https://oktelugu.com/

పెళ్లిలో బోరున ఏడ్చేసిన పెళ్లికొడుకు.. కారణమేంటంటే..?

సాధారణంగా ఎవరైనా పెళ్లి అంటే సంతోషంగా జరుపుకుంటారు. ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా ఫోటోలకు ఫోజులిస్తారు. అయితే ఒక వ్యక్తి మాత్రం పెళ్లి వేడుకలో బోరున విలపించాడు. పెళ్లి జరుగుతున్న సమయంలోనే బాధతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. సౌదీ అరేబియాలోని జెడ్డాలో చోటు చేసుకున్న ఈ ఘటన ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. మ‌హ్మ‌ద్ ఇమ్దాద్ అలీ అనే పెళ్లికొడుకు పెళ్లిలో ఏడుస్తూనే ఫోటోలు దిగాడు. Also Read: వ్యవసాయానికి ప్రతీకగా కనుమ పండుగ.. ఎందుకో తెలుసా..! తన పెళ్లి […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 16, 2021 / 11:58 AM IST
    Follow us on


    సాధారణంగా ఎవరైనా పెళ్లి అంటే సంతోషంగా జరుపుకుంటారు. ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా ఫోటోలకు ఫోజులిస్తారు. అయితే ఒక వ్యక్తి మాత్రం పెళ్లి వేడుకలో బోరున విలపించాడు. పెళ్లి జరుగుతున్న సమయంలోనే బాధతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. సౌదీ అరేబియాలోని జెడ్డాలో చోటు చేసుకున్న ఈ ఘటన ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. మ‌హ్మ‌ద్ ఇమ్దాద్ అలీ అనే పెళ్లికొడుకు పెళ్లిలో ఏడుస్తూనే ఫోటోలు దిగాడు.

    Also Read: వ్యవసాయానికి ప్రతీకగా కనుమ పండుగ.. ఎందుకో తెలుసా..!

    తన పెళ్లి వేడుకకు తల్లిదండ్రులు హాజరు కాకపోవడం వల్ల అలీ కన్నీళ్లు పెట్టుకున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే హైదరాబాద్ లోని సంతోష్ నగర్ కు చెందిన అలీకి జెడ్డాలో ఇంజనీర్ ఉద్యోగం వచ్చింది. అలీ బంధువులలో ఎక్కువమంది జెడ్డాలోనే స్థిరపడ్డారు. దీంతో అలీ తల్లిదండ్రులు అతనికి జెడ్డాలోనే వివాహం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. లాక్ డౌన్ కు ముందే అలీకి పెళ్లితేదీని ఫిక్స్ చేశారు.

    Also Read: రెడ్ మీ మొబైల్ ఫోన్లు వాడేవాళ్లకు అదిరిపోయే శుభవార్త..?

    అయితే పెళ్లి సమయంలో కరోనా విజృంభణ, లాక్ డౌన్ నిబంధనల అమలు వల్ల మార్చి నెల చివరివారం జరగాల్సిన అలీ పెళ్లి వాయిదా పడింది. విమాన ప్రయణాలపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించిన నేపథ్యంలో అలీ తల్లిదండ్రులు జెడ్డాకు వెళ్లలేకపోయారు. కరోనా ఉధృతి తగ్గినా హైదరాబాద్ లో ఉన్న అలీ తల్లిదండ్రులకు జెడ్డాకు వెళ్లడానికి వీసా లభించలేదు. దీంతో ఇరు కుటుంబాల పెద్దలు అలీ తల్లిదండ్రులు లేకుండానే పెళ్లి జరపాలని నిర్ణయం తీసుకున్నారు.

    మరిన్ని తెలంగాణ వార్తల కోసం: తెలంగాణ

    అలీ తల్లిదండ్రులు లేకుండానే వివాహం జరగగా పెళ్లి జరుగుతున్న సమయంలో అలీ భావోద్వేగానికి లోనయ్యారు. అలీ బంధుమిత్రులు అతనిని ఓదార్చడానికి ప్రయత్నం చేశారు. కరోనా, లాక్ డౌన్ వల్ల తన తల్లిదండ్రులు లేకుండానే పెళ్లి చేసుకునే పరిస్థితి ఏర్పడిందని అలీ తన బాధను వ్యక్తం చేశారు.