Homeఅంతర్జాతీయం2022 Forbs List: అత్యంత ధనవంతులైన ఐదుగురు మహిళలు మనవాళ్లే..

2022 Forbs List: అత్యంత ధనవంతులైన ఐదుగురు మహిళలు మనవాళ్లే..

2022 Forbs List: ప్రపంచంలో ఎక్కడ వెతికినా భారతీయులు కనిపిస్తారు. తమకు అనుగుణంగా కాస్త సౌకర్యముంటే చాలు.. ఆ దేశంలో మనవాళ్లు వాలిపోతారు. చదువు, ఉద్యోగం, వ్యాపారం..ఇలా ఏ అవసరం అయినా విదేశాలకు వెళ్లేందుకు ఎక్కవగా మక్కవ చూపుతున్నారు. అయితే విదేశాల్లోకి భారతీయులు వెళ్లడమే కాకుండా అక్కడ వివిధ రంగాల్లో ఉన్నత స్థితిలోకి వెళ్తున్నారు. ముఖ్యంగా మహిళలు ఎఫ్ఎంసీజీ, సాయుధ దళాలు, ఐటీ, బ్యాంకింగ్ రంగాల్లో పెద్ద ఎత్తున రాణిస్తున్నారు. అమెరికా ఉపాధ్యక్ష స్థాయికి భారత సంతతికి చెందిన మహిళ ఎదగడం గొప్ప విషయం. ఇక తాజాగా అమెరికాలోని మహిళల్లో అత్యంత ధనవంతుల్లోనూ మనవాళ్లే ఉండడం మనదేశానికి గర్వకారణంగా చెప్పొచ్చు. ప్రతీసారి ఫోర్బ్స్ పత్రిక అత్యంత ధనవంతుల జాబితాను విడుదల చేస్తుంది. 2022 సంవత్సరానికి ఈసారి విడుదల చేసిన జాబితాలో ఐదుగురు మహిళలు భారత సంతతికి చెందిన వారే ఉండడం విశేషం. 215 డాలర్ల పైగా నికర ఆదాయం కలిగిన ఈ మహిళల ఎవరు..? వారి గురించి తెలుసుకోండి..

-జయశ్రీ వి ఉల్లాల్: ర్యాంక్ 15:
2008 నుంచి జయశ్రీ ఉల్లాల్ కంప్యూటర్ నెట్ వర్కింగ్ సంస్థ అయిన అరిస్టా నెట్ వర్క్ కు ప్రెసిడెంట్ గా ఉన్నారు. 2020 సెప్టెంబర్ లో పబ్లిక్ కి వచ్చిన క్లౌడ్ కంప్యూటింగ్ కంపెనీ అయిన స్నో ఫ్లేక్ డైరెక్టర్ల బోర్డులో చేరారు. ఇందులో ఆమె 2020లో 2.3 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని పొందారు.అయితే 2019తో పోలిస్తే ఆమె ఆదాయం 4 శాతానికి తగ్గింది. ఉల్లాల్ అరిస్టా స్టాక్ లో 5 శాతం కలిగి ఉన్నారు. అందులో కొంత భాగాన్ని ఆమె ఇద్దరు పిల్లలు, మేనకోడలు, మేనల్లుడి కోసం కేటాయించారు. 2018 అగస్టులో అరిస్టా ఉల్లాల్ సిస్కో కంపెనీతో జరిగిన వివాదాన్ని పరిష్కరించుకున్నారు. ఈ సందర్భంగా సిస్కోకు 400 మిలియన్ డాలర్లు చెల్లించడానికి అంగీకరించారు. లండన్ లోపుట్టి, భారత్ లో పెరిగిన ఈమె ప్రస్తుతం అమెరికా సంపన్నుల జాబితాలో చోటు సంపాదించుకున్నారు.

-నీర్జా సేథి: ర్యాంక్ 24:
నీర్జా సేథి భర్త దేశాయ్ తో కలిసి 1980లో మిచిగాన్ లోని ట్రాయ్లో ఐటీ కన్సల్టింగ్, ఔట్ సోర్సింగ్ సంస్థ సింటెల్ ను స్థాపించారు. 2018లో ఫ్రెండ్ ఐటీ సంస్థ అటోస్ SEని 3.4 బిలియన్ డాలర్లతో కొనుగోలు చేసింది. తన సంస్థ సింటెల్ ను స్థాపించినప్పటి నుంచి ఎగ్జిక్యూటివ్ గా పనిచేసిన సేథి, ఆటోస్ ను కొనుగోలు చేసినా అందులో చేరలేదు. సేథీ తన భర్తతో కలిసి 2వేల డాలర్ల పెట్టుబడితో తమ వ్యాపారాన్ని ప్రారంభించారు. ఆ సంస్థ భారీ లాభాలు పొందడంతో ఇప్పుడు ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకున్నారు.

-నేహ నార్ఖడే: ర్యాంక్ 57:
నేహ నార్ఖడే క్లౌడ్ కంపెనీ కాన్ ప్లూయెంట్ కి ఫౌండర్, మాజీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్. లింక్డ్ ఇన్ సాప్ట్ వేర్ ఇంజనీర్ గా, నెట్ వర్కింగ్ సైట్ ను అభివృద్ధి చేయడంలో ఆమె ఎంతో కృషి చేసింది. 2014లో తన సహోద్యోగులతో కలిసి కన్ ప్ల్యూయెంట్ ను కనుగొనేందుకు బయలుదేరారు. ఇది అపాచీ కాఫ్కాపై పెద్ద మొత్తంలో డేటాను ప్రాసెస్ చేయడంలో సంస్థలకు ఉపయోగపడుతుంది. ఇలా ఆమె కంపెనీ 388 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని పొందింది. ఇందులో ఆమెతో పాటు ఆమె కుటుంబానికి 8 శాతం వాటా ఉంది. భారత్ లోని పూణెలో పెరిగిన నీరజ జార్జియా టెక్ లో కంప్యూటర్ సైన్స్ చదివారు. ప్రస్తుతం అనేక టెక్నాలజీ స్టాటప్ లకు సలహాదారుగా ఉన్నారు.

-ఇంద్రా నూయీ: ర్యాంక్ 85:
ఇంద్రా నూయీ పెప్సీకో కు చైర్మన్ గా పనిచేశారు. 24 సంవత్సరాల తరువాత 2019లో పదవీ విరమణ చేశారు. అందులో సగం కాలం ఆమె చైర్మన్ గానే పనిచేశారు. పెప్సికో అమ్మకాలను రెట్టింపు చేయడంతో పాటు నాణ్యమైన ఉత్పత్తులు ఉండేలా చూసుకునేవారు. ఈ సమయంలో ఆమెకు అమెజాన్ నుంచి ఆఫర్ వచ్చింది. 2006లో అమెరికా కార్పొరేట్ లోని అతికొద్ది మహిళా సీఈవోల్లో ఇంద్రా నూయీ ఒకరు కావడం విశేషం.

Also Read: British Prime Minister race: బ్రిటన్ ప్రధాని రేసు: మనల్ని పాలించిన వాళ్లని మనమే పాలించే అరుదైన అవకాశం !

-రేష్మా శెట్టి: ర్యాంక్ : 97
రేష్మాశెట్టి తన భర్త బారీ కాంటన్ మరికొందరితో కలిసి 2009లో సింథటిక్ బయోటెక్నాలజీ కంపెనీ ‘జింకో బయోకవర్క్స్’ ను స్థాపించింది. MITలో బయోలాజికల్ ఇంజనీరింగ్ లో పీహెచ్ డీ చేశారు. అక్కడ ఆమె జింగో బయోవర్క్స్ కోసం కొందరిని కలిసి జింగో బయోవర్క్ కొత్త జీవులను కనుగొనడానికి, తయారు చేసే ప్రక్రియను వేగవంతం చేయడానికి డేటా అనలిటిక్స్ పరిశోధన చేసింది. 2021 సెప్టెంబర్ లో SPAC విలీనం ద్వారా జింగో బయోవర్క్స్ పబ్లిక్ గా మారింది. అయితే 2022 మే మధ్యలో షేర్లు గరిష్ట స్థాయి నుంచి 80 శాతానికి పడిపోయాయి. కొవిడ్ వ్యాప్తి చెందడంతో కంపెనీ తన బోస్టన్ సౌకర్యాలను కరోనా వైరస్ పై పరిశోధన చేయడానికి, పరీక్షలను వేగవంతం చేయడానికి ప్రారంభించింది. ఈమె కంపెనీ వల్ల భారీ లాభాలు చవిచూశారు. ఈ క్రమంలోనే అత్యంత సంపన్నురాలి జాబితాలో 97వ స్థానంలో నిలిచింది.

ఇలా భారతీయులు అన్ని రంగాల్లోనూ అగ్రపథాన దూసుకెళుతున్నారు. పురుషులు సీఈవోలు, చైర్మన్ లుగా ఎదుగుతూ విదేశాల్లోని టాప్ కంపెనీలు ఏలుతుండగా.. మన భారతీయ మహిళలు కంపెనీలు పెట్టి అత్యంత సంపాదన పరులుగా ఎదిగారు. ఎక్కడున్నా భారతీయులు తమ ప్రతిభతో అందలమెక్కుతున్నారు. ఇందుకు మహిళలు మినహాయింపు కాదని మరోసారి నిరూపితమైంది.

Also Read: Ponniyin Selvan 1: ‘పొన్నియిన్‌ సెల్వన్‌ 1’లో పాత్రలు, వాటి చరిత్రలు ఇవే !

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular