Today 26 July 2025 Horoscope: శ్రావణ మాసం మొదటి శనివారం సందర్భంగా ఈరోజు ద్వాదశ రాశులపై ఆశ్లేష నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉంటాయి. మరికొన్ని రాశుల వారు పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం 12 రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈ రాశి వారు ఈ రోజు కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. కార్యాలయాల్లో ఉద్యోగులకు వేధింపులు ఉండే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో మౌనంగా ఉండడమే మంచిది. వ్యాపారులకు అదనపు బాధ్యతలు ఏర్పడతాయి. జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. కొత్తగా ఏదైనా పనిని ప్రారంభించడానికి అనుకూల సమయం. వ్యాపారులు కొత్తగా పెట్టుబడులు పెట్టవచ్చు. ఇంటికి సంబంధించిన వస్తువులను కొనుగోలు చేయవచ్చు. ఉద్యోగులు అనుకున్న పనులను ఈరోజు పూర్తి చేయగలుగుతారు. దీంతో అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. విద్యార్థులు పోగొట్టి పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి వ్యాపారులు ఈరోజు భారీగా లాభాలు పొందుతారు. ఏ పని చేపట్టిన విజయవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండగలుగుతారు. జీవిత భాగస్వామి మద్దతుతో కొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తారు. ఎవరికైనా డబ్బు ఇచ్చేటప్పుడు సరైన పత్రాలతో జాగ్రత్తగా ఉండాలి. కొత్త భాగస్వాములను చేర్చుకునేటప్పుడు వారితో జాగ్రత్తగా ఉండాలి.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు కొన్ని విషయాల్లో స్పందించాల్సిన అవసరం లేదు. డబ్బు విషయంలో కొత్తవారిని అసలు నమ్మకూడదు. ఇంటికి సంబంధించిన రహస్యాలను స్నేహితులతో పంచుకోకూడదు. అవసరమైతేనే ప్రయాణాలు చేయాలి. ఇతరులకు డబ్బు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు ఒత్తిడి ఎదురైతే మానసిక ప్రశాంతత కోసం రిలాక్స్ కావాలి. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : . ఈ రాశి వారు ఈ రోజు కొన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. కార్యాలయాల్లో ఉద్యోగులు తోటి వారితో సంయమనం పాటించాలి. ఖర్చుల విషయంలో కేర్ తీసుకోవాలి. జీవిత భాగస్వామితో కలిసి షాపింగ్ చేస్తారు. అదరపు ఆదాయం చేకూరుతుంది. వ్యాపారులకు పెట్టుబడుల నుంచి లాభాలు వస్తాయి. విద్యార్థులు అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : . ఉద్యోగులు తోటి వారితో మంచిగా ప్రవర్తించాలి. ఎందుకంటే వివాదాలు ఏర్పడితే అధికారుల నుంచి ఒత్తిడి ఎదుర్కోవాల్సి వస్తుంది. కొన్ని విషయాల్లో బాధ్యతాయుతంగా ఉండాలి. ప్రయాణాలు చేసేటప్పుడు ఎక్కువగా వాదించకూడదు. వ్యాపారులు పెద్దల సలహాతో కొత్త పెట్టుబడులను పెడతారు. ప్రయాణాలు చేసేటప్పుడు వివాదాల్లోకి తలుదురుచకూడదు. స్నేహితులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి ఉద్యోగులకు ఈరోజు అదనపు బాధ్యతలు ఉంటాయి. డబ్బు విషయంలో కొత్త వారిని నమ్మకుండా ఉండాలి. వ్యాపారులకు కొందరు అడ్డంకులు సృష్టిస్తారు. అయితే ఎవరితో ఆర్థిక వ్యవహారాలు జరపకుండా ఉండాలి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొనాల్సి వస్తే తల్లిదండ్రుల సూచనలు పాటించాలి. సమయాన్ని వృధా చేయకుండా అనుకున్న పనిని పూర్తి చేయాలి. ఉద్యోగులు గతంలో చేసిన పనులతో అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఇంట్లో శుభకార్యం కోసం చర్చిస్తారు. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉంటారు. ఆలయ క్షేత్రాలకు వెళ్తారు. వ్యాపారులు కొత్తగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తే భాగస్వాములతో చర్చించాలి. జీవిత భాగస్వామితో వ్యాపారం చేసే వారికి ఈరోజు అధికంగా లాభాలు ఉంటాయి. వ్యాపారానికి సంబంధించిన కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించే ముందు కుటుంబ సభ్యుల మద్దతు తీసుకోవాలి.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : . ఈ రాశి వారు ఈ రోజు కొత్త వ్యక్తులతో వ్యాపారం చేయాల్సి వస్తుంది. అయితే వారితో జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు పెరుగుతాయి. ఇతరులకు డబ్బు ఇచ్చే విషయం ఆలోచించాలి. కొందరు తమకు ఇష్టం లేకుండా పనులు నిర్వహించాల్సి వస్తుంది. ఉద్యోగులు తోటి వారితో జాగ్రత్తగా ఉండాలి. స్నేహితులతో కలిసి ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఇలాంటి సమయంలో వాదనలకు దూరంగా ఉండాలి.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : . ఈ రాశి వారు ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వ్యాపారాన్ని విజయవంతంగా పూర్తి చేయడానికి తీవ్రంగా కష్టపడాల్సి వస్తుంది. ఉద్యోగులు కొన్ని ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు. అయితే అదన ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాలు చేయాల్సివస్తే ఓర్పు ఉండాలి. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : . భవిష్యత్తులో దృష్టిలో ఉంచుకొని ఈ రాశి వారు కొత్తగా పెట్టుబడులు పెడతారు. ఆన్లైన్లో పెట్టుబడులు పెట్టే వారికి అధిక లాభాలు ఉండే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య మాటలు వివాదాలకు దారితీస్తాయి. అందువల్ల ఆచితూచి వ్యవహరించాలి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. జీవితం సంతోషంగా ఉండడానికి కొత్త సంబంధాలను ఏర్పాటు చేసుకుంటారు.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు మాటలను అదుపులో ఉంచుకోవాలి. ఎవరైనా కావాలని వివాదం సృష్టిస్తే మౌనంగా ఉండడమే మంచిది. ప్రియమైన వారితో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. ఇంటికి సంబంధించిన కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. వ్యాపారులు ఎక్కడైనా పెట్టుబడులు పెట్టాల్సివస్తే పెద్దల సలహా తీసుకోవాలి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు.