Allu Arjun: తెలుగు సినిమా ఇండస్ట్రీ అనేది ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడమే కాకుండా హీరోలను అభిమానుల దృష్టిలో చాలా ఉత్తమంగా, ఉన్నతంగా ప్రజెంట్ చేస్తూ ఉంటుంది. ఒక సినిమా చేసిన హీరో చాలా మంది అభిమానులను సంపాదించుకోవడమే కాకుండా తనకు తాను ఒక స్టార్ సెలబ్రిటీగా మారిపోతూ ఉంటాడు. ఇలాంటి క్రమంలోనే స్టైలిష్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న అల్లు అర్జున్ కూడా ప్రస్తుతం తనదైన రీతిలో సినిమాలను చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇప్పుడు పుష్ప 2 సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఆయన రీసెంట్ గా ‘మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం’ సినిమా ఈవెంట్ కి హాజరయ్యాడు. ఇక రావు రమేష్ మెయిన్ లీడ్ లో నటిస్తున్న ఈ సినిమాని సుకుమార్ భార్య నిర్మిస్తున్నారు. దానివల్లే ఆయన ఈవెంట్ కి హాజరై కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశాడు.
అవి ఏంటి అంటే ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ సమయంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థికి మద్దతు తెలుపడానికి వెళ్ళిన విషయం మనకు తెలిసిందే…దాంతో అల్లు అర్జున్ మీద చాలావరకు నెగిటివిటీ అయితే పెరిగిపోయింది. ఇక ఇప్పుడు దానికి వివరణ ఇస్తు తనకి నచ్చితే ఎవరికోసమైనా ఎక్కడిదాకా అయినా వెళతాను అంటూ ఆయన చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నిజానికి ఆయన మీద గత కొన్ని రోజుల నుంచి కూటమి నేతలకు గానీ ఇటు పవన్ కళ్యాణ్ అభిమానులు గాని తీవ్రమైన కోపంతో ఉన్నారు. ఇక దాని వల్లే పుష్ప 2 సినిమాని కూడా ఆగస్టు 15 నుంచి డిసెంబర్ 6 వ తేదీకి పోస్ట్ పోన్ చేసినట్టుగా వార్తలైతే వచ్చాయి. మరి ఇలాంటి సందర్భంలో అయిపోయిన విషయాన్ని వదిలేయక మళ్ళీ దానికి ఎక్సప్లనేషన్ ఇస్తున్నట్టుగా తనను ఎవరు ఏమి చేయలేరు తనకు తానే స్టార్ హీరోగా ఎదిగాను అన్నట్టుగా ప్రగల్బాలనైతే పలికాడు. దానివల్ల ఇటు మెగా అభిమానులతో పాటుగా, కూటమి కార్యకర్తలు కూడా విపరీతమైన కోపం తో ఉన్నారు.
నిజానికి అల్లు అర్జున్ ఎదగడానికి చిరంజీవి, పవన్ కళ్యాణ్ లు 100% సహాయం చేశారు. దాన్ని మరిచిపోయి ఈరోజు నాకు ఎవరితో పనిలేదు నేను ఒంటరిగా ఎదిగాను అనే మాటలు చెప్పడం కూడా ప్రతి ఒక్కరిని బాధపెడుతుంది. ఇక దీంతో ఆయన మీద మరింత నెగిటివిటీ అయితే పెరిగింది. ఇక పుష్ప 2 సినిమా పరిస్థితి ఎలా ఉంటుంది అనేది తెలియాలంటే డిసెంబర్ 6వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే…