Homeఎంటర్టైన్మెంట్Accident in Kubera Theater: కుబేర థియేటర్ లో ఘోర ప్రమాదం.. పరుగులు తీసిన ఆడియన్స్..వీడియో...

Accident in Kubera Theater: కుబేర థియేటర్ లో ఘోర ప్రమాదం.. పరుగులు తీసిన ఆడియన్స్..వీడియో వైరల్!

Accident in Kubera Theater: తెలంగాణ(Telangana) జిల్లాలోని మహబూబాబాద్(Mahabubabad) లోని ముకుంద థియేటర్ లో ఘోర ప్రమాదం జరిగింది. ఈ నెల 20 వ తారీఖు నుండి ఈ థియేటర్ లో ‘కుబేర'(Kuberaa Movie) చిత్రం విజయవంతంగా నడుస్తుంది. అయితే నిన్న రాత్రి సెకండ్ షో నడుస్తున్న సమయం లో థియేటర్ పైన ఉన్న సీలింగ్ బ్రేక్ అయ్యి ఆడియన్స్ పై పడింది. అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటన కారణంగా కొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే థియేటర్ సిబ్బంది హాస్పిటల్ కి తరలించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. కాసేపు వినోదం కోసం థియేటర్స్ కి వచ్చే జనాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత థియేటర్ యాజమాన్యం కి ఉంటుంది. అలాంటి థియేటర్ యాజమాన్యం సీలింగ్ బలహీనంగా ఉందని కూడా తెలిసి ఇన్ని రోజులు ఎందుకు మరమ్మత్తులు చేయించలేదు అంటూ నెటిజెన్స్ మండిపడుతున్నారు.

ఎలాంటి ప్రాణహాని జరగలేదు కాబట్టి సరిపోయింది. ఒకవేళ ఆ సీలింగ్ ప్రేక్షకుడి తల మీద పడుంటే ఏంటి పరిస్థితి?, ప్రభుత్వం కూడా థియేటర్స్ నాణ్యతపై సర్వే చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే సమ్మర్ లో పెద్దగా ఈ ఏడాది సినిమాలు విడుదల కాలేదు. కానీ ఇక నుండి వారానికి ఒక కొత్త సినిమా థియేటర్స్ లోకి వస్తుంటాయి. అందులో పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’, ‘ఓజీ’ చిత్రాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆడియన్స్ భారీ గా థియేటర్స్ కి వచ్చే అవకాశం ఉన్నందున దయచేసి ఆ లోపే ఇలాంటి థియేటర్స్ ని గుర్తించి, మరమ్మతులు చేయించాల్సిందిగా కోరుతున్నారు నెటిజెన్స్. నిన్న వర్కింగ్ డే కాబట్టి సెకండ్ షో లో ఆశించిన స్థాయి లో జనాలు లేరు. అదే వీకెండ్ అయ్యుంటే జనాలు భారీగా ఉండేవారు. అప్పుడు ఈ ప్రమాదం జరిగి ఉండుంటే ఎంతటి అనర్థం జరిగేదో మీరే ఊహించుకోండి.

ఇకపోతే కుబేర చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన థియేట్రికల్ రన్ తో ముందుకు దూసుకుపోతుంది. కేవలం ఆరు రోజుల్లోనే 100 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించిన ఈ సినిమా, లాంగ్ రన్ లో మరో వంద కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొడుతుందని బయ్యర్స్ బలమైన నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతికి వస్తున్నాం చిత్రం తర్వాత ఈ ఏడాది ట్రేడ్ కి ఈ చిత్రం కాసుల కనకవర్షం కురిపించింది. ఈ సినిమా వ్యాపారం లో భాగమైన ప్రతీ ఒక్కరు లాభాల్లోకి మరో రెండు రోజుల్లో అడుగుపెట్టబోతున్నారు. చూడాలి మరి ఫుల్ రన్ లో ఈ సినిమా రేంజ్ ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుంది అనేది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Exit mobile version