RRR: ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలై ప్రేక్షకాదరణ పొందుతోంది. సినిమాను జనం విపరీతంగా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్, రాంచరణ్ ల నటనకు ఫిదా అవుతున్నారు. రాజమౌళి దర్శకత్వ ప్రతిభకు ఫిదా అవుతున్నారు.
సినిమాను జనరల్ ఆడియెన్స్ విపరీతంగా ఆదరిస్తున్నారు. ఎంతలా అంటే సినిమాలోని సీన్లకు కన్నీరు కార్చేంతగా..తాజాగా దేశవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ సినిమాలోని సీన్లకు ఒళ్లు గగుర్పొడిచేలా ప్రేక్షకులు రియాక్ట్ అవుతున్నారు.
Also Read: RRR Day-3 Collections: ‘ఆర్ఆర్ఆర్’ ఏపీ & తెలంగాణ మూడో రోజు కలెక్షన్స్ !
తాజాగా ఒక మహిళ ఆర్ఆర్ఆర్ సినిమా చూస్తూ.. ‘ఎన్టీఆర్ ను బంధించి నడిరోడ్డుపై కొరడాతో రాంచరణ్ కొట్టే సన్నివేశం.. అప్పుడు వచ్చే ‘కొమురం భీముడో’ అన్న పాటకు కదిలిపోయి కన్నీరు కార్చింది. ఆ వీడియోను ఎవరో పక్కనున్న వ్యక్తి తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ గా మారింది.
https://twitter.com/joeytrib9iani/status/1507930107675312128?s=20&t=t4P_OocmO_ucrJeqK8Jcqg
ఇక మరో బాలుడు ఎన్టీఆర్ ను అంతలా కొడుతున్న రాంచరణ్ ను హీరో కాదు విలన్ అంటూ ఏడ్చేశాడు.ఎన్టీఆర్ ను అలా కొట్టవద్దంటూ బోరుమన్నాడు. ఆ బాలుడి తల్లిదండ్రులు ఇది సినిమా అని.. రాంచరణ్, ఎన్టీఆర్ లు కలుస్తారని చివరకు అనునాయించాల్సి వచ్చింది. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ ఎంత ఎమోషనల్ మూవీనో ఈ ఇద్దరి రియాక్షన్ ను బట్టి అర్థమవుతోంది. చాలా మంది ఈ సీన్లకు కరిగిపోతున్న పరిస్థితి నెలకొంది.
Also Read: RRR: ఎన్టీఆర్ నటనకు థియేటర్లోనే ఇలా ఏడ్చేస్తున్నారు.. వైరల్ వీడియో
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: Woman boy crying after watching rrr movie
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com