https://oktelugu.com/

Husband For Wife : సునామీలో తప్పిపోయిన భార్య.. ఆమె కోసం 13 ఏళ్లుగా వెతుకులాట! అసలేం జరిగిందంటే?

యసువో తకమాట్సు అనే వ్యక్తి భార్య యుకో కూడా ఈ సునామీలో తప్పిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు తన భార్య కోసం వెతకసాగాడు. అతను ఇప్పటికీ తన భార్యకు అంత్యక్రియలు జరపలేదు. తన భార్య దొరికితేనే అంత్యక్రియలు జరుపుతానని నిర్ణయించుకున్నాడు. అయితే అతని భార్య యూకో బ్యాంకులో పనిచేసే ఉద్యోగి. సునామీ సమయంలో అక్కడ ఉండటంతో ఆమె కొట్టుకుపోయింది.

Written By:
  • Neelambaram
  • , Updated On : August 23, 2024 / 05:29 PM IST

    Husband For Wife

    Follow us on

    Husband For Wife :  ఈరోజుల్లో భార్యాభర్తలు కలిసి ఉండటం కంటే ఎక్కువ జంటలు దూరంగా ఉన్నాయి. పార్ట్‌నర్ చనిపోయిన లేదా వేరే కారణాలతో దూరం అయితే కొన్ని రోజులు బాధపడి వదిలేస్తారు. ఆ తర్వాత కొత్త పార్ట్‌నర్‌ను వెతుక్కుంటున్నారు. ఎవరో కొంతమంది మాత్రమే తన పార్ట్‌నర్‌ను తలుచుకుంటూ జీవితాంతం తన గుర్తులతో గడిపేస్తారు. ఎక్కువ రద్దీ ఉండే ప్రదేశాల్లో, ఇంకా వేరే కారణాల వల్ల పార్ట్‌నర్ కొన్నిసార్లు మిస్ అవ్వచ్చు. అయితే కొన్ని రోజులు వెతికి ఆ తర్వాత వదిలేస్తారు. దొరకటలేదు కదా ఇంకెందుకు వెతకడం అని భావించి వాళ్లను మర్చిపోతారు. కానీ జపాన్‌కి చెందిన ఓ వ్యక్తి మాత్రం 13 ఏళ్లుగా తన పార్ట్‌నర్ కోసం వెతుకుతున్నాడు. వినడానికి మీకు ఆశ్చర్యంగా అనిపించిన నిజం. ఇంతకీ ఎవరు ఆ వ్యక్తి? తన భార్య ఎలా తప్పిపోయింది? అసలు ఏం జరిగిందో? పూర్తి స్టోరీ తెలుసుకుందాం.

    జపాన్‌లో 2011లో భయంకరమైన సునామీ వచ్చింది. పుకుషిమా తీరంలో వచ్చిన ఈ సునామీ ప్రజలను భీకరంగా భయపెట్టింది. అయితే ఈ సునామీలో దాదాపు 20 వేల మంది చనిపోగా.. 2500 మందికి పైగా తప్పిపోయారు. అయితే యసువో తకమాట్సు అనే వ్యక్తి భార్య యుకో కూడా ఈ సునామీలో తప్పిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు తన భార్య కోసం వెతకసాగాడు. అతను ఇప్పటికీ తన భార్యకు అంత్యక్రియలు జరపలేదు. తన భార్య దొరికితేనే అంత్యక్రియలు జరుపుతానని నిర్ణయించుకున్నాడు. అయితే అతని భార్య యూకో బ్యాంకులో పనిచేసే ఉద్యోగి. సునామీ సమయంలో అక్కడ ఉండటంతో ఆమె కొట్టుకుపోయింది. దీంతో అతను పుకుషిమా సమీపంలో ఉన్న మురికి కాలువ నుంచి సముద్రంలో కూడా వెతకసాగాడు. అయితే సముద్రంలో వెతకాలంటే స్కూబా డ్రైవింగ్ రావాలి. దీనికోసం స్పెషల్‌గా ఓ వ్యక్తి దగ్గర నేర్చుకుని అప్పటి నుంచి ఇప్పటికీ వెతకసాగాడు.

    సునామీ ప్రదేశంలో ప్రతీవారం స్కూబా డ్రైవింగ్ చేస్తాడు. ఎప్పుడో చనిపోయిన భార్య కోసం ఇంకా వెతుకుతున్నాడని అందరూ హేళన చేస్తున్నా.. తన ప్రయత్నాన్ని మాత్రం ఆపలేదు. తన భార్య సముద్ర శిథిలాల్లో ఎక్కడో ఒక దగ్గర ఉంటుందని తకమాట్సు నమ్మకం. ఎంతో మంది తనకు అడ్డుపడిన తన భార్య కోసం ఇప్పటికీ 600 కంటే ఎక్కువ సార్లు సముద్రంలోకి వెళ్లాడు. తన భార్య అవశేషాలు దొరికితేనే అంత్యక్రియలు చేస్తానని ఇప్పటికీ తనకు అంత్యక్రియలు పూర్తి చేయలేదు. సముద్రంలో ఏదో ఒక మూల తన భార్య తప్పకుండా ఉంటుందని.. ఏదో రోజూ దొరుకుతుంది. నా ప్రయత్నం ఏం వృథా కాదని అతను అంటున్నారు. నెల రోజుల కనిపించకపోతేనే మనం వదిలేస్తాం. కానీ అతను తన భార్య కోసం 13 ఏళ్ల నుంచి ప్రతీవారం సముద్రంలో వెతుకుతున్నాడు. తనకు తన భార్య అంటే ఎంత ఇష్టమో దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. ఇప్పటికీ అయిన తన భార్య దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం