Muslim League : మహమ్మద్ అలీ జిన్నా ప్రవచించిన ద్విజాతి సిద్ధాంతం 1947లో భారతదేశ విభజనకు కారణమైంది. వేల ఏళ్లుగా అవిభక్త భారత దేశంలో నివసించే హిందూ, ముస్లింలు అంతా భారత జాతీయులే అన్న వాస్తవాన్ని ఆనాటి మన జాతీయ నాయకులు సమర్థంగా వినిపించలేకపోయారు.
జిన్నా నేతృత్వంలోని ముస్లిం లీగ్ పార్టీ హింసాత్మక చర్యలతో అల్లకల్లోలం చెలరేగడం… ‘విభజించు – పాలించు’ అనే బ్రిటీష్ పన్నాగంతో మెజార్టీ ప్రజల అభిమతానికి విరుద్ధంగా దేశాన్ని విభజించారు. ఆ గాయాలు ఇప్పటికీ బాధిస్తునే ఉన్నాయి…
1947లో దేశ విభజన అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో భారతదేశం నుంచి చాలా మంది ప్రజలు పాకిస్థాన్‌కు వలస వెళ్లారు. వారి భూములు, ఫ్యాక్టరీలు, ఇళ్లు, ఇతర నిర్మాణాల స్థిరాస్తులను వదిలేసివెళ్లారు.
భారత దేశ విభజనకు గల కారణాలపై రామ్ గారి సునిశిత విశ్లేషణను పైన వీడియోలో చూడొచ్చు.