Vishwambhara vs OG : 2025 సంక్రాంతికి ప్రకటించిన విశ్వంభర విడుదల తేదీపై ఇంకా క్లారిటీ రాలేదు. విశ్వంభర విషయంలో ఏం జరుగుతుంది అనే సందేహం కలుగుతుంది. విశ్వంభర థియేటర్స్ లోకి వచ్చేది ఎప్పుడనే సందేహాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఓజీ మీదే మెగా ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు..
యంగ్ దర్శకులకు అవకాశాలు ఇస్తున్న మెగాస్టార్ చిరంజీవి బింబిసార ఫేమ్ వశిష్ట మల్లిడితో కమిటయ్యారు. సోషియో ఫాంటసీ నేపథ్యంలో భారీ బడ్జెట్ తో విశ్వంభర చిత్రాన్ని ప్రకటించారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తున్న విశ్వంభర చిత్రంలో భారీ క్యాస్ట్ నటిస్తున్నారు. త్రిష ప్రధాన హీరోయిన్ గా నటిస్తుంది. దాదాపు రెండు దశాబ్దాల అనంతరం త్రిష-చిరంజీవి జతకట్టడం విశేషం. వీరి కాంబోలో స్టాలిన్ తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈషా చావ్లా, సురభి, ఆషికా రంగనాథ్ సైతం హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
విశ్వంభర మూవీ 2025 సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. చిరంజీవి అనారోగ్య సమస్యలు తలెత్తిన నేపథ్యంలో షూటింగ్ అనుకున్న సమయానికి పూర్తి కాలేదు. విశ్వంభర సంక్రాంతికి రావడం లేదని కథనాలు వెలువడ్డాయి. విశ్వంభర సంక్రాంతి రేసు నుండి తప్పుకున్న నేపథ్యంలో దిల్ రాజు గేమ్ ఛేంజర్ ని సంక్రాంతికి విడుదల చేశారు. సమ్మర్ కానుకగా విశ్వంభర థియేటర్స్ లోకి వస్తున్నట్లు మరొక ప్రచారం తెరపైకి వచ్చింది.
సమ్మర్ కూడా పోయింది. అయినా మూవీ విడుదలపై స్పష్టత రాలేదు. తాజాగా విశ్వంభర చివరి షెడ్యూల్ జరుగుతుందని యూవీ క్రియేషన్స్ అధికారిక ట్విట్టర్ ఎక్స్ లో పోస్ట్ చేసింది. ఈ షెడ్యూల్ లో స్పెషల్ సాంగ్ చిత్రీకరిస్తున్నారు. కీరవాణి మ్యూజిక్ అందిస్తున్న ప్పటికీ, స్పెషల్ సాంగ్ కొరకు భీమ్స్ సిసిరోలియోను తీసుకున్నారు. ఆయన ఈ స్పెషల్ సాంగ్ కంపోజ్ చేస్తున్నారు. తాజా పోస్ట్ తో విశ్వంభర షూటింగ్ చివరి దశలో ఉన్నట్లు తెలుస్తుంది.
విడుదల తేదీపై క్లారిటీ లేదు. విశ్వంభర సోషియో ఫాంటసీ చిత్రం నేపథ్యంలో విఎఫ్ఎక్స్ వర్క్ పెద్ద మొత్తంలో ఉంటుంది. కాబట్టి పోస్ట్ ప్రొడక్షన్ కి ఎంత సమయం పడుతుందో తెలియదు. కాబట్టి విశ్వంభర ఈ ఏడాది థియేటర్స్ లోకి వస్తుందా? అనే సందేహం లేకపోలేదు. ఈ క్రమంలో మెగా ఫ్యాన్స్ ఓజీ మీదే ఆశలు పెట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ కెరీర్లోనే మోస్ట్ హైప్డ్ మూవీగా ఓజీ ఉంది. సెప్టెంబర్ 25న ఓజీ థియేటర్స్ లోకి రానున్నట్లు ప్రకటించారు. దాంతో కనీసం ఓజీ అయినా చెప్పిన తేదీకి విడుదల కావాలని మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.