Kim’s wife : కిమ్‌ భార్యకు 100 రూల్స్‌.. మగాడు పుట్టేవరకు పడుకోవాల్సిందే !

ఉత్తరకొరియా.. భూమిపైనే ఉన్న మరో ప్రపంచం. దేశాలన్నిటిలో నార్త్‌ కొరియా రూటే సపరేటు. ప్రపంచంతో సంబంధం లేని ఈ దేశంలో జీవించడం అంత ఈజీ కాదు. నియంత కిమ్‌ పాలనలో ప్రజలే కాదు కుటుంబ సభ్యులు నరకం అనుభవిస్తున్నారు.

Written By: NARESH, Updated On : August 20, 2024 10:58 am

North Korea President Kim Wife

Follow us on

Kim’s wife : ఉక్రెయిన్‌.. ప్రపంచ పెద్దన్న అమెరికా వెన్నులో వణుకు పుట్టిస్తున్న చిన్న దేశం ఇది. రష్యా, చైనాతో మైత్రిని కొనసాగిస్తున్న ఆ దేశ అధ్యక్షుడు, నియంత కిమ్‌ మిగతా దేశాలతో తనకు సంబంధం, అవసరం లేదన్నట్లు వ్యవహరిస్తున్నారు. పొరుగున ఉన్న అమెరికా, దక్షిణ కొరియాకు తన చర్యలతో కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. నియంత అయిన కిమ్‌ గురించి ఏడాది పొడవునా ఏదో ఒక సంచలన విషయం బయటపడుతుంది. ఈ నియంత గురించి సంచలన విషయాలు, ఆయన తీసుకునే నిర్ణయాలు, ఆ దేశంలో ఆయన విధించే ఆంక్షల గురించి అంతర్జాతీయ మీడియాలో తరచూ వస్తూనే ఉంటాయి. అక్కడి ప్రజలకు కూడా ఈ ప్రపంచంతో ఎలాంటి సంబంధం ఉండదు. అక్కడి ప్రజలకు వారి అధ్యక్షుడు, అతడి కుటుంబ సభ్యుల గురించి మాత్రమే తెలుసు. అక్కడి ప్రజలు కిమ్‌ను దైవంగా భావిస్తారు. కానీ ఇదంతా బయటకు మాత్రమే అక్కడి ప్రజల మనసులో మాత్రం అతడు లేడు. వారు ఈ విషయాన్ని బయటకు చెప్పలేరు. ఇక కిమ్‌ భోగాల గురించి చెప్పుకుంటూ పోతే ఈ జీవితమే సరిపోదేమో. అక్కడి ప్రజలకు అతని పెట్టే రూల్స్‌ ఒక్కోసారి చిత్ర విచిత్రంగా అనిపిస్తాయి. కిమ్‌ ప్రభుత్వం విధించిన ఆంక్షలను ఎవరైనా ఉల్లంఘిస్తే వారికి కఠినమైన శిక్షలు విధిస్తారు.

కిమ్‌ భార్య పరిస్థితి కూడా అంతే..
ఇక నియంతకు భార్యగా ఉండడం అంత ఈజీ కాదు. కిమ్‌కు చాలా మంది భార్యలు ఉన్నారు. అంతేకాదు దేశంలో 16 ఏళ్లు నిండిన యువతులు కిమ్‌కు వ్యక్తిగత సేవకులుగా ఉంటారు. వారికి 21 ఏళ్లు రాగానే విముక్తి చేస్తారు. అందమైన అమ్మాయిలే కిమ్‌ వ్యక్తిగత టీంలో ఉంటారు. కిమ్‌ అక్కడి ప్రజలకే కాదు తన భార్యకు కూడా ఎన్నో రూల్స్‌ పెట్టారు. కిమ్‌ భార్య మంచి గాయని, చీర్‌ లీడర్‌. అయితే ఆమెను కిమ్‌ తండ్రి, నియంత కిమ్‌ జంగ్‌ ఇల్‌ ఓ కార్యక్రమంలో చూశాడు. ఆ తర్వాత 2008లో గుండె నొప్పితో బాధపడుతున్న ఇల్‌ ఆమెను పెళ్లి చేసుకోవాలని కిమ్‌ని ఆదేశించాడు. దీంతో ఆమెను కిమ్‌ 2009 లో బలవంతంగా పెళ్లి చేసుకున్నాడట. అంతేకాదు పెళ్లి తర్వాత కిమ్‌ తన భార్య పేరును కూడా మార్చేశారట. పెళ్లయిన దగ్గర నుండి ఆమె తన తల్లిదండ్రులను కూడా కలవడానికి కిమ్‌ ఒప్పుకోలేదు. చివరికి ఆమె కిమ్‌ సూచించిన దుస్తులే వేసుకోవాలి, అతనికి నచ్చిన హెయిర్‌ ఫైల్‌ ఇలా చాలా ఆంక్షలు విధించాడట. ఇక ఆమె ఒంటరిగా బయటకు వెళ్లడానికి వీలు లేదు. కేవలం భర్తతోనే బయటకు వెళ్లాలి. వీరికి 2010లో మొదట బిడ్డ జన్మించింది. ఆ తర్వాత కొన్నాళ్లకు మరో బిడ్డ జన్మించింది. ఇలా ఇద్దరూ ఆడపిల్లలే పుట్టడంతో కిమ్‌ సంతోషంగా లేడట.

మగబిడ్డ కోసం…
దీంతో కిమ్‌ తన భార్యకు కఠిన ఆక్షంలు పెట్టారు. మగ బిడ్డ జన్మించే వరకు పిల్లలను కనాలని ఆమెను ఆదేశించాడట. కొన్నాళ్ల కిందట కిమ్‌ కి మరో బిడ్డ జన్మించింది. కానీ కూతురు జన్మించిందా..? కొడుకు జన్మించాడా..? అనేది బయటకు ప్రకటించలేదు. కానీ మగ బిడ్డ జన్మించినట్లు కొన్ని మీడియా సంస్థలు తెలిపాయి. ఇక గతేడాది ఆర్మీ నిర్వహించిన పరేడ్‌లో కిమ్‌ తన భార్య రీ సోల్‌ జూ తన కుమార్తె జూయే తో కలిసి విందుకు హాజరయ్యాడు. ఈ వేడుకల్లో బాంక్వెట్‌లో టేబుల్‌ సెంటర్‌ సీట్‌ లో కిమ్‌ తన కూతురిని కూర్చోబెట్టాడు. దీంతో ఆమె దేశానికి భవిష్యత్తు నాయకురాలు అనే ఊహాగానాలకు ఊపిరి పోసినట్లు అయ్యింది.