Union Cabinet: కేంద్ర మంత్రివర్గంలో మార్పులు, చేర్పులకు రంగం సిద్ధమవుతోంది. ఇద్దరు మంత్రుల రాజీనామాతో కొత్త వారితో వాటిని భర్తీ చేయాల్సి ఉంది. త్వరలో జరనున్న రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా రానున్న సార్వత్రిక ఎన్నికలను పరిగణలోకి తీసుకుని కేంద్ర మంత్రివర్గ విస్తరణ కూర్పు ఉండనుంది. ఈ ఏడాది డిసెంబరులో గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్, వచ్చే ఏడాది కర్ణాటక, తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగనున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని కేంద్ర మంత్రివర్గంలో ఆయా రాష్ట్రాలకు ప్రాధన్యం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

తెలుగు రాష్ట్రాలకు ప్రాధాన్యత?
ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి ఒక్కరే కేంద్ర కేబినెట్‌లో మంత్రిగా ఉన్నారు. ఏపీ నుంచి కేంద్రంలో ప్రాతినిధ్యం లేదు. ప్రస్తుతానికి ఆ అవకాశం కనిపించటం లేదు. ఏపీ కంటే తెలంగాణపైన కేంద్ర ఎక్కువగా ఫోకస్ పెట్టింది. ఈసారి విస్తరణలో తెలంగాణ నుంచి కేంద్ర కేబినెట్‌లో మరొకరికి అవకాశం దక్కుతుందని తెలుస్తోంది.
Also Read: BJP Mission South India: ప్రెసిడెంట్ ఎన్నికల తర్వాతనే ‘దక్షిణం’పై దండయాత్ర
రేసులో ఆ ఇద్దరూ..
రాజ్యసభ పదవీకాలం ముగియడంతో ఇటీవల ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, ఆర్‌సీపీ.సింగ్ వారి రాజ్యసభ పదవీకాలం ముగియడంతో ఇటీవల రాజీనామా చేశారు. పనితీరు ఆధారంగా కొందరు మంత్రులను క్యాబినెట్ నుంచి తప్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో.. తెలంగాణ నుంచి క్యాబినెట్‌లో ఒకరికి పదవి ఖాయమన్న వాదన వినిపిస్తోంది. ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన లక్ష్మణ్, బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లుగా చెబుతున్నారు. సామాజిక సమీకరణాలు.. తెలంగాణలో ప్రభావం చూపించగలిగే నేతకు అవకాశం ఇవ్వాలనే ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

తెలంగాణలో పాగా వేయాలని..
తెలంగాణలో వచ్చే ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న బీజేపీ అధినాయకత్వం సంజయ్‌ను రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలకే పరిమితం చేసే అవకాశాలు ఉన్నాయని సీనియర్లు అంచనా వేస్తున్నారు. ఆయన నాయకత్వంలో ఎన్నికలకు వెళ్తేనే పార్టీకి విజయావకాశాలు ఎక్కువ ఉంటాయని అధిష్టానం భావిస్తోంది. ఈ నేపథ్యంలో క్యాబినెట్‌లోకి లక్ష్మణ్‌ను తీసుకోవచ్చని భావిస్తున్నారు. పార్టీ జాతీయ నేతలతో సత్సంబంధాలు సైతం లక్ష్మణ్‌కు కలిసి వచ్చే అవకాశం ఉంది. అయితే, కొత్తగా రాజ్యసభ అవకాశం కల్పించి.. ఆ వెంటనే మంత్రి పదవి ఇస్తారా అనే సందేహం వ్యక్తం అవుతోంది.
Also Read:Actress Priya Anand: నిత్యానంద స్వామితోనే తన పెళ్లి.. ప్రముఖ హీరోయిన్ షాకింగ్ నిర్ణయం
[…] […]