Daily Health Habits: నేటి కాలంలో ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ద తీసుకోవాల్సిన అసవరం చాలా ఉంది. ప్రతిరోజూ మనకు తెలియకుండానే కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటాం. వీటి వల్ల దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ఈ పనులు ఒక్కోసారి తప్పు అనిపించకపోయినా.. ఆ తరువాత వీటి ప్రభావం చూపిస్తాయి. అయితే ముందే వీటి గురించి తెలుసుకోవడం వల్ల వాటిని చేయకుండా ఆరోగ్యాన్ని కాపాడుకునే అవకాశం ఉంది. ఇంతకీ ఏ పనులు చేస్తే ఆరోగ్యం దెబ్బతింటుంది?
ప్రతి మనిషికి ఉండే కొన్ని అలవాట్లు సరైనవే అనిపిస్తాయి. కానీ వీటి వల్ల ప్రమాదం ఉందన్న విషయం కొంతమంది చాలా ఆలస్యంగా తెలుసుకుంటారు. ఆ తరువాత బాధపడుతారు. వీటిలో భోజనం చేసే సమయంలో నీరు తాగడం. సాధారణంగా భోజనం చేస్తున్న సమయంలో ముద్ద దిగడానికి కొంత నీరు మాత్రమే తీసుకోవాలి. అలా కాకుండా చాలా మంది వెంట వెంటనే పలుసార్లు నీరు తాగుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల తినే ఆహారం త్వరగా జీర్ణం కాదు. ఆహారం తీసుకునే సమయంలో ఆమ్లం రిలీజ్ అవుతుంది. ఈ సమయంలో ఎక్కువగా నీరు తీసుకుంటే ఆమ్లం ఆహారాన్ని డైజేషన్ చేయనివ్వదు.
రాత్రిళ్లు పొద్దుపోయే వరకు ఫోన్ చూస్తూ ఉండడం చాలా మందికి అలవాటు. అలా చూస్తూ నిద్రపోతూ.. మొబైల్ ను దిండు కింద పెట్టుకుంటూ ఉంటారు. ఇలా దిండు కింద మొబైల్ పెట్టుకోవడం చాలా ప్రమాదకరం. ఎందుకంటే మొబైల్ ఉండే సిమ్ రేడియేషన్ ను కలిగి ఉంటుంది. ఈ రేడియేషన్ తరంగాలు మెదడుపై పడడం వల్ల అనేక సమస్యలు వస్తాయి. ఇది దీర్ఘకాలికంగా కూడా ప్రభావం ఉంటుంది. అంతేకాకుండా రాత్రిళ్లు మొబైల్ నెట్ అలాగే ఉంచకుండా ఆఫ్ చేసి దూరంగా ఉంచుకోవాలి.
Also Read: ట్రాన్స్ జెండర్ కు పీరియడ్స్ వస్తాయా?
ప్రస్తుత కాలంలో చాలా మంది శారీరకంగా శ్రమ పడడం లేదు. వీటిలో కూర్చునే ఉద్యోగం ఎక్కువగా చేస్తున్నారు. ఇలా గంటల తరబడి ఒకే చోట కూర్చుంటూ.. ఆరోగ్యాన్ని పట్టించుకోవడం లేదు. ఫలితంగా ఒకే చోట ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల రక్తం గడ్డకట్టే ప్రమాదం ఉంది. అందువల్ల ఎక్కువ సేపు కూర్చోకుండా.. అటూ.. ఇటూ తిరుగుతూ ఉండాలి. దీంతో రక్త ప్రసరణ జరిగి ఆరోగ్యంగా ఉండగలుగుతారు.
కొంత మందికి వేడి ఆహారం తినడం అంటే చాలా ఇష్టం. అయితే బాగా వేడిగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల చాలా సమస్యలు వస్తాయి. వేడి ఆహారం శరీరంలోకి వెళ్లగానే.. అన్నవాహికకు ప్రమాదం ఏర్పడుతుంది. భవిష్యత్ లో దీనికి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
చెవిలో చెత్తా చెదారం తీసేయడానికి కొందరు ప్రత్యేకంగా కాటన్ స్వాబ్స్ వాడుతూ ఉంటారు. వీటి వల్ల చెవిలో హాయిగా అనిపించినా.. దీర్ఘకాలికంగా చెవిపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
ఈ విధంగా కొన్ని మనం చేసే పనుల వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల ఇలాంటి పనుల పట్ల జాగ్రత్తగా ఉండాలి.