Python swallows man : కొండచిలువలు అత్యంత బలమైన పాములు. వీటికి విషం ఉండదు గాని.. ప్రత్యర్థి జంతువుల మీద అమాంతం పడిపోతాయి. ముందుగా తమ బలం ప్రయోగించి వాటికి ఊపిరి ఆడకుండా చేస్తాయి. ఆ తర్వాత అమాంతం మింగేస్తాయి. అనంతరం మింగిన ప్రత్యర్థి జంతు శరీరాన్ని నిదానంగా జీర్ణం చేసుకుంటాయి. కొండచిలువలు (మంచు, ఎడారి ప్రాంతాలు మినహా) ప్రపంచం మొత్తం మీద ఉంటాయి. కొండచిలువలు అత్యంత బలమైన సర్పాలు కాబట్టి మిగతా జంతువులు వాటి జోలికి వెళ్ళవు. పైగా అవి కనిపిస్తే దూరంగా వెళ్లిపోతుంటాయి. ఈ కథనంలో మీరు చదవబోయే కొండచిలువ కనివిని ఎరుగని స్థాయిలో దాడికి పాల్పడింది. ఒక మనిషిని అత్యంత క్రూరంగా చంపింది. ఆ తర్వాత మింగేసింది.
ఇండోనేషియాలో ఓ వ్యక్తి కోళ్ల ఫారం నిర్వహిస్తూ ఉంటాడు. అతడికి 61 సంవత్సరాలు. మోటార్ సైకిల్ మీద తన ఇంటికి దూరంగా ఉన్న కోళ్ల ఫారానికి వెళ్ళాడు. అక్కడ కోళ్లకు దాణా, నీళ్లు పెట్టడానికి వెళ్ళాడు. కోళ్లకు దాణా పెట్టి బయటకు వస్తుండగా.. అక్కడ పొదల నుంచి బయటికి వచ్చిన ఓ కొండచిలువ అమాంతం అతడి మీద దాడి చేసింది. ఆ తర్వాత అతని కాళ్ళను బలంగా చుట్టేసింది. ఊపిరి ఆడకుండా చేసింది. దీంతో అతడు కన్నుమూశాడు. ఆ తర్వాత కొండచిలువ అతడిని మింగింది. మింగిన తర్వాత సమీప ప్రాంతంలో ఉండిపోయింది.
కొండచిలువ దాడిలో చనిపోయిన వ్యక్తికి ఒక కుమారుడు ఉన్నాడు. తన తండ్రి ఎంతసేపటికీ ఇంటికి రాకపోవడంతో కోళ్ల ఫారం దగ్గరికి వెళ్ళాడు. తండ్రి జాడ కనిపించకపోవడంతో.. అటు ఇటు వెతికాడు. అతడి ద్విచక్ర వాహనం మాత్రమే కనిపించింది. దీంతో సమీపంలో ఉన్న పొదల్లో కొండచిలువ కనిపించింది. కొండచిలువ శరీరం అత్యంత ఉబ్బెత్తుగా ఉంది. దీంతో తన తండ్రి కొండచిలువ చంపిందని అతడు ఒక నిర్ధారణకు వచ్చాడు. దీంతో చుట్టుపక్కల వారి సహకారంతో ఆ కొండచిలువను చంపాడు. కత్తులతో దాని శరీరాన్ని చీల్చాడు. దాని శరీరంలో అతని తండ్రి మృతదేహం కనిపించింది. అయితే అప్పటికే అతడు శరీరంలో కొన్ని అవయవాలను కొండచిలువ జీర్ణం చేసుకుంది. తన తండ్రిని కొండచిలువ చంపడాన్ని అతడు తట్టుకోలేకపోయాడు.. అనంతరం పదునైన ఆయుధంతో కొండచిలువను ముక్కలు ముక్కలుగా నరికాడు. తన తండ్రి వద్ద ఏదైనా ఆయుధం ఉంటే బతికేవాడని. కానీ కొండచిలువ తన తండ్రిని చంపేసిందని అతని కుమారుడు విలపిస్తూ చెప్పాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో కనిపిస్తోంది. ఇండోనేషియా ప్రాంతంలో కొండచిలువలు అధికంగా ఉంటాయి. ఆ ప్రాంతంలో కొండచిలువలు మనుషులను చంపడం సర్వసాధారణం.