Sampradayini Suppini Suddapoosani closing collections: ఈ మధ్య కాలం లో సోషల్ మీడియా లో నిత్యం ట్రెండ్ అవుతున్న సెలబ్రిటీస్ లలో ఒకరు శివాజీ. ఆయన టైం ఏంటో అసలు అర్థం కావడం లేదు, ఏమి మాట్లాడిన వైరల్ అయిపోతూ ఉంది. ముఖ్యంగా హీరోయిన్స్ ధరించే దుస్తులపై ఆయన చేసిన కామెంట్స్ కి జనాల నుండి మద్దతు లభించింది. మిడిల్ ఏజ్ జనాల్లో శివాజీ క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. సరిగా ఈ క్రేజ్ ని క్యాష్ చేసుకుందాం అనే ఆలోచనతోనే చాలా కాలం తర్వాత ఆయన హీరో గా నటించిన ‘సాంప్రదాయినీ సుప్పినీ సుద్దపూసని ‘ చిత్రాన్ని థియేటర్స్ లో ధైర్యం గా విడుదల చేసాడు. ముందుగా ఈ సినిమాని డైరెక్ట్ ఓటీటీ విడుదల చెయ్యాలని అనుకున్నారు. కానీ శివాజీ ధైర్యం చేసి థియేటర్స్ లో విడుదల చేశాడు. ఈ చిత్రానికి నిర్మాత కూడా ఆయనే కావడం విశేషం.
విడుదలకు ముందు ప్రొమోషన్స్ కూడా ఆయన గట్టిగా చేసాడు. ఆడియన్స్ కి అవి చాలా కొత్తగా అనిపించాయి. అందుకే ఈ సినిమా ని థియేటర్స్ లో చూడడానికి ఒక సెక్షన్ ఆడియన్స్ ఆసక్తి చూపించింది. మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ వచ్చినప్పటికీ కూడా ఈ చిత్రానికి డీసెంట్ రేంజ్ ఓపెనింటిగ్ వసూళ్లు నమోదు అయ్యాయి. అంతే కాకుండా క్లోజింగ్ వసూళ్లు కూడా చాలా డీసెంట్ గా వచ్చాయి. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా క్లోజింగ్ లో 4 కోట్ల రూపాయిల గ్రాస్ వసూ.ళ్లు వచ్చాయట. అంతే కాదు , ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా చాలా డీసెంట్ వసూళ్లను నమోదు చేసుకుంది. దాదాపుగా లక్ష డాలర్ల గ్రాస్ వసూళ్లు ఓవర్సీస్ నుండి వచ్చాయట. శివాజీ లాంటి మార్కెట్ లేని సీనియర్ హీరో కి ఇది చాలా అంటే చాలా ఎక్కువ అనే చెప్పాలి.
Also Read: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ నుండి ఆ పాటని తొలగించిన మేకర్స్..పూర్తి వివరాలు ఎక్సక్లూసివ్ గా మీకోసం!
ఈ చిత్రాన్ని నిర్మించడానికి శివాజీకి కనీసం రెండు కోట్ల రూపాయిల బడ్జెట్ కూడా ఖర్చు అయ్యి ఉండదు. కేవలం కోటి రూపాయిల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తీసి వదిలాడు. ఫలితంగా భారీ లాభాలను మూటగట్టుకున్నాడు. ఆయన గత చిత్రం ‘దండోరా ‘ కి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ కూడా కలెక్షన్స్ రాలేదు. కానీ ఈ సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చినప్పటికీ కూడా మంచి కలెక్షన్స్ వచ్చాయి. దీనిని బట్టీ చూస్తుంటే ఆడియన్స్ జడ్జిమెంట్ ఎప్పుడు ఎలా ఉంటుందో ఊహించడం చాలా కష్టం అయిపోతుంది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం ‘ఈటీవీ విన్ ‘ యాప్ లో స్ట్రీమింగ్ కాబోతుంది.