Railway : చాలామందికి ట్రైన్ జర్నీ చేయడం అంటే ఇష్టంగా ఉంటుంది. మరికొందరు ఇష్టం లేకపోయినా ట్రైన్ జర్నీ చేయాల్సి వస్తుంది. అయితే ఇలాంటివారు ఎప్పటికప్పుడు ట్రైన్ సమాచారాన్ని అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. తాజాగా రైల్వే బోర్డ్ కొత్త నిబంధనను అమల్లోకి తీసుకువచ్చింది. గతంలో సాధారణ టికెట్ తీసుకున్న రిజర్వేషన్ బోగీలో కూర్చొని వెళ్లే అవకాశం ఉండేది. అలాగే వెయిటింగ్ లిస్టు లో ఉన్న రిజర్వేషన్లు ఎక్కడో ఒక చోట అడ్జస్ట్ అయి ప్రయాణించే ఛాన్స్ ఉండేది. కానీ తాజాగా రైల్వే బోర్డు ఈ నిబంధనలను మార్చింది. ఇకనుంచి వెయిటింగ్ లిస్టు లో ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లో రిజర్వేషన్ బోగీలో ప్రయాణించే అవకాశం లేదు. మరి అలాంటప్పుడు ఎలా ప్రయాణించాలి? ఏం చేయాలి? ఆ వివరాల్లోకి వెళితే..
మనం అనుకున్న సమయంలో అనుకున్న ప్రదేశానికి చేరాలంటే ట్రైన్ జర్నీ ఒక్కోసారి సాధ్యం కాదు. అయితే దూర ప్రయాణాలు చేయాలనుకునే వారి మాత్రం ఈ సౌకర్యం బాగుంటుంది. అయితే ఒక తేదీన కచ్చితంగా వెళ్లాల్సి వచ్చినప్పుడు ఆ రోజున టికెట్లు బుక్ చేసుకున్న వెయిటింగ్ లిస్టులో వస్తుంది. గతంలో ఇలా వెయిటింగ్ లిస్టులో ఉన్నవి చాలావరకు గడువు తేదీ వచ్చేసరికి రిజర్వేషన్కు అనుకూలంగా మారేది. కానీ ఎవరు టికెట్లు క్యాన్సల్ చేసుకో లేకపోతే వెయిటింగ్ లిస్టులో ఉన్న టికెట్ అలాగే ఉండిపోయేది. ఇలా ఉన్నా కూడా రిజర్వేషన్లు అడ్జస్ట్మెంట్ చేసుకొని ప్రయాణం చేసుకునే సౌకర్యం ఉండేది. అంతేకాకుండా రిజర్వేషన్ లో ఉన్న టీటీకి జరిమానా కట్టి స్లీపింగ్ బెడ్ ను కూడా పొందే ఛాన్స్ ఉండేది.
Also Read : రైలు టికెట్ తో ఎన్నో ప్రయోజనాలు.. రూ.10 లక్షల వరకు?
అయితే ఇప్పుడు కొత్తగా నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చారు. ఇవి మే ఒకటి నుంచి ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఇకనుంచి వెయిటింగ్ లిస్టులో టికెట్ ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లో రిజర్వేషన్ బోగీలో ప్రయాణించే అవకాశం లేదు. ఇలా వెయిటింగ్ లిస్టులో ఉన్నవారు జనరల్ బోగీలో మాత్రమే ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఒకవేళ వెయిటింగ్ లిస్టు తో రిజర్వేషన్ బోగీలో కూర్చుని ఉంటే వారికి టీటీ జరిమానా విధిస్తారు. కానీ ఎటువంటి సీటింగ్ గాని స్లీపింగ్ బెడ్ కానీ అడ్జస్ట్మెంట్ చేసుకునే అధికారం లేదు. జరిమానా విధించి వారిని జనరల్ బోగీలోకి పంపించే ప్రయత్నమే చేస్తారు.
అలాగే రైల్వే స్టేషన్లలో టికెట్ కొనుగోలు చేసి గతంలో కొందరు రిజర్వేషన్ బోగీలో ప్రయాణించేవారు. కానీ ఇప్పుడు అలా ప్రయాణిస్తే కఠినమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. అందువల్ల ఖచ్చితంగా వీరు కూడా జనరల్ బోగీలోనే ప్రయాణించాల్సి ఉంటుంది.
రిజర్వేషన్ టికెట్ పొందిన వారు వెయిటింగ్ లిస్టు లో ఉన్నవారు రిజర్వేషన్ బోగీలో ప్రయాణించడం వల్ల ఇబ్బందుని ఎదుర్కొన్నారు. వీటిపై చాలామంది ఫిర్యాదు చేయడంతో రైల్వే బోర్డు ఈ కొత్తగా నిబంధనలు అమల్లోకి తీసుకువచ్చింది. నిజమైన రిజర్వేషన్ టికెట్ ఉన్నవారికి ఎలాంటి సౌకర్యం కలగకుండా ఈ నిబంధనలు తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. అందువల్ల ఇకనుంచి ప్రయాణం చేయాలని అనుకునేవారు రిజర్వేషన్ కన్ఫామ్ అయిన తర్వాతనే వెళ్లాలి. లేదా మరో తేదీకి ప్రయాణాన్ని మార్చుకుంటే బెటర్ అని కొందరు సూచిస్తున్నారు.