Viral Video: సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. అరచేతిలో ఇమిడిపోయే స్మార్ట్ ఫోన్ లో సర్వం కనిపిస్తోంది. ప్రపంచంలో ఈ మూలన ఏం జరిగినా వెంటనే తెలిసిపోతుంది. స్మార్ట్ ఫోన్ ద్వారా ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో… అన్ని నష్టాలు ఉన్నాయి. మంచి వెనకే చెడు ఉన్నట్టు.. స్మార్ట్ ఫోన్ వాడకం వెనుక సైబర్ నేరగాళ్లు పొంచి ఉన్నారు. మారుతున్న కాలం నేపథ్యంలో సైబర్ నేరగాళ్లు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. సామాజిక మాధ్యమాలను ఆసరాగా తీసుకొని అడ్డగోలుగా అందులో దోపిడీ చేస్తున్నారు. ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్, వాట్సాప్ వేదికలుగా చేసుకుని లింక్ లు, మెసేజ్ లు పెట్టి ఖాతాల్లో డబ్బులు ఊడ్చేస్తున్నారు. సైబర్ క్రైమ్ పోలీసులు ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా నేరగాళ్లు కొత్త కొత్త దారుల్లో ప్రజలను మోసం చేస్తున్నారు. సైబర్ నేరాలపై అవగాహన కల్పించేందుకు పోలీసులు కొత్త పంథాలను అనుసరిస్తున్నప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. అయితే ఢిల్లీకి చెందిన ఓ యువతి తనకు ఎదురైన సైబర్ మోసం.. దాని నుంచి ఆమెను ఆమె కాపాడుకున్న తీరు.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఢిల్లీకి చెందిన చరణ్ జీత్ కౌర్ అనే మహిళ ఒక సంస్థలో ఉద్యోగం చేస్తోంది.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఆమెకు ఐదెంకల జీతం వస్తుంది. కుటుంబంతో కలిసి ఢిల్లీలోని ఓ ప్రాంతంలో నివసిస్తోంది. ఆమెకు ఇంకా పెళ్లి కాలేదు. అయితే చరణ్ జీత్ కౌర్ కు ఇటీవల ఒక ఫోన్ వచ్చింది.. ఆ ఫోన్ కాల్ లో ప్రొఫైల్ పిక్చర్ లో ఇద్దరు పోలీస్ అధికారుల ఫోటో ఉంది.. ఆమెకు అప్పటికే అది ఫ్రాడ్ కాల్ అనే అనుమానం కలిగింది. వెంటనే దానిని వీడియో తీయాలని ఆమె కుటుంబ సభ్యులను ఆదేశించింది. దీంతో వారు వీడియో తీయడం ప్రారంభించారు. వీడియో మొదలుపెట్టగానే ఆమె ఆ ఫోన్ కాల్ లిఫ్ట్ చేసింది..
ఫ్రాడ్ ఫోన్ కాల్: హలో..
చరణ్ జీత్ కౌర్: హలో చెప్పండి..
ఫ్రాడ్ ఫోన్ కాల్: మాట్లాడేది చరణ్ జీత్ కౌరేనా..
చరణ్ జీత్ కౌర్: కాదు.. తను బయటికి వెళ్లింది. నేను చరణ్ జీత్ కౌర్ సోదరిని..
ఫ్రాడ్ కాల్: మీ సోదరి చరణ్ జీత్ కౌర్ ఓ మంత్రి కుమారుడిని బ్లాక్ మెయిల్ చేసింది. ఇంట్లో భాగంగా ఆమెను అరెస్టు చేశాం. మరి కొద్దిసేపట్లో ఆమెను జైలుకు పంపిస్తాం. ఈ విషయం మీరు ఎవరికీ చెప్పకండి. ఆమెను జైలుకు పంపించొద్దు అనుకుంటే ఒక పని చేయాలి.
చరణ్ జీత్ కౌర్: ఏం చేయాలో చెప్పండి..
ఫ్రాడ్ కాల్: ముందు మీరు మాకు ఆన్లైన్లో 20,000 పంపండి.
చరణ్ జీత్ కౌర్: ఆన్లైన్లో డబ్బులు పంపడం కాదు.. నేను చరణ్ జీత్ కౌర్ ను. ఇంకోసారి ఫోన్లు చేస్తే చెప్పు తెగుద్ది.. అని సమాధానం చెప్పింది..
రోజురోజుకు ఫ్రాడ్ కాల్స్ పెరిగిపోతున్న నేపథ్యంలో చరణ్ జీత్ కౌర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. “రోజురోజుకు మోసాలు పెరిగిపోతున్నాయి. ఇలాంటి సైబర్ నేరగాళ్ల నుంచి మిమ్మల్ని మీరే కాపాడుకోవాలంటూ” ఆమె సోషల్ మీడియాలో కోరారు. ప్రస్తుతం ఈ వీడియో దాదాపు మిలియన్ వ్యూస్ నమోదు చేసింది.