Viral Video : ఒక చిన్నారిని తల్లిదండ్రులు ఎత్తుకొని హాస్పిటల్ కు పరుగులు పెడుతున్నారు.. రోధిస్తున్నారు.. తన కొడుకను బతికించు దేవుడా.. అంటూ రోధనలు పెడుతున్నారు.. ఈ హృదయ విదారకరమైన సన్నివేశాన్ని అటుగా వెళ్తున్న లేడీ డాక్టర్ చూసింది. ఏమైందని వారిని ప్రశ్నించింది. తన కొడుకు కరెంట్ షాక్ కు గురయ్యాడని తల్లిదండ్రులు రోధిస్తూ చెప్పడంతో హాస్పిటల్ కు తీసుకెళ్లే లోగా ఏదైనా చేసి చిన్నారిని కాపాడాలని అనుకుంది. ఆలస్యం చేయకుండా చిన్నారిని రోడ్డుపైనే పడుకోబెట్టింది. వెంటనే కార్డియోపల్మోనరీ రిసెసిటేషన్ (సీపీఆర్) చేసింది. సుమారు ఐదు నిమిషాల డాక్టర్ శ్రమించింది. దీంతో బాలుడు స్పృహలోకి వచ్చాడు. డాక్టర్ బాలుడికి సీపీఆర్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో మే 5న జరగగా.. చిన్నారి ప్రస్తుతం ఆడుకుంటున్న వీడియోతో పాటు ఆ సమయంలో పీసీఆర్ చేసిన లేడీ డాక్టర్ కు సంబంధించిన వీడియో పక్కన పక్కన పెట్టి ఎక్స్ (ట్విటర్)లో పోస్ట్ చేయడంతో అది కాస్తా విపరీతంగా వైరల్ అవుతుంది. పూర్తి వివరాలు తెలుసుకుంటే..
ఓ వైద్యురాలు తన కుమారుడిని మోసుకెళ్తున్న తండ్రిని గమనించి వెంటనే ఆపింది. ఏమైందని ప్రశ్నించగా అతను విషయం చెప్పాడు. బాలుడి చేయి పట్టుకొని పల్స్ చెక్ చేసిన వైద్యురాలు పరిస్థితిని అంచనా వేసింది. పరిస్థితి తీవ్రతను గుర్తించిన ఆమె శ్వాస అందకపోవడం, పల్స్ బలహీనంగా ఉండడంతో వెంటనే రోడ్డు పక్కనే కార్డియోపల్మోనరీ రెసిపిటేషన్ (సీపీఆర్) ఇచ్చింది. ఐదు నిమిషాల తర్వాత బాలుడికి మళ్లీ ఊపిరి ఆడడం మొదలైంది.
దీంతో తన కొడుకు ప్రాణం తిరిగి వచ్చిందని సంతోషించిన తల్లిదండ్రులు వైద్యురాలికి ధన్యవాదాలు చెప్పారు. అనంతరం అదనపు చికిత్స కోసం బాలుడిని సమీపంలోని హాస్పిటల్ కు తరలించారు. 24 గంటల అబ్జర్వేషన్ లో ఉంచిన వైద్యులు అనంతరం బాలుడిని డిశ్చార్జ్ చేశారు. అని ఎక్స్ పోస్ట్ లో పేర్కొన్నారు.
వైద్యురాలు వేగంగా స్పందించి నిర్ణయాత్మక జోక్యం తీసుకోవడంతో ఒక విలువైన ప్రాణాన్ని కాపాడింది. దీంతో సోషల్ మీడియాలో ఆ వృద్ధురాలిని ప్రతీ ఒక్కరూ అభినందిస్తున్నారు.
, !
In Vijayawada, a 6-year-old boy faced a life-threatening situation after an accidental electric shock left him unconscious.
A doctor passing by noticed a distressed father carrying his son and immediately… pic.twitter.com/DBlxTxqpNr
— Sudhakar Udumula (@sudhakarudumula) May 17, 2024