శనివారం ఆంజనేయునికి ఎంతో ప్రీతికరమైన రోజు. ఈ శనివారం రోజున స్వామివారికి భక్తులు పెద్ద ఎత్తున భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తుంటారు. స్వామి వారిని పూజించడం వల్ల ఎంతో ధైర్యాన్ని ప్రసాదిస్తాడని, ధైర్యానికి, బలానికి ప్రతీకగా ఆంజనేయుని పూజిస్తారు. ఆంజనేయస్వామికి తమలపాకులన్న, సింధూరం అంటే ఎంతో ప్రీతికరం శనివారం పూట స్వామివారికి లేత తమలపాకుల హారాన్ని ప్రసాదించడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం.
Also Read: కనుమ నాడు మినుములు తినాలని ఎందుకు చెబుతారు?
రామాయణంలో భాగంగా లంకలో యుద్ధం చేస్తున్న సమయంలో ఆంజనేయుడుకి తీవ్ర గాయాలు అయినప్పుడు శ్రీరాముడు తమలపాకులతో తన శరీరం పై రుద్దడం వల్ల ఆంజనేయుడికి గాయాలు మానిపోతాయి. అప్పటి నుంచి తమలపాకులు అంటే హనుమంతుడికి ఎంతో ప్రీతికరమైనవని చెప్పవచ్చు.ఈ విధంగా ఆంజనేయుడికి ఎంతో ఇష్టమైన తమలపాకులతో పూజించిన వారికి సకల సంపదలు, సుఖసంతోషాలు ప్రసాదిస్తాడని భక్తులు భావిస్తారు.
Also Read: ఏపీలోని ఆ జిల్లాలో వింత ఘటన.. ముల్లంగిలో దర్శనమిచ్చిన గణపతి ఆకారం..!
ప్రతి శనివారం లేదా మంగళవారం ఆంజనేయునికి తమలపాకుల హారాన్ని సమర్పిస్తే సకల దోషాలు తొలగిపోతాయి. అంతేకాకుండా భార్య భర్తల జీవితంలో ఎలాంటి సమస్యలు తలెత్తినా ఆ సమస్యలు తగ్గుతాయి. సుందరకాండ పారాయణం చేసి తమలపాకు హారాన్ని సమర్పించడం ద్వారా మనం చేసే అన్ని కార్యాలయాలలో తప్పకుండా విజయం పొందవచ్చు. ఆంజనేయ స్వామికి సమర్పించిన తమలపాకులను అనంతరం భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. దీనిని పర్ణ ప్రసాదమనే పేరుతో పిలుస్తారని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.
మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం
కొంతమంది వ్యాపారంలో అధిక నష్టాలను చవి చూస్తున్నప్పుడు ఆంజనేయస్వామికి తమలపాకుల హారాన్ని వేసి తమలపాకులను, పండ్లు దక్షిణంగా దానం చేయటం ద్వారా వ్యాపార అభివృద్ధి జరుగుతుంది. అంతేకాకుండా శనివారం స్వామి వారికి తమలపాకు మాలను సమర్పిస్తే శనీశ్వరుని అనుగ్రహం కలిగి, మనపై ఉన్న శని దోషాలు సైతం తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.