Viral Video : ఈ రోజుల్లో అందరూ సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో అడవిలో నివసించే జంతువులు, పక్షులు, పాములకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో నిరంతరం వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో విషపూరిత పాములకు, ముఖ్యంగా అడవి జంతువులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా వినియోగదారులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) నివేదిక ప్రకారం ప్రతి సంవత్సరం దాదాపు 50 లక్షల మంది పాముకాటుకు గురవుతున్నారు. అదే సమయంలో 81 వేల నుంచి 1 లక్షా 38 వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అత్యధిక మరణాలు నాగుపాము వల్లనే సంభవిస్తున్నాయని కూడా నివేదిక చూపుతోంది. ఈ సంఖ్య భారతదేశం వంటి దేశాలలో అత్యధికం. అయినప్పటికీ, చాలా మంది తమను తాము తురుమ్ ఖాన్లుగా భావించి నాగుపాము వంటి భయంకరమైన పాముతో విన్యాసాలు చేస్తుంటారు. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను చూడండి. ఇందులో ఓ వ్యక్తి నాగుపామును చేతిలోకి తీసుకుని కెమెరా ముందు మాట్లాడడం మొదలుపెట్టాడు. కానీ మరుసటి క్షణంలో అతనికి ఏం జరిగిందో చూస్తే షాక్ అవ్వాల్సిందే.
వైరల్ అవుతున్న వీడియోలో చేతిలో విషపూరితమైన నాగుపామును పట్టుకుని కెమెరా ముందు మాట్లాడుతున్న వ్యక్తిని మీరు చూడవచ్చు. కొంత సమయం వరకు పాము అన్నింటినీ తట్టుకుంటుంది, కానీ అకస్మాత్తుగా అది వ్యక్తి నుదిటిపై కాటేస్తుంది. ఈ దృశ్యం దిగ్భ్రాంతిని కలిగించడమే కాకుండా గుండె కాస్త వీక్ ఉన్న వాళ్లను ఇబ్బందికి గురి చేస్తుంది.
కెమెరాతో కాసేపు మాట్లాడిన తర్వాత, ఆ వ్యక్తి నవ్వుతూ నాగుపామును ముద్దుపెట్టుకోవడం వీడియోలో మీరు చూస్తారు. అప్పుడు పాము కోపంతో నేరుగా అతని నుదిటిపై కాటు వేసింది. ఈ వీడియో ఉజ్బెకిస్తాన్‌కు చెందినది. @doktorkobra_official Insta హ్యాండిల్ ద్వారా భాగస్వామ్యం చేయబడిన ఈ వీడియోను ఇప్పటివరకు 1 లక్ష మందికి పైగా లైక్ చేసినప్పటికీ, చాలా మంది వినియోగదారులు క్లిప్‌ని చూసిన తర్వాత షాక్ కు గురవుతున్నారు. వీడియోను చూసిన తర్వాత నెటిజన్లు తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో ఇస్తున్నారు.
View this post on Instagram