Vijay Devarakonda: నా లవ్ కంటే నీ లవ్ ఫేమస్… సుడిగాలి సుధీర్ ని అడ్డంగా బుక్ చేసిన విజయ్ దేవరకొండ!

సుధీర్, విజయ్ దేవరకొండ మధ్య ఒక ఆసక్తికర సంభాషణ చోటుచేసుకుంది. సుధీర్ ఒక విషయంలో టిప్స్ కావాలంటూ విజయ్ దేవరకొండను అడిగాడు.

Written By: S Reddy, Updated On : April 5, 2024 6:04 pm

Vijay Devarakonda Sudigali Sudheer

Follow us on

Vijay Devarakonda: బుల్లితెర సెన్సేషన్ సుడిగాలి సుధీర్ పరిచయం అక్కర్లేని పేరు. జబర్దస్త్ వేదికగా స్టార్ అయ్యాడు. తన టాలెంట్ తో తక్కువ సమయంలోనే అభిమానులను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం వెండితెర పై సత్తా చాటుతూ హీరోగా రాణిస్తున్నాడు. యాక్టర్ గానే కాకుండా యాంకరింగ్ కూడా ఇరగదీస్తున్నాడు. తాజాగా ఈటీవీలో ఉగాది స్పెషల్ ఈవెంట్ ఒకటి హోస్ట్ చేశాడు. ఈ షోలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ సందడి చేయడం విశేషం.

ఈ క్రమంలో సుధీర్, విజయ్ దేవరకొండ మధ్య ఒక ఆసక్తికర సంభాషణ చోటుచేసుకుంది. సుధీర్ ఒక విషయంలో టిప్స్ కావాలంటూ విజయ్ దేవరకొండను అడిగాడు. దీనికి విజయ్ దేవరకొండ అదిరిపోయే కౌంటర్ వేశాడు. ఫ్యామిలీ స్టార్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా నిర్మాత దిల్ రాజు, విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ ‘ ఈసారి పండగ మనదే ‘ ఉగాది స్పెషల్ ఈవెంట్ కు హాజరయ్యారు. స్టేజ్ పై సందడి చేశారు.

ఈ క్రమంలో సుధీర్ పెళ్లి కానీ యువతకు ఏవైనా టిప్స్ ఇవ్వండి అంటూ విజయ్ దేవరకొండను అడిగాడు. దీంతో విజయ్ దేవరకొండ .. నా లవ్ స్టోరీ కంటే .. నీ లవ్ స్టోరీ ఎప్పుడూ వార్తల్లో ఉంటుంది కదా .. నాకంటే సీనియర్ నువ్వు అని అన్నాడు. దీంతో సెట్ మొత్తం నవ్వులతో హోరెత్తింది. రష్మీ – సుడిగాలి సుధీర్ మధ్య నడిచిన లవ్ ట్రాక్ గురించి ఇండైరెక్ట్ గా పంచ్ వేశాడు విజయ్ దేవరకొండ.

ఇక హైపర్ ఆది, సుధీర్ పై వేసిన పంచులు నవ్వులు పూయించే విధంగా ఉన్నాయి. వచ్చి రాగానే సుధీర్ ని ఒక ఆట ఆడుకున్నాడు. ఎవరో బంధువు వస్తున్నాడు అన్నారు .. రాబందు వచ్చాడేంటి అని సుధీర్ ని ఉద్దేశించి అన్నాడు. గొడవలు జరుగుతున్నాయి అని సుధీర్ అనగా .. ఎవరిని గెలికావ్ అంటూ హైపర్ ఆది సెటైర్లు వేసాడు. బలగం ఫేమ్ వేణు, హ్యాష్ నైంటీస్ మిడిల్ క్లాస్ వెబ్ సిరీస్ శివాజీ తన టీం తో పాటు వచ్చారు. ఉగాది పండుగ నాడు ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ కానుంది.