Viral Video : ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో దోపిడి దొంగలు అధికంగా ఉంటారు. ఏదో ఒక ప్రాంతంలో చోరీలకు పాల్పడుతూనే ఉంటారు. పోలీసులు పటిష్టమైన బందోబస్తు నిర్వహించినప్పటికీ దోపిడీ దొంగల దూకుడు ఆగడం లేదు. పైగా వారు ఏదో ఒక ప్రాంతంలో చోరీలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్ విసురుతూనే ఉన్నారు. తాజాగా కోఖ్రాజ్ ప్రాంతంలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. హస్త లాఘవాన్ని ప్రదర్శించి అందినంత కాడికి దోచుకుపోయారు..
Also Read : రైల్వేలో ఈ టికెట్ పై ప్రయాణం చేస్తున్నారా? మందు ఇది తెలుసుకోండి..
ఓ వ్యాపారి నుంచి..
కోఖ్రాజ్ లోని ఓ వ్యాపారి వద్ద దోపిడి దొంగలు 20 లక్షల బ్యాగును సినిమా తరహాలోనే దోచుకున్నారు. దొంగిలించిన ఆ డబ్బు బ్యాగులు లాక్కొని వారు పారిపోయారు. అలా వారు పారిపోతుంటే బ్యాగు హైవే మీద పడిపోయింది. ఆ బ్యాగ్ అలా పడిపోవడంతో అందులో ఉన్న నోట్లు మొత్తం చెల్లా చెదురుగా పడిపోయాయి. దీంతో ఆ నోట్లను చూసిన చుట్టుపక్కల వారు మొత్తం వాటి కోసం ఎగబడ్డారు. పోటీలు పడి ఆ డబ్బును తీసుకున్నారు.. ప్రజలు ఒక్కసారిగా పోటీలు పడటంతో అక్కడ రద్దీ వాతావరణం ఏర్పడింది.. కొంతమంది ఉత్తర్ ప్రదేశ్ పోలీసులకు ఫోన్ చేయగా వారు వెంటనే అక్కడికి వచ్చారు.. ఆ తర్వాత అక్కడ ఉన్న నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత ఆ బ్యాగును స్వాధీనం చేసుకుని వెళ్లిపోయారు. సమీపంలో ఉన్న సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. “పోలీసులకు సమాచారం అందింది. వారు అక్కడికి రాగానే ఒక్కసారిగా పరిస్థితి అదుపులోకి వచ్చింది. అప్పటిదాకా అక్కడ నోట్లను ఏరుకున్నవారు ఒక్కసారిగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అక్కడ ఏం జరిగిందో మొదట్లో మాకు అర్థం కాలేదు. ఆ తర్వాత ఏం జరిగిందో మాకు తెలిసినప్పటికీ.. అటువైపుగా మేము వెళ్లే ధైర్యం చేయలేకపోయామని” చుట్టుపక్కల వారు చెబుతున్నారు.
హవాలా డబ్బేనా
అయితే ఆ వ్యాపారి దగ్గర నుంచి 20 లక్షల నగదు బ్యాగును దొంగలు తస్కరించారు. వాస్తవానికి ఇంతవరకు పోలీసులకు ఈ ఘటనపై ఒక ఫిర్యాదు కూడా అందలేదు.. బహుశా అది హవాలా తాలూకు నగదు అయి ఉంటుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ఆ నగదును ఆ వ్యాపారి ఎవరికి ఇవ్వాలనుకున్నాడు? ఆ నగదు ఇతడికి ఎవరు ఇచ్చారు? 20 లక్షల నగదు మాత్రమేనా? అంతకంటే ఎక్కువ ఉంటుందా? దీని వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు? అనే కోణాలు ఉత్తరప్రదేశ్ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.. గతంలో ఈ ప్రాంతంలో ఈ తరహా దోపిడీలు జరగలేదు. తొలిసారిగా ఇలాంటి దోపిడీ దొంగతనం జరగడంతో స్థానికులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అయితే పోలీసులు నోట్లు ఏరుకున్న వారి వివరాలు సేకరించారు. వారి వద్ద ఉన్న నోట్లను పరిశీలించి.. కరెన్సీ నోట్ల మీద ఉన్న సంఖ్యలను నమోదు చేశారు.. అయితే దీనిని ఆధారంగా కేసును పోలీసులు దర్యాప్తు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తంగా ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించింది.