Harsh Goenka : ఆయన పోస్ట్ చేసిన వీడియోలు.. ఇతర అంశాలు చాలామందికి నచ్చుతుంటాయి. అందువల్లే హర్ష్ గోయెంక ను ట్విట్టర్లో 1.3 మిలియన్ల మంది అనుసరిస్తుంటారు. జీవితానికి సంబంధించినవి.. జీవితంలో ఎదిగే తీరుకు సంబంధించినవి.. ఇలా అనేక విధాలుగా హర్ష్ గోయెంక ట్వీట్లు చేస్తుంటారు. అందువల్లే ఆయన పోస్ట్ చేసే ట్వీట్ కు ఒక రేంజ్ ఉంటుంది. సోషల్ మీడియాలో విపరీతమైన యాక్టివ్ గా హర్ష్ గోయెంక.. తన కంపెనీలకు సంబంధించిన విషయాలు మాత్రమే కాకుండా.. నవ్వు తెప్పించే విషయాలను.. ఆలోచింపజేసే విషయాలను.. ఆనందింపజేసే విషయాలను పంచుకుంటారు. తాజాగా హర్ష్ గోయెంక ఒక వీడియోను పోస్ట్ చేశారు. కాకపోతే అది నవ్వు తెప్పించే విధంగా ఉన్నప్పటికీ.. ఇప్పటికాలానికి సరిపోయే విధంగా ఉంది. అంతేకాదు మనిషి అభివృద్ధి చెందుతున్నా కొద్దీ.. ఎలా మారిపోతున్నాడో నిరూపించింది..
Also Read : నా మాజీ భార్య నన్ను అంధకారంలోకి నెట్టేసింది అంటూ కన్నీళ్లు పెట్టుకున్న స్టార్ హీరో!
సాధారణంగా తమ పసుపు కుంకాలు చల్లగా ఉండాలని.. నూరేళ్ల పాటు ఐదోతనంతో కొనసాగాలని చాలామంది స్త్రీలు తమ భర్తల పాదాలకు నమస్కరిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఉత్తర భారత దేశంలో ప్రత్యేకమైన వేడుకలు సందర్భంలో స్త్రీలు తమ భర్తల నుంచి ఆశీర్వాదం తీసుకుంటారు. ఇక శ్రావణమాసం.. కార్తీక మాసం సమయంలో ఇలానే స్త్రీలు తమ భర్త ల నుంచి ఆశీర్వాదం తీసుకుంటారు. అయితే ఈ కాలంలో స్త్రీలు మారిపోయారని.. ఆశీర్వాదం తీసుకునే విధానంలోనూ డిజిటల్ పద్ధతిని పాటిస్తున్నారని హర్ష్ గోయెంక పోస్ట్ చేసిన వీడియోలో ప్రస్ఫుటంగా కనిపించింది. ఆ వీడియోలో తన భర్త వద్ద ఆశీర్వాదం తీసుకోవడానికి భార్య వస్తుంది. అతడి పాదాలకు నమస్కరిస్తుందని అందరూ అనుకుంటారు. కానీ ఆమె తన ఫోన్ ఆన్ చేసి.. అందులో తన భర్త పాదాల ఫోటోలు తీసి.. ఆ ఫోటో మీద పువ్వులు చల్లుతుంది. రెండు చేతులతో నమస్కారం పెట్టినట్టు హావభావాలను ప్రదర్శిస్తుంది. తన భార్య చేసిన పనికి ఆ భర్త ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఆ తర్వాత ఎందుకొచ్చిన గొడవ అనుకుంటూ ఆమెను ఆశీర్వదిస్తాడు. ఈ వీడియో నిడివి నిమిషాని కంటే తక్కువగానే ఉన్నప్పటికీ.. మారుతున్న కాలంలో మనిషి ఎలా రూపాంతరం చెందుతున్నాడో కళ్ళకు కడుతోంది. అన్నట్టు ఈ వీడియోకు హర్ష్ గోయెంక డిజిటల్ దర్శన్ అని పేరు పెట్టడం విశేషం.
హర్ష్ గోయెంక ట్విట్టర్ లో ఇలా పోస్ట్ చేయగానే.. క్షణంలోనే అది వందల ప్రతిస్పందనలను సొంతం చేసుకుంది. డిజిటల్ దర్శన్ వీడియోలో మారుతున్న మనుషులు మాత్రమే కాదు.. విధానాలు కూడా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.. ఇలాంటి మార్పులు మనిషి జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తాయని.. సంస్కృతి సంప్రదాయాలను మరుగున పడేస్తాయని నెటిజన్లు పేర్కొంటున్నారు.
In the new digital age…, pic.twitter.com/5KkEwXH2TT
— Harsh Goenka (@hvgoenka) May 15, 2025