Homeఅంతర్జాతీయంPakistan Economic Crisis: తూ.. ఎందుకురా మీ బతుకు.. ఇంత దరిద్రమా.. బిచ్చగాళ్ల డబ్బులూ వదలరా?

Pakistan Economic Crisis: తూ.. ఎందుకురా మీ బతుకు.. ఇంత దరిద్రమా.. బిచ్చగాళ్ల డబ్బులూ వదలరా?

Pakistan Economic Crisis: మేఘాల్లో నీటిని చూసి ముంత ఒలకబోసుకున్నట్లుగా వ్యవహరిస్తోంది మన దాయాది దేశం. డబ్బుల కోసం ఎంతకైనా దిగజారే పాకిస్తాన్‌.. తాజాగా తోటి ఇస్లామిక్‌ దేశం అయిన సౌదీ అరేబియాకు ఒక ప్రతిపాదన చేసింది. తమ దేశం నుంచి సౌదీ అరేబియాకు వచ్చి పనులు చేసుకునేవారితోపాటు అక్కడ భిక్షాటన చేసేవారు ఏటా తమ దేశానికి 10 బిలియన్‌ డాలర్లు పంపిస్తారు.. ఈ పది బిలియన్‌ డాలర్లు వచ్చే ఆర్థిక సంవత్సరం మాకు రానున్నాయి. వీటినే […]

Pakistan Economic Crisis: మేఘాల్లో నీటిని చూసి ముంత ఒలకబోసుకున్నట్లుగా వ్యవహరిస్తోంది మన దాయాది దేశం. డబ్బుల కోసం ఎంతకైనా దిగజారే పాకిస్తాన్‌.. తాజాగా తోటి ఇస్లామిక్‌ దేశం అయిన సౌదీ అరేబియాకు ఒక ప్రతిపాదన చేసింది. తమ దేశం నుంచి సౌదీ అరేబియాకు వచ్చి పనులు చేసుకునేవారితోపాటు అక్కడ భిక్షాటన చేసేవారు ఏటా తమ దేశానికి 10 బిలియన్‌ డాలర్లు పంపిస్తారు.. ఈ పది బిలియన్‌ డాలర్లు వచ్చే ఆర్థిక సంవత్సరం మాకు రానున్నాయి. వీటినే సెక్యూరిటీ డిపాజిట్‌గా భావించి రుణం ఇవ్వండి అని కోరింది.

సాయం కోరినందుకు కండీషన్లు..
సౌదీ అరేబియాకు, పాకిస్తాన్‌కు మధ్య డిఫెన్స్‌ డీల్‌ ఉంది. ఒకరికి సమస్య వస్తే మరొకరు పోరాడలి. ప్రస్తుతం ఇరాన్‌ దాడులతో సౌదీ ఆయిల్‌ కేంద్రాలు, వాటర్‌ ప్లాంట్లు, రియాద్, టూరిజం ప్రభావితమయ్యాయి. అమెరికా స్థావరాలు ఉన్నందున ఈ దాడులు జరుగుతున్నాయి. దీంతో సౌదీ పాకిస్తాన్‌ సైనిక సహాయం కోరింది. గతంలో సౌదీ పాకిస్తాన్‌కు రుణాలు, సాయాలు చేసినప్పటికీ ఇప్పుడు పరిస్థితి మారింది.

Also Read: గల్ఫ్ యుద్ధం : పాక్ చావుకొచ్చిది.. దెబ్బకు ఆ పనిచేస్తోంది…

పాకిస్తాన్‌ కండీషన్లు
పాకిస్తాన్‌ సహాయానికి ముందు 5 బిలియన్‌ డాలర్లు 10 ఏళ్ల డిపాజిట్‌ చేయాలని, ఆయిల్‌ సరఫరా 5 బిలియన్‌ బ్యారెళ్లకు పెంచాలని, దానికి సంబంధించిన డబ్బులు 3 ఏళ్ల తర్వాతచెల్లిస్తామని, పాక్‌ బాండ్స్‌ విక్రయిస్తామని వాటికి గ్యారంటీగా ఉండాల, ఇక సౌదీలో ఉండే ఉద్యోగులు, యాచకులు తమ దేశానికి ఏటా 10 బిలియన్‌ డాలర్లు పంపుతారని, వాటిని సెక్యూరిటీ డిపాజిట్‌గా తీసుకుని తమకు రుణాలు ఇవ్వాలని కండీషన్లు పెట్టింది.

వ్యూహాత్మక లక్ష్యాలు
పాకిస్తాన్‌ ఆర్థిక సంక్షోభంలో ఉండి సౌదీని ఒత్తిడికి గురిచేస్తోంది. ఈ డీల్‌ ద్వారా సైనిక బలోపేతం, ఆర్థిక లాభాలు పొందాలని చూస్తోంది. సౌదీ పాక్‌ సైన్యాన్ని ఉపయోగించుకోవాలని, ప్రతిగా పెట్టుబడులు ఇవ్వాలని ప్లాన్‌.

పాకిస్తాన్‌ ఇస్లామిక్‌ దేశాల సహాయం తీసుకుంటూ ఎట్టి సహాయం చేయడం లేదు. ఈ ప్రతిపాదనలు సౌదీని మోసం చేయాలనే ప్రయత్నంగా కనిపిస్తాయి. ఫలితంగా ఇస్లామిక్‌ దేశాల మధ్య విశ్వాసం దెబ్బతింటుంది. పాక్‌ ఆర్థిక వ్యూహం దీర్ఘకాలంలో దానికే విషాదం కలిగిస్తుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper