానికి వెళ్లాలంటే ఆదేశం జారీ చేసే వీసా ఉండాలి. కానీ, ఇటీవల కొన్ని దేశాలు వీసా లేకుండానే అనుమతి ఇస్తున్నాయి.

Written By: Raj Shekar, Updated On : August 23, 2024 11:01 am

Sri Lanka

Follow us on

Sri Lanka: వీసా అనేది ఆయా దేశాన్ని సందర్శించాలనుకునే విదేశీయులకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం జారీ చేసిన పత్రం. మీ దేశానికి రుజువుగా పనిచేసే పాస్‌ పోర్టుల మాదిరిగా కాకుండా, వీసాలు మీరు విదేశాలలో ఉండటానికి అనుమతించబడే కాలాన్ని తెలిపే గుర్తులు. ఇప్పుడు వివిధ దేశాలు తమ వీసా ప్రక్రియకు సంబంధించి వివిధ రకాల నిబంధనలు పెట్టాయి. తమ అవసరాల కోసం.. ఆర్థిక వనరులు పెంచుకునేందుకు వీసాలు లేకుండానే అనేక దేశాలు పర్యాటకులను అనుమతిస్తున్నాయి. తమతో ఎలాంటి వివాదాలు లేని, తమతో మిత్రుత్వం ఉండే దేశాలకు మాత్రమే చాలా దేశాలు ఈ అవకాశం కల్పిస్తున్నాయి. ఇప్పటి వరకు భారతీయులను ప్రపంచంలో 35 దేశాలు వీసా లేకుండానే అనుమతిస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలో మరో దేశం కూడా చేరింది. పాస్‌పోర్టు ఉంటే సరిపోతుంది. ఏ దేశానికి చెందినవారో గుర్తించేందుకు పాస్‌పోర్టు తీసుకెళ్లాలి.

35 దేశాలకు శ్రీలంక అనుమతి..
తాజాగా మన పొరుగు దేశం శ్రీలంక.. భారతీయులు వీసా లేకుండా తమ దేశంలో పర్యటించేందుకు అనుమతి ఇచ్చింది. బ్రిటన్, అమెరికాతోపాటు 35 దేశాలక పౌరులు వీసా లేకుండా తమ ద్వీప దేశానికి రావొచ్చని శ్రీలంక ప్రభుత్వం బుధవారం(ఆగస్టు 21న)ప్రకటించింది. ఈ ఏడాది అక్టోబరు 1వ తేదీ నుంచి ఇది అమల్లోకి వస్తుందని ఆరు నెలలపాటు అమలులో ఉంటుందని వెల్లడించింది. ఈ మేరకు క్యాబినెట్‌ నిర్ణయం తీసుకున్నట్టు మీడియా కథనాలు వెలువడ్డాయి..

ఫీజు పెరగడంతో వివాదం..
శ్రీలంకలో ఆన్‌ అరైవల్‌ వీసాల ఫీజులు పెరగడంతో చాలా దేశాల పౌరులు శ్రీకలం వెళ్లేందుకు నిరాకరిస్తున్నారు. దీంతో టూరిజం ఆదాయం తగ్గుతోంది. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందిలో ఉన్న ద్వీపదేశం మరింత ఇబ్బంది పడుతోంది. టూరిజం ఆదాయం ఆ దేశ సంపదలో కీలకంగా ఉంది. ఈ నేపథ్యంలో భారత్, బ్రిటన్, అమెరికాతోపాటు జర్మనీ, నెదర్లాండ్స్, బెల్జియం, స్పెయిన్, ఆస్ట్రేలియా, డెన్మార్క్, పోలాండ్, సౌదీ అరేబియా, యూఏఈ, నేపాల్, ఇండోనేషియా, రష్యా, థాయ్‌లాండ్‌ తదితర దేశాల పౌఐరులకు వీసా లేకుండా పర్యటించే అవకాశం కల్పించింది.

భారతీయ పౌరులకు వీసా అవసరం లేని దేశాలు
ఇదిలా ఉంటే.. అంతర్జాతీయ పర్యటనను ప్లాన్‌ చేసేటప్పుడు మన మదిలో మెదిలే మొదటి ఆలోచన వీసా కోసం అప్లయ్‌ చేయడం. గంటల తరబడి ఆన్‌లైన్‌లో గడపడం. అయితే చాలా దేశాల్లో భారతీయులకు వీసా అవసరం లేదు. భారతీయ పాస్‌పోర్ట్‌ కలిగిన వాళ్లు అనేక దేశాలకు వీసా లేకుండా ప్రయాణించవచ్చు. లేదా వీసా ఆన్‌ అరైవల్‌ పొందవచ్చు. భారతీయులు ఈ–వీసా/ఎంట్రీ పర్మిట్‌ తో కింద పేర్కొన్న దేశాల జాబితాలో ప్రయాణించవచ్చు. ప్రస్తుతం భారత పాస్‌పోర్టు ప్రయాణ స్వేచ్ఛలో 84వ స్థానంలో ఉంది. భారతీయ పాస్‌పోర్ట్‌ కలిగిన వాళ్లు ఈ దేశాలకు వీసా లేకుండానే వెళ్లొచ్చు.

1. అల్బేనియా
2. బార్బడోస్‌
3. భూటాన్‌
4. బ్రిటిష్‌ వర్జిన్‌ ఐలాండ్స్‌
5. కుక్‌ ఐలాండ్స్‌
6. డొమినికా
7. ఎల్‌ సాల్వడార్‌
8. ఫిజీ
9. గ్రెనడా
10. హైతీ
11. జమైకా
12. కజకిస్తాన్‌
13. మకావు (ఎస్‌ఏఆర్‌ చైనా)
14. మారిషస్‌
15. మైక్రోనేషియా
16. మాంట్సెరాట్‌
17. నేపాల్‌
18. నియూ
19. ఒమన్‌
20. ఖతార్‌
21. సెనెగల్‌
22. సెయింట్‌ కిట్స్‌ అండ్‌ నెవిస్‌
23. సెయింట్‌ విన్సెంట్‌ అండ్‌ ది గ్రెనడైన్స్‌
24. శ్రీలంక
25. ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగో
26. ట్యునీషియా
27. థాయ్‌ లాండ్‌
28. వనాటు
29. శ్రీలంక