https://oktelugu.com/

Zaheer Khan : జహీర్ ఖాన్ పై విపరీతమైన ప్రేమ.. 20 ఏళ్లుగా అతడి ధ్యాసలోనే.. వైరల్ వీడియో

Zaheer Khan : ప్రేమ ఎప్పుడు పుడుతుందో ఎవరూ చెప్పలేరు. ఆ ప్రేమ ఎలా కలుగుతుందో ఎవరూ నిర్ధారించలేరు. ఇక మనదేశంలో క్రికెటర్ల పై మనసు పారేసుకున్న యువతులు చాలామంది ఉన్నారు. అందులో కొందరు తమ ప్రేమ విషయాన్ని బాహాటంగా తెలియజేస్తే.. మరికొందరేమో లోలోపల దాచుకున్నారు.

Written By: , Updated On : March 20, 2025 / 08:39 AM IST
Zaheer Khan

Zaheer Khan

Follow us on

Zaheer Khan : ఇప్పుడంటే సోషల్ మీడియా కాలం కాబట్టి.. క్రికెటర్ల పై ఉన్న ఇష్టాన్ని, ప్రేమను వ్యక్తికరించడానికి అవకాశం ఉంది. కానీ అదే రెండు దశాబ్దాల క్రితం ఇంతటి సాంకేతిక పరిజ్ఞానం లేదు. ఎవరైనా క్రికెటర్ పై ఇష్టం ఉంటే.. ప్రేమ లాంటి భావన కలిగి ఉంటే.. బయటికి చెప్పేవారు కాదు. కొంతమంది యువతులు మాత్రం తమ అభిప్రాయాలను వ్యక్తీకరించేవారు. దానికోసమే స్టేడియాలకు వెళ్లేవారు. మ్యాచ్ చూస్తున్న సమయంలో ఫ్ల కార్డుల పై తమ అభిప్రాయాలను వ్యక్తం చేసేవారు. ఐ లవ్ యు అని.. విల్ యు మ్యారి మీ అని.. షెల్ వీ గెట్ టుగెదర్ అని రాసేవారు.. అయితే అప్పట్లో సోషల్ మీడియా ఉండేది కాదు కాబట్టి.. టీవీలలో లైవ్ మ్యా చ్ వస్తున్నప్పుడు ఆ యువతులు కనిపించే వారు. నాటి రోజుల్లో అది ఒక సంచలనంగా ఉండేది. అయితే ఇప్పటి కాలంలో వాళ్లకు మాత్రం అది అంత గొప్పగా అనిపించకపోవచ్చు. ఎటువంటి సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేనప్పుడు.. ఉన్న చిన్న అవకాశాలలో అటువంటి వ్యక్తి కరణ చేయడం మామూలు విషయం కాదు.

Also Read : పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ హత్యకు సి.ఐ.ఎ ప్లాన్ వేసిందా?

20 సంవత్సరాలుగా ప్రేమిస్తూనే ఉంది

టీమిండియాలో రెండు దశాబ్దాల క్రితం జహీర్ ఖాన్ ప్రధాన బౌలర్ గా కొనసాగే వాడు. టీం ఇండియా సాధించిన విజయాలలో అతడు కీలకపాత్ర పోషించేవాడు. కేవలం బౌలింగ్లో మాత్రమే కాదు.. అందంలో కూడా జహీర్ ఖాన్ ఆజానుబాహుడిగా ఉండేవాడు. అప్పట్లో అతడిని యువతులు విపరీతంగా ఆరాధించేవారు. అతని కోసమే స్టేడియాలకు వచ్చేవారు. అలాంటి వారిలో ఓ యువతి కూడా ఉంది. అయితే అతడు ఆడే మ్యాచ్లకు కచ్చితంగా వచ్చేది. అంతేకాదు ఫ్ల కార్డు పై ఐ లవ్ యు జహీర్ ఖాన్ అని రాసి ప్రదర్శించేది. అప్పట్లో జహీర్ ఖాన్ ఆడిన ప్రతి మ్యాచ్ ను ఆ అమ్మాయి స్టేడియానికి వచ్చి మరీ చూసేది. తన భావాలను వ్యక్తికరించేది. అయితే అప్పట్లో జహీర్ వేరే అమ్మాయితో ప్రేమలో ఉండడంతో.. అది సాధ్యం కాలేదు. అయినప్పటికీ ఆమె తన ప్రేమను అలానే ఉంచుకుంది. అయితే ఇన్నాళ్లకు తనను ప్రేమించిన అమ్మాయిని జహీర్ ఖాన్ కలుసుకున్నాడు. అయితే నాటి రోజుల్లో ఫ్లకార్డుపై ఎలాగైతే ఐ లవ్ యు జహీర్ ఖాన్ అని రాసి ప్రదర్శించిందో.. ఇప్పుడు కూడా ఆమె అలానే జహీర్ ఖాన్ కు అలాంటి ఫ్ల కార్డుతోనే స్వాగతం పలకడం విశేషం. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది.. జహీర్ ఖాన్ ప్రస్తుతం లక్నో జట్టు కోసం పనిచేస్తున్నాడు. ఐపీఎల్ లో భాగంగా ఇటీవల అతడు ప్రాక్టీస్ సెషన్ కి వచ్చినప్పుడు.. నాడు జహీర్ ఖాన్ ను ప్రేమిస్తున్నట్టు ఫ్ల కార్డు ప్రదర్శించిన యువతి.. దర్శనమిచ్చింది.. ఇప్పుడు కూడా అదే విధంగా ఐ లవ్ యు జహీర్ ఖాన్ అని రాసి ఉన్న ఫ్లకార్డును ఆ యువతి చూపించడం విశేషం. అయితే అప్పటికి ఇప్పటికీ జహీర్ ఖాన్ ఒకే విధంగా ఉండగా.. ఆ యువతి మాత్రం కాస్త బొద్దుగా అయింది.

Also Read : కమాన్ బుమ్రా భాయ్.. ఐసీసీ రికార్డు నీకోసం ఎదురు చూస్తోంది..