Ponniyin Selvan 1: క్లాసిక్ డైరెక్టర్ మణిరత్నం చారిత్రక కథాంశంతో తెరకెక్కిస్తున్న చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్ 1’. రెండు భాగాలుగా రానున్న ఈ చిత్రాన్ని దాదాపు 500 వందల కోట్ల భారీ బడ్జెట్ తో ఇండియన్ స్క్రీన్ పై మునుపెన్నడూ రాని సరికొత్త విజువల్ వండర్ గా తీసుకువస్తున్నారు. ఈ అత్యంత ప్రతిష్టాత్మక చిత్రంలో ఆదిత్య కరికాలన్ గా విక్రమ్, పొన్నియిన్ సెల్వన్ గా జయం రవి, వల్లవ రాయన్ వంద్యదేవన్ గా హీరో కార్తి, నందిని అండ్ మందాకిని దేవిగా ఐశ్వర్యారాయ్ ద్విపాత్రాభినయం, కుండవై పిరట్టియార్ గా త్రిష కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ పాత్రలన్నిటికీ ఒక చరిత్ర ఉంది. మరి ఈ పాత్రల గురించి తెలుసుకుందాం.
చియాన్ విక్రమ్ నటించిన ఆదిత్య కరికాలన్ పాత్ర గురించి :
ఆదిత్య కరికాలన్ 10వ శతాబ్దంలోని చోళ యువరాజు. ఆదిత్య తిరుకోయిలూరులో జన్మించాడు. గొప్ప యుద్ధ వీరుడు. అతన్ని వీరపాండియన్ తలై, కొండ కోపరకేసరి వర్మన్ కరికాలన్ అని కూడా పిలిచేవారు. ఆదిత్య ది ఫియర్స్ వారియర్. అలాగే ది వైల్డ్ టైగర్. ఈ పాత్రలో విక్రమ్ నటన అద్భుతంగా ఉండబోతుంది.
జయం రవి నటించిన పొన్నియన్ సెల్వన్ పాత్ర :
పొన్నియన్ సెల్వన్, ఆదిత్య కరికాలన్ కి తమ్ముడు. ఇతన్ని రాజ రాజ చోళన్ గా కూడా పిలుస్తారు. తన కాలంలోని గొప్ప యోధులలో ఒకరిగా పొన్నియన్ సెల్వన్ కి గొప్ప పేరు ఉంది. గొప్ప పరిపాలనా నైపుణ్యాలతో పొన్నియన్ సెల్వన్ పేరు శాశ్వతంగా చరిత్రలో నిలిచిపోయింది. ఈ పాత్రలో జయం రవి నటన కూడా సినిమాకి హైలైట్ గా ఉంటుందట.
హీరో కార్తి నటించిన వల్లవరాయన్ వంద్యదేవన్ పాత్ర :
రాజ్యం లేని యువరాజు, గూఢచారి అయినా దూకుడుగా ఉండే గొప్ప సాహసికుడు. వంద్యదేవన్ వంశానికి వారసుడు. గొప్ప వీరుడు, అలాగే గొప్ప మానవత్వం ఉన్న మనిషి. పేదలకు పెన్నిధి. ఈ పాత్రలో కార్తి నటించాడు. కార్తి నటన చాలా సహజంగా ఉంటుందట.
ఐశ్వర్యారాయ్ నటించిన నందిని దేవి అండ్ మందాకిని పాత్రలు :
‘ప్రతీకారానికి అందమైన ముఖం. ఆమె పళువూరు రాణి నందిని’. ఇక మందాకిని పాత్ర కూడా గొప్ప మహారాణి పాత్ర. ఈ రెండు పాత్రల్లో ఐశ్వర్యారాయ్ చక్కగా ఒదిగిపోయింది. మహారాణిగా ఐశ్వర్య రాయ్ చాలా గ్రేస్ ఫుల్ గా కనిపించింది. ఐశ్వర్య రాయ్ బచ్చన్ కోసం దాదాపు 18 మంది డిజనర్లు పనిచేశారు.
Also Read: Renu Desai: పవన్ కళ్యాణ్ మాజీ భార్య ఆనందానికి అసలు కారణం అదేనట?
త్రిష నటించిన కుండవై పిరట్టియార్ పాత్ర :
పురుషుల ప్రపంచంలో, ధైర్యం ఉన్న స్త్రీగా గొప్ప పేరు ప్రఖ్యాతలు సాధించింది యువరాణి కుండవై పిరట్టియార్. ఆమె పాత్రలో త్రిష కూడా అంతే హుందాగా కనిపించింది. ముఖ్యంగా త్రిష – ఐశ్వర్య రాయ్ పాత్రల మధ్య వ్యూహాల పోరు అద్భుతంగా ఉంటుందట.
10వ శతాబ్దం నేపథ్యంలో సాగే ఈ చిత్రం చోళ రాజవంశం చుట్టూ సాగుతుంది. ఈ రాజ్యాన్ని హస్త గతం చేసుకోవడానికి కుటుంబాల మధ్య జరిగిన సమరమే ఈ చిత్రం. చరిత్రలో దాగిన వీరుల కథలకు ఫిక్షనల్ అంశాలని జోడించి మణిరత్నం ఈ సినిమాని తెరకెక్కించాడు. చరిత్రలో చోళ రాజ్యానికి చాలా ప్రత్యేకత వుంది. చాలా ఏళ్ల పాటు సుదీర్ఘంగా పాలించిన ఘనత చోళ రాజులది. లార్జర్ దేన్ లైఫ్ స్టోరీ కావడంతో దీన్ని రెండు బాగాలుగా తీసుకొస్తున్నారు. అంతఃపురం వ్యూహాలు, కుట్రలు కుతంత్రాల సమాహారంగా ఈ చిత్రం ఉండనుంది. అందుకే ఈ సినిమాలో ఎవరూ హీరోలు కాదు. కీలకమైన పాత్రల సమాహారమే ఈ సినిమా. మరి సామ్రాజ్యం కోసం గ్రేట్ సోల్జర్స్ మధ్య జరిగిన ఈ యుద్ధం వెండితెర పై ఎలా ఉంటుందో సెప్టెంబర్ 30న చూద్దాం.
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
Read MoreWeb Title: These are the characters and their histories in ponniinselvan 1
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com