Viral Video : సముద్రంపై వేటకు వెళ్లడం అంటే ఆషామాషీ కాదు. ఒక్కోసారి సముద్రం ఉప్పొంగితే ప్రాణాలు కూడా తిరిగి వచ్చే అవకాశం ఉండదు. అలాంటిది సముద్రంపై వేటకు వెళ్లి రకరకాల చేపలను తీసుకొచ్చే సాహసం చాలా మంది చేస్తుంటారు. అయితే చేపలు పట్టే క్రమంలో ఒక్కోసారి చేపల వలలో వింత జంతువులు పడుతూ ఉంటాయి. సముద్రంలో ఉన్న రకరకాల జలచరాలు చిక్కుతూ ఉంటాయి. అయితే ఇటీవల చేపల వేటకు వెళ్లిన కొందరికి డాల్పిన్ ఆందోళన వాతావరణం సృష్టించింది. ఇది సృష్టించిన హంగామాకు మత్స్యకారులతో పాటు డాల్పిన్ కూడా గాయాల పాలైంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ సృష్టిస్తోంది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
Also Read : నేను తాగితే భార్యకే భయపడను.. ఆఫ్ట్రాల్ పాము ఎంత.. వైరల్ వీడియో
భూభాగానికి ఉత్తరాన ఉన్న న్యూజిలాండ్ దేశం సముద్రానికి దరిదాపుల్లో ఉంటుంది. ఈ దేశానికి చెందిన వారు చాలా మంది సముద్రంలో చేపల వేటకు వెళ్తూ ఉంటారు. ఎక్కువ శాతం శీతకాలం ఉండే ఈ దేశంలో ఇటీవల ముగ్గురు మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లారు. అయితే కొంత దూరం వెళ్లాక.. వీరికి ఓ డాల్పిన్ ఒక్కసారిగా అడ్డు వచ్చింది. వీరు ప్రయాణిస్తున్న బోటు పైకి ఎగిరింది. దీంతో డాల్పిన్ మత్స్యకారుల బోటుపై పడడంతో ఒక్కసారిగా బోటు తలకిందులైంది. దీంతో మత్స్యకారుల్లో ఒకరికి గాయాలయ్యారు. అటు డాల్పిన్ కు కూడా గాయాలయ్యాయి.
అయితే డాల్పిన్ ఆకాశం నుంచి ఎగిరిపడిందా? లేక సముద్రం నుంచి పైకి లేచి ఎగిరిపడిందా? అనేది అర్థం కాకుండా పోయింది. కానీ కానీ కాసేపు ఊహించని వాతావరణం నెలకొంది. అయితే తమ బోటు దెబ్బతినడంతో మత్స్యకారులు న్యూజిలాండ్ కన్వర్సేషన్ ఏజెన్సీ సాయం కోరారు. దీంతో రంగంలోకి దిగిన ఏజెన్సీ వారు డాల్పిన్ తో సహా మత్స్యకారులను మరో బోటు ద్వారా తీరానికి చేర్చారు. అయితే తీరానికి తీసుకొచ్చిన డాల్పిన్ కు వైద్య చికిత్సలు చేసి ఆ తరువాత సముద్రంలోకి వదిలేశారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సాధారణంగా వైల్డ్ లైఫ్ కు సంబంధించిన వీడియోలు ఆసక్తిగా చూస్తూ ఉంటారు. కానీ సముద్రానికి సంబంధించిన వీడియోలు చాలా తక్కువగా ఉంటాయి. కానీ వీడియోను చాలా మంది వీక్షించారు. మరోవైపు డాల్పిన్ కొన్ని చోట్ల మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. కానీ మత్స్యకారులకు ఇది కనిపించడంతో ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. కానీ ఎవరికీ ఎలాంటి ప్రమాదం కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
మరోవైపు డాల్పిన్ ప్రమాదకరమైన జీవి కాకపోయినా.. దీని బరువు చూసి చాలా మంది భయపడిపోతుంటారు. అలాంటిది ఒక్కసారిగా మీద పడితే తట్టుకునే శక్తి ఉంటుందా? అని మత్స్యకారులు చర్చించుకుంటున్నారు. అంతేకాకుండా మత్స్యాకారులు వేటకు వెళ్లే సమయంలో ఇలాంటి జీవులు ఎదురైనప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
Also Read : బర్డ్ ఫ్లూ వల్ల చికెన్ పక్కన పెట్టి చేపలు తింటున్నారా.. వామ్మో ఇది మామూలు మోసం కాదు.. వైరల్ వీడియో
