spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Vivekananda Reddy case latest news: వివేకానంద రెడ్డి హత్య కేసు.. సిబిఐ కార్నర్!

Vivekananda Reddy case latest news: వివేకానంద రెడ్డి హత్య కేసు.. సిబిఐ కార్నర్!

Vivekananda Reddy case latest news: ఏపీలో( Andhra Pradesh) ఇప్పుడు వివేకానంద రెడ్డి హత్య కేసు హాట్ టాపిక్ అవుతోంది. ఈ కేసు విచారణలో ఇప్పటివరకు సేకరించిన వివరాలే ఫైనల్ అని.. కొత్తగా ఆధారాలేవీ లభ్యం కాలేదని సిబిఐ కోర్టుకు స్పష్టం చేసింది. అయితే ఈ కేసులో అసలు సూత్రధారులను సిబిఐ విచారణ చేపట్టలేదని వివేకానంద కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడేళ్లుగా తాను న్యాయపోరాటం చేశానని.. అందుకు తగ్గ ప్రతిఫలం ఏది రాలేదన్నది ఆమె ఆవేదన. సిబిఐ విచారణ తీరును ఆమె ఆక్షేపిస్తున్నారు. అయితే ఆధారాలు దొరకలేదని సిబిఐ చెబుతోంది. అదే సమయంలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి మీడియా ముందుకు వచ్చారు. వివేక గుండెపోటు చిత్రీకరణ వెనుక సునీత ఉన్నారన్నది ఆయన ఆరోపణ. ఆయన సైతం సిబిఐ తీరును ఆక్షేపిస్తున్నారు. తన విషయంలో సిబిఐ చేసిన అతిని గుర్తు చేస్తున్నారు. అటు సునీత సిబిఐనే ఆక్షేపిస్తున్నారు. ఇటు అవినాష్ రెడ్డి సిబిఐనే తప్పుపడుతున్నారు. సిబిఐ మాత్రం ఈ కేసులో తమకు ఎటువంటి ఆధారాలు లభించలేదని.. కేసును క్లోజ్ చేయాలని కోరుతున్నట్లు అనిపిస్తోంది.

దర్యాప్తు భిన్నంగా..
వివేకానంద రెడ్డి( Vivekananda Reddy ) హత్య కేసు విచారణకు సంబంధించి ఇప్పుడు సిబిఐ కార్నర్ అవుతోంది. అది ఎలా అంటే.. సిబిఐ నమోదు చేసిన చార్జ్ షీట్లలో ఒక్కోసారి ఒక్కోలా చెబుతూ వచ్చింది. ఒకానొక దశలో అవినాష్ రెడ్డిని అరెస్టు చేయాలని చూసింది. రాజకీయ కుట్ర కోణంలోనే ఈ హత్య జరిగినట్లు పేర్కొంది. a7 నిందితుడిగా వైయస్ భాస్కర్ రెడ్డిని చూపించగా.. a8 నిందితుడిగా అవినాష్ రెడ్డి ని చెప్పింది. భాస్కర్ రెడ్డి స్వయానా అవినాష్ రెడ్డి తండ్రి. భాస్కర్ రెడ్డి కి ఏ అవసరం ఉంటుంది. ఆయన ఏం ఎమ్మెల్యే కాదు.. ఎంపీ అంతకంటే కాదు. ఆయన ఎందుకు వివేకానంద రెడ్డిని హత్య చేయించి ఉంటారు. నిజంగా రాజకీయ కోణం ఉంటే అది ఎవరికి ప్రయోజనం. కచ్చితంగా అది అవినాష్ రెడ్డికి ప్రయోజనం చేకూర్చేది అయి ఉండాలి. ఇలా ఎన్నో చిక్కుముడులను సిబిఐ ఛేదించలేకపోయింది.

ఏడేళ్ల పాటు హైడ్రామా..
ఒక్కటి మాత్రం నిజం. ఏ దర్యాప్తు సంస్థ కైనా సాక్షాలు ముఖ్యం. ఆధారాలు ముఖ్యం. అవి లేనిదే నిందితుల నిర్ధారణ కాదు. ఇప్పుడు సిబిఐ కి ఈ కేసులో ఎదురైన పరిణామం అదే. టిడిపి ప్రభుత్వ హయాంలో వివేకానంద రెడ్డి హత్యకు గురయ్యారు. ఎన్నికలకు ముందు ఆయన హత్య జరిగింది. అప్పట్లోనే సిబిఐ విచారణ కోరింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. తీరా అధికారంలోకి వచ్చాక జగన్మోహన్ రెడ్డి తన సొంత బాబాయి హత్య జరిగితే ఏ రేంజ్ లో విచారణకు ఆదేశించాలి. కానీ అప్పటివరకు సిబిఐ విచారణ కోరిన ఆయన వద్దని ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించేదాకా పరిస్థితి వెళ్ళింది. చేతిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంటే సిబిఐ కి సహకారం అందించాలి. కానీ వైసీపీ హయాంలో సిబిఐ విచారణకు అడుగడుగునా అడ్డంకులు ఎదురయ్యాయి. సిబిఐ విచారణ సవ్యంగా సాగలేదు కూడా. మరి ఇటువంటి సమయంలో సాక్షాలు ఎలా దొరుకుతాయి. ఆధారాలు ఎలా దొరుకుతాయి. ముందుగా సిబిఐ విచారణ చాలా వేగంగా సాగింది. తర్వాత మందగించింది. ఏడేళ్లలో ఎన్నో రకాల ఒత్తిళ్లు, పరిణామాలు జరిగాయి. వివేకానంద రెడ్డి కుమార్తె సునీత ఆశించిన స్థాయిలో విచారణ జరగలేదు. తమపై మోపిన అభియోగాలను నిరూపించలేకపోయిందని అవినాష్ రెడ్డి ఆవేదనతో ఉన్నారు. ఇలా ఎలా చూసుకున్నా సిబిఐ ఇప్పుడు కార్నర్ అవుతోంది. దేశంలోనే అతిపెద్ద దర్యాప్తు సంస్థ. అందుకే ఇటువంటివి రాకుండా చూసుకోవాల్సిన అవసరం సిబిఐ ఉంది. లేకుంటే నవ్వుల పాలు కావడం ఖాయం.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Chiranjeevi: చిరంజీవి లో మంచి రైటర్ ఉన్నాడా… ఆయన రాసిన కథ తో సినిమా…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి చేసిన చాలా సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. గత 50 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న చిరంజీవి ఈ మధ్యకాలంలో చేసిన...

Nagarjuna: ది ఒడిస్సీ ని చూసి నేర్చుకోవాలి…డైరెక్టర్లు, హీరోల మీద ఫైర్ అయిన నాగార్జున… వైరల్ వీడియో…

Nagarjuna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. నాగార్జున ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాలతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన తన వందో సినిమాని...

Talliki Vandanam Scheme 2026: తల్లికి వందనం.. రూ.13 వేలు జమ.. చెక్ చేసుకోండి!

Talliki Vandanam Scheme 2026: ఏపీ ప్రభుత్వం ఈరోజు ప్రతిష్టాత్మక పథకానికి సంబంధించి నిధులు జమ చేయనుంది. పాఠశాలతో పాటు ఇంటర్ విద్యార్థులకు తల్లికి వందనం పథకం కింద చదువుకు సాయం అందించనుంది....

NEET Protest Delhi: ఢిల్లీలో నీట్ విద్యార్థుల ఆందోళనలు: ఆ సీజేపీ నాయకులు ఎక్కడ..

NEET Protest Delhi: ఒకరేమో ఆర్టికల్ 370 రద్దు చేయాలి అంటారు. మరొకరేమో రాముడి నామాన్ని జపించకూడదు అంటారు. ఇంకొకరేమో జమ్ము కాశ్మీర్ రాష్ట్రానికి మరింత స్వేచ్ఛ వాయువులు కల్పించాలని డిమాండ్...

AI Impact On Education: ఏఐతో మూలాలే మటాష్.. పరిస్థితి ఎంతకు దిగజారిందంటే..

AI Impact On Education: ఏఐ తో ఇప్పటివరకు కేవలం ఐటీ ఉద్యోగాలు మాత్రమే పోయాయని అనుకున్నాం. ఎంట్రీ లెవెల్.. మిడ్ లెవెల్ ఉద్యోగాలు మాత్రమే మటాష్ అయిపోయాయని మీడియా వార్తల్లో...
Oktelugu Epaper
Exit mobile version