Homeవైరల్ వీడియోస్Squirrel : శ్వేతనాగుకు మస్కా కొట్టిన ఉడత.. రెప్ప పాటులో ఉడాయించి ప్రాణాలు కాపాడుకుంది!

Squirrel : శ్వేతనాగుకు మస్కా కొట్టిన ఉడత.. రెప్ప పాటులో ఉడాయించి ప్రాణాలు కాపాడుకుంది!

Squirrel : పాములను చూస్తే చాలు పరుగందుకుంటారు కొంతమంది మాత్రం దైర్యంగా వాటిని పట్టుకుంటూ ఉంటారు. ఇక పాములు జంతువులను వేటాడటం మనం చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం.. చిన్న పాముల నుంచి పెద్ద పెద్ద పైథాన్‌ల వరకు జంతువులను వేటాడి తింటూ ఉంటాయి. పాములు కనిపిస్తేనే మనకు ఒళ్లు జలదరిస్తుంది. ఇక కప్పలు, ఎలుకలు, ఉడతలు, పక్షులు అయితే పాము కనిపించగానే అక్కడి నుంచి పారిపోయి ప్రాణాలు కాపాడుకుంటాయి. పక్షుల పిల్లలను తినేందుకు వచ్చే పాములను తరిమి కొట్టేందుకు పక్షులు యత్నిస్తాయి. ఎలుకలు కూడా ప్రాణాలకు తెగించి పాముతో పోరాటం చేస్తాయి. పిల్లల రక్షణ కోసం తమ ప్రాణాలను పణంగా పెడతాయి. ఇలాంటి దృశ్యాలు గ్రామీణ ప్రాంతాల్లో, అడవుల్లో ఎక్కువగా కనిపిస్తాయి. నేషనల్‌ జియోగ్రఫీ, యానిమల్‌ ప్లానెట్‌ లాంటి చానెళ్లలోనూ ఇలాంటి సీన్లు కనిపిస్తాయి. అయితే తాజాగా విశ్వనగరం హైదరాబాద్‌లో ఇలాంటి దృశ్యం కనిపించింది. జరజరా పాకుతూ వెళ్తున్న ఉడతకు సడెన్‌గా శ్వేతనాగు ఎదురు పడింది. ఏం చేయాలో పాలుపోలేదు. కానీ, అక్కడి నుంచి తప్పించుకుని పోయింది.

పాముకే మస్కా..
హైదరాబాద్‌ నెక్లెస్‌ రోడ్‌లోని జలవిహార్‌ ముందు ఉన్న గోడపై సోమవారం శ్వేతనాగు ప్రత్యక్షమైంది. పాము గోడపై ఉండగానే.. దానికి ఎదురుగా ఓ ఉడత జరజరా పరిగెత్తుకుంటూ వచ్చింది. కానీ, ఉడత సడెన్‌గా ఎదురొచ్చిన పామును చూసి ఒక్కసారిగా ఆగిపోయింది. ఇక తనపని అయిపోయిందని అనుకుందేమో.. కొద్దిసేపు కదలకుండా ఉండిపోయింది. పాము కూడా దానిని చూస్తూ ఉండిపోయింది. కానీ, శ్వేతనాగు ఏమీ అనకపోవడంతో.. ఇదే మంచి సమయం అనుకున్న ఉండత.. కాస్త ఆగు అన్నట్లుగా పాముకు మస్కా కొట్టి అక్కడి నుంచి ఉడాయించింది. పాము తేరుకునేలోపే ఉడత అక్కడి నుంచి మాయమై ప్రాణాలు కాపాడుకుంది.

గతంలో కూడా..
రెండేళ్ల క్రితం(2022 ఆగస్టు 9న) కూడా పాము, ఉడత వీడియో వైరల్‌ అయింది. ఈ వీడియోలో ఒక ఉడుత గోడపై పరిగెత్తడం దాని పట్టుకోవడానికి పాము పాకడం వీడియోలో కనిపించింది. పాము గోడపై పాకుతూ తన వైపు వస్తుంటే ఆ ఉడత దానితో పోరాడటానికి ప్రయత్నించింది. అయినా కూడా పాము భయపడకుండా ఆ ఉడతా వైపు వస్తూనే ఉంది. రెండు మూడు సార్లు ఆ ఉడతా పాముపై దాడి చేసేందుకు ప్రయతించింది. లాభం లేదనుకున్న ఉడత అక్కడి నుంచి తప్పించుకోవాలనుకుంది. ఇంతలో ఓ పక్షి అక్కడకు వచ్చింది. ఆ పక్షి పాము పై దాడి చేసి ఉడతను కాపాడే ప్రయత్నం చేసింది.

 

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version