Microburst Rain Viral Video: సాధారణంగా మేఘాలు దట్టంగా అలముకున్నప్పుడు.. గాలులు వీచి అవి కలిగినప్పుడు వర్షం కురుస్తుంది. మేఘాలు ఆవరించిన దానినిబట్టి.. అందులో ఉన్న నీటి నిల్వలను బట్టి వర్షాలు కురుస్తుంటాయి. కొన్ని సందర్భాలలో మేఘాలలో నీటి నిల్వలు తక్కువగా ఉంటాయి. మిగతా సందర్భాలలో ఎక్కువగా ఉంటాయి. నీటి నిల్వలు అధికంగా ఉన్నప్పుడు.. మేఘాలు కరిగినప్పుడు.. వర్షపాతం విపరీతంగా నమోదవుతుంది.. కొన్ని సందర్భాలలో మేఘ విస్ఫోటనం కూడా జరుగుతుంది. దానినే ఇంగ్లీషు పరిభాషలో క్లౌడ్ బరస్ట్ అని పిలుస్తుంటారు.
గత కొన్ని సంవత్సరాలుగా మనదేశంలో వర్షాకాలం సమయంలో క్లౌడ్ బరస్ట్ అనేది ఎక్కడో ఒకచోట జరుగుతూనే ఉంది. ఆ సమయంలో విపరీతమైన వర్షపాతం నమోదవుతోంది. ఫలితంగా ఊహకందని స్థాయిలో వరదలు వస్తున్నాయి. ఊహించని స్థాయిలో వరద నీరు ముంచెత్తుతోంది. ఇలాంటి అప్పుడు జరిగే నష్టం కూడా అధికంగా ఉంటున్నది. ప్రస్తుత వర్షాకాలంలో మనదేశంలో దేవ భూమిగా పేరుపొందిన ఉత్తరాఖాండ్ రాష్ట్రంలో విపరీతంగా వర్షాలు కురిసాయి. ఆ వర్షాల వల్ల ఉత్తరాఖాండ్ మొత్తం విలవిలాడిపోయింది.
Also Read: ఈ పనులు చేస్తున్నారా..? జాగ్రత్త..
ఉత్తరాఖాండ్ లో కురిసిన వర్షం పెను విధ్వంసాన్ని సృష్టించగా.. అంతకు మించిన వర్షపాతం ఎప్పుడు ప్రపంచంలోని పలుదేశాలలో నమోదు అవుతున్నది. దీనిని మైక్రోబ్ బరస్ట్ అని పిలుస్తున్నారు. మేఘాలను పక్కకు తప్పించుకుంటూ ఒక నది మొత్తం భూమి మీద పడిపోతే ఎలా ఉంటుందో.. మైక్రో బరస్ట్ తీవ్రత ఆ స్థాయిలో ఉంటుంది. గంటకు 150+ కి మించి కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తుంటాయి. మైక్రో బరస్ట్ చోటు చేసుకున్న ప్రాంతాలలో ఇళ్లు మొత్తం నేలమట్టమవుతాయి. భవనాలు కూలిపోతాయి. చెట్లు చూస్తుండగానే పడిపోతుంటాయి.. ఇక విద్యుత్ స్తంభాల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మేఘాలు దట్టంగా ఆవరించి.. ఒకే చోట ఉండి.. నమోదయ్యే వర్షపాతాన్ని మైక్రో బరస్ట్ అని పిలుస్తుంటారు. దీనివల్ల 30+ కి మించి సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
ఇటీవల ఉత్తరాఖాండ్ రాష్ట్రంలో విపరీతమైన వర్షాలు కురిశాయి. మేఘ విస్ఫోటనం వల్ల ఆ ప్రాంతంలో అంచనాలకు అందని స్థాయిలో వర్షాలు కురవడం వల్ల ఆ ప్రాంతం మొత్తం అల్లకల్లోలం అయింది.
ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అంతకుమించిన స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. దీనిని మైక్రో బరస్ట్ అని… pic.twitter.com/9dTlfof8Gq
— OkTelugu (@oktelugunews) August 14, 2025