NTR Murugan book meaning: యంగ్ టైగర్ ఎన్టీఆర్(Junior NTR) నేటితో ‘వార్ 2′(War 2 Movie) మూవీ షూటింగ్ ని తన పార్ట్ కి సంబంధించి మొత్తం పూర్తి చేసాడు. అదేంటి షూటింగ్ ఎప్పుడో పూర్తి అయ్యింది కదా, డబ్బింగ్ కూడా పూర్తి చేసి ప్రొమోషన్స్ కి సిద్ధం అవుతుంటే ఇప్పుడు మళ్ళీ షూటింగ్ అంటారేంటి అని మీరు అనుకోవచ్చు. కానీ ఎంత షూటింగ్ పూర్తి అయినా కొంత ప్యాచ్ వర్క్ బ్యాలన్స్ ఉంటుంది. ఆ ప్యాచ్ వర్క్ ని నేటితో ఎన్టీఆర్ పూర్తి చేసాడు. ఇకపోతే నేడు ఆయన షూటింగ్ పూర్తి చేసి బయటకి వచ్చి కారు ఎక్కుతున్న సమయంలో ఆయన చేతిలో ఉన్న పుస్తకం ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఆ పుస్తకం పేరు ‘మురుగన్'(Murugan). మురుగన్ అంటే శివ పార్వతుల కుమారుడు, యుద్దానికి దేవుడు, కార్తికేయ స్వామి. ఆయన్ని సుబ్రమణ్య స్వామి, అయ్యప్ప స్వామి అని కూడా పిలుస్తూ ఉంటారు.
ఎన్టీఆర్, త్రివిక్రమ్(Trivikram Srinivas) కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సినిమా కార్తికేయ స్వామి గురించే. తమిళం లో ఈయన్ని మురుగన్ అని పిలుస్తూ ఉంటారు. రీసెంట్ గానే తమిళనాడు ‘మురుగన్ మానాడు’ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మన ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా వెళ్లొచ్చిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఇక ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా విషయానికి వస్తే, ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తో చేస్తున్న సినిమా పూర్తి అయిన వెంటనే త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేయబోతున్నాడని స్పష్టంగా అర్థం అవుతుంది. అందుకే ఇప్పటి నుండే ఆయన మురుగన్ సబ్జెక్టు ని , ఆయన జీవిత చరిత్ర ని పూర్తిగా అవపోసన పట్టడం ప్రారంభించాడు. ఎన్టీఆర్ ని ఆయన అభిమానులు సాధారణంగానే దేవుడి లాగా చూస్తారు. అలాంటి ఎన్టీఆర్ ఏకంగా దేవుడి పాత్రనే చేస్తున్నాడంటే ఇక అభిమానుల ఆనందాన్ని ఆపగలమా.
ఈ చిత్రం #RRR తర్వాత మొదలు కావాల్సింది. కానీ స్క్రిప్ట్ వర్క్ పూర్తి కాకపోవడం తో ముందుగా ‘దేవర’ ని తెరపైకి తీసుకొచ్చారు. ఆ తర్వాత ఈ కథ ఎన్టీఆర్ నుండి అల్లు అర్జున్(Icon Star Allu Arjun) కి వెళ్ళింది. ‘పుష్ప 2’ తర్వాత ఈ సినిమానే చేద్దామని అనుకున్నాడు. కానీ స్క్రిప్ట్ వర్క్ ఇంకా పూర్తి స్థాయిలో సిద్ధం అవ్వలేదు. అందుకే అల్లు అర్జున్ అట్లీ మూవీ కి షిఫ్ట్ అయ్యాడు. కానీ మళ్ళీ ఈ ప్రాజెక్ట్ ఎన్టీఆర్ చేతుల్లోకి వెళ్ళింది. ఇలాంటి మైథలాజికల్ సబ్జక్ట్స్ కి ఎన్టీఆర్ మాత్రమే సరిపోతాడని, అతని తెలుగు బాషా ఉచ్చారణ టాలీవుడ్ లో ఏ హీరోకి కూడా సాధ్యం కాదని నెటిజెన్స్ యొక్క అభిప్రాయం. ఈ ప్రాజెక్ట్ చేరాల్సిన చోటకే చేరింది. ఇప్పటి వరకు మన చరిత్ర ఎన్నడూ చూడని కార్తికేయ స్వామి అధ్యాయం ని ఈ చిత్రం ద్వారా చూపించబోతున్నారు.
#JrNTR spotted at Mumbai airport holding the book ‘Muruga: The Lord of War, The God of Wisdom’ by Anand Balasubramanian. pic.twitter.com/Qp71q6FdKL
— Gulte (@GulteOfficial) June 26, 2025