AR Rahaman Divorce: ఆస్కార్ విన్నర్, లెజెండరీ మ్యూజిక్ కంపోజర్ ఏఆర్ రహెమాన్ ఈ మధ్య నిత్యం వార్తల్లో ఉన్నాడు. ఎందుకంటే ఆయన నుంచి తన భార్య సైరాబాను విడాకులు కోరుతుందట. ఈ విషయాన్ని సైరాబాను తరుఫు న్యాయవాది చెప్పడంతో వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత రహెమాన్ కూడా దాన్ని ధ్రువీకరిస్తూ #arrahamansairadivorce తో ఎక్స్ లో పోస్ట్ పెట్టాడు. ఇది మరింత వైరల్ గా మారింది. ‘తన 29 సంవత్సరాల వైవాహిక జీవితానికి ముగింపు పలుకబోతున్నామని, వచ్చే సంవత్సరం 30వ పెళ్లి రోజు వేడుక చేసుకోవాలని ఉంది కానీ సాధ్యం కావడం లేదని’ క్యాప్షన్ రాసుకున్నారు. అయితే సైరాభాను నిర్ణయంపై ఇండస్ట్రీతో పాటు ప్రజల్లో తీవ్రమైన చర్చ కొనసాగుతోంది. సైరా ఈ నిర్ణయం వెనుక ఎన్నో కారణాలు ఉండవచ్చని అనుకుంటున్నారు. రహెమాన్ లాంటి లెజెండ్స్ అంటే ఒక పట్టాణ అర్థం కారు కదా..? 1995లో వీరి వివాహం జరగగా.. ముగ్గురు పిల్లలు పెళ్లికి ఎదిగిన సమయంలో వారు విడిపోతున్నార్న వార్త అభిమానులకు షాక్ ఇచ్చింది.
ఏఆర్ రహెమాన్ భార్య సైరాభాను ఎవరనేది (ఆమె గురించి) చాలా మందికి తెలిసి ఉండదు. సైరా ప్రముఖ మలయాళ నటుడు రషీన్ రెహమాన్ భార్య మెహరున్నీసా సోదరి (అంటే రషీన్ కు మరదలు). తాజాగా ఓ ఇంటర్వ్యూలో రషీన్ తన మరదలు-తోడల్లుడు గురించి మాట్లాడారు.
తాను ఏఆర్ రెహమాన్ కంటే తాను ఎంత భిన్నంగా ఉంటానో వెల్లడించాడు. తాను మరింత ఆధ్యాత్మికవాదినని చెప్పుకచ్చారు. సిద్ధార్థ్ కన్నన్ తో చాట్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
‘ఏఆర్ రహెమాన్ వివాహం తర్వాత తన భార్య (నా మరదలు)తో హిల్ స్టేషన్ కు వెళ్లాడు. నేను ఆ రోజు రాత్రి వారికి ఫోన్ చేశాను. సమయం రాత్రి 12, లేదంటే ఒంటి గంట కావచ్చు. సైరాభాను అప్పటికే నిద్రపోతోందట. రెహమాన్ ఎక్కడ అని అడిగాను. నాకు తెలియదు అని ఆమె చెప్పింది. మరో గదిలో వీణ ప్రాక్టీస్ చేస్తూ.. ఏదో కంపోజ్ చేస్తున్నాడు; అతను అలాంటి వ్యక్తి.’ అని రషీన్ చెప్పుకచ్చాడు.
ఏఆర్ రెహమాన్, సైరా బాను దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు- ఇద్దరు కుమార్తెలు ఖతీజా, రహీమా, ఒకరు కుమారుడు అమీన్ రహెమాన్. వారి పిల్లలు కూడా వారి విడాకులపై స్పందించారు. ఈ కష్ట సమయంలో సైలంట్ గా ఉండాలని కోరుతున్నారు.
రహెమాన్ ఒక లెజండరీ కంపోజర్. ఆయన ట్యూన్స్ వంద కాలాల పాటు పదిలంగా ఉండిపోతాయి. ఆయన మ్యూజిక్ అంటే విదేశాలలో సైతం విపరీతమైన క్రేజ్. సాక్షాత్తు మైకేజ్ జాక్సన్ లాంటి వారు కూడా ఏఆర్ రహెమాన్ ను కలిశారంటే ఆయన ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. అలాంటి వ్యక్తికి సమయం దొరకడం చాలా కష్టం. భార్య అయిన సైరా ఇంకొంచెం అర్థం చేసుకుంటే బాగుండేదన్న వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. కారణం ఏదైనా రహెమాన్ జీవితంలో మాత్రం ఇదొక పెద్ద అనే చెప్పాలి.
Mahendra is a Senior Political Content writer who has very good knowledge on Business stories. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Malayalam actor rasheen said about rahmans honeymoon
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com