https://oktelugu.com/

Brothers: టీ షర్టు కోసం కొట్టుకున్న అన్నదమ్ములు.. అన్న మృతి

గ్రామానికి చెందిన రమేష్,సురేష్ అన్నదమ్ములు. గురువారం రాత్రి రమేష్ టీషర్టును సురేష్ ధరించాడు. దీంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది.

Written By:
  • Dharma
  • , Updated On : April 5, 2024 / 06:57 PM IST

    Brother Kills Elder Brother For T Shirt

    Follow us on

    Brothers: క్షణికావేశం ఒక్కోసారి నిండు ప్రాణాలను బలి తీసుకుంటుంది. కేవలం ఒకే ఒక్క క్షణం మనిషి ఆలోచన పక్కదారి పడుతుంది. ఆ సమయంలో విచక్షణ కోల్పోయి ఏం చేస్తున్నామో తెలియని స్థితికి చేరుకుంటారు. అటువంటి సమయంలో జరిగే ఘటనల్లో జరిగే మూల్యం భారీగా ఉంటుంది. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో టీ షర్టు కోసం ఇద్దరు సోదరులు తగాదాపడ్డారు. ఒకరినొకరు నెట్టుకున్నారు. అందులో ఒకరు మృతి చెందారు. ఈ విషాద ఘటన సంతబొమ్మాలి మండలం కాకరపల్లి లో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.

    గ్రామానికి చెందిన రమేష్,సురేష్ అన్నదమ్ములు. గురువారం రాత్రి రమేష్ టీషర్టును సురేష్ ధరించాడు. దీంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది. అది ఘర్షణకు దారితీసింది.ఈ క్రమంలో అన్న రమేష్ ను తమ్ముడు సురేష్ నెట్టి వేయడంతో తలకు బలమైన గాయం తగిలింది. రమేష్ అపస్మారక స్థితికి చేరుకోవడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన శ్రీకాకుళంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రమేష్ మృతి చెందాడు. దీంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. సోదరుల్లో ఒకరు మృతి చెందగా.. మరొకరు నిందితుడిగా మారడంతో కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. క్షణికావేశంలోనే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.

    ఇటీవల మానవ సంబంధాలు మంట కలిసిపోతున్నాయి. కుటుంబ సభ్యుల మధ్య ఆత్మీయత కొరవడుతోంది. దీంతో చిన్నపాటి మనస్పర్ధలతోనే కుటుంబాలు విడిపోతున్నాయి. వీధిన పడుతున్నాయి. కేవలం టీ షర్టు కోసమే ఇద్దరు అన్నదమ్ములు ఘర్షణకు దిగడం.. అందులో ఒకరు చనిపోవడం సంచలనం గా మారింది. ఆ కుటుంబాన్ని వీధిన పడేసింది. కాగా ఈ ఘటనతో కాకరపల్లి లో విషాదం అలుముకుంది.