Star Heroes: చాలా మంది హీరోలు కొన్ని ఇండస్ట్రి ల్లో మాత్రమే సక్సెస్ అవుతుంటారు. మరికొన్ని ఇండస్ట్రీల్లో అసలు ఏ మాత్రం ప్రభావాన్ని చూపించలేక పోతారు. ఇక ఇలాంటి క్రమంలో తమిళ్, తెలుగు ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది స్టార్ హీరోలు అప్పట్లో బాలీవుడ్ లో సినిమాలు చేసే ప్రయత్నం చేసినప్పటికీ వాళ్లకు అక్కడ ఆశించిన ఫలితాలైతే ఎదురవ్వలేదు. ముఖ్యంగా తమిళ్ సినిమా ఇండస్ట్రీకి చెందిన రజనీకాంత్, కమలహాసన్ లాంటి టాలెంటెడ్ హీరోలు కూడా తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
కానీ హిందీలో మాత్రం వాళ్ల సత్తా చాటలేకపోయారు. దానికి కారణం వీళ్ల సినిమాలు కొన్ని అక్కడ డబ్ చేసినప్పటికీ అక్కడ ఆడలేదు. ఇక చిరంజీవి లాంటి స్టార్ హీరో కూడా హిందీలో కొన్ని సినిమాలు చేసినప్పటికీ అవి ఏవి కూడా పెద్దగా ప్రభావాన్ని చూపించలేకపోయాయి. ముఖ్యంగా అప్పట్లో హిందీ హీరోలా డామినేషన్ ఎక్కువగా ఉండేది. దానివల్లే మనవాళ్ళ సినిమాలు అక్కడ పెద్దగా ప్రభావం చూపించలేదు. ఇక చిరంజీవి లాంటి హీరోలు కూడా బాలీవుడ్ మీద ఫోకస్ పెట్టకుండా ఓన్లీ తెలుగు మార్కెట్ మీద మాత్రమే ఫోకస్ అయితే పెడుతూ వచ్చాడు. కానీ ఇప్పుడు మాత్రం ట్రెండు మారింది.
ప్రతి ఒక్క హీరో పాన్ ఇండియాలో తమ సత్తా చాటుతూన్నారు. ముఖ్యంగా బాహుబలి సినిమాతో పాన్ ఇండియా సినిమాలా హవా స్టార్ట్ అయింది. ఇక ఇప్పుడు కథ కంటెంట్ బాగుంటే ఏ సినిమా అయిన సరే ఇండియా వైడ్ గా రిలీజ్ అయి మంచి విజయాన్ని సాధిస్తున్నాయి. ఇక ఇలాంటి క్రమంలోనే మరి కొంతమంది స్టార్ హీరోలు కూడా ఇప్పుడు పాన్ ఇండియా స్టార్లుగా గుర్తింపు పొందుతున్నారు. ఇక తెలుగు, తమిళ్ అనే తేడా లేకుండా ఇతర భాషల నుంచి వచ్చిన స్టార్ హీరోలు కూడా తమ సత్తా చాటుతున్నారు. ఇంతకు ముందు దాకా కన్నడ ఇండస్ట్రీని ఎవరు అంతగా పట్టించుకోలేదు.
కానీ కేజీఎఫ్ వచ్చిన తర్వాత కన్నడ ఇండస్ట్రీ కూడా టాప్ ఇండస్ట్రీగా పేరు సంపాదిస్తూ ముందుకు దూసుకెళ్తుంది. ఇక అలాగే కాంతర సినిమాతో మరొక బ్లాక్ బాస్టర్ కూడా వాళ్ళు దక్కించుకున్నారు. దాంతో యశ్ , రిషబ్ శెట్టి లాంటి వారు పాన్ ఇండియా లో స్టార్ హీరోలుగా ముందుకు కొనసాగుతున్నారు. ఇక ఇప్పటికైనా హీరోలందరూ కూడా ఇతర భాషల మార్కెట్ల మీద కన్ను వేయడమే కాకుండా అక్కడ భారీ సక్సెస్ లను అందుకోవడం మంచి విషయమనే చెప్పాలి…ఇక మన తెలుగు హీరోలు ఇప్పటికే ఇండియా లో నెంబర్ వన్ హీరోలుగా దూసుకుపోతున్నారు…