Viral Video : ఈ మధ్యకాలంలో సామాజిక మాధ్యమాల్లో ఎక్కడ చూసినా రకరకాలైన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యం గా పెళ్లి వేడుకకు సంబంధించిన అనేక రకాలైన వీడియొ లు చాలానే సామజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.పెళ్లి కొడుకు లేదా పెళ్లి కూతురు డాన్స్ చేసే వీడియోలు కూడా మనం ప్రతిరోజు సోషల్ మీడియా లో చూస్తూనే ఉన్నాము. పెళ్ళికొడుకు లేదా పెళ్లికూతురు కి సంబంధించిన విచిత్ర, వింత వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూ ఉంటాయి. ఇటువంటి ఫన్నీ వీడియోలను చూడడానికి అందరూ కూడా చాలా ఆసక్తి చూపిస్తారు. ఈ క్రమంలోనే ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో క్షణాల్లో వైరల్ అయిపోతాయి. తాజాగా ఒక పెళ్ళికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది. ఆ వీడియోలో ఏం జరిగింది అనేది పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. భారతీయ వివాహాలు ఎంత అంగరంగ వైభవంగా జరుగుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సంగీత్, మెహందీ అంటూ పెళ్లి మొదలైన దగ్గర నుంచి స్నేహితులు, బంధువులతో ఆ పెళ్లి మండపం కోలాహలంగా సందడిగా ఉంటుంది. ఇక పెళ్లిలో పెళ్లి కొడుకు లేదా పెళ్లికూతురు కుటుంబ సభ్యులు లేదా స్నేహితుల మధ్య చిన్న చిన్న వివాదాలు అనేది సర్వసాధారణమని చెప్పొచ్చు. పెళ్లి వేడుకకు సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం వేగంగా వైరల్ అవుతుంది.
ఈ వీడియోలో వధూవరులు అగ్నిహోత్రం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్న సమయంలో ఆ పెళ్లి కొడుకు స్నేహితులు వధూవరులను ఆటపట్టిస్తున్న సమయంలో పురోహితుడు చేసిన ఒక పని ప్రస్తుతం అందరికీ షాక్ కి గురయ్యేలా చేస్తుంది. పెళ్లిలో వధూవరులు అగ్నిహోత్రం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. అదే సమయంలో వారి స్నేహితులు వధూవరులను ఆటపట్టిస్తూ వాళ్లపై పూలతో దాడి చేస్తున్నారు. కొత్తజంటపై స్నేహితులు ఒక్కసారిగా పూలతో విరుచుకుపడ్డారు. పూలతో వాళ్ళు సంతోషంగా కొడుతున్న దెబ్బలు అక్కడున్న వారిని ఇబ్బంది పెట్టాయి. అక్కడే ఉన్న పురోహితుడు తన ఆగ్రహాన్ని ఆపుకోలేకపోయాడు. పురోహితుడు పట్టరాని కోపంతో తన చేతిలో ఉన్న ప్లేట్ తీసుకొని అక్కడున్న వారిపై విసిరాడు.
ఆ ప్లేట్ అతిథులలో ఒకరికి బాగానే తగిలింది. ఒక్కసారిగా ఊహించని విధంగా పురోహితుడు ప్రవర్తించిన తీరును చూసి అక్కడ ఉన్న వాళ్లతో పాటు ఈ వీడియో చూసిన వాళ్లు కూడా షాక్ అవుతున్నారు. సోషల్ మీడియా హ్యాండిల్ x లో @gharkekalesh అనే ఖాతాలో ఈ వీడియో షేర్ చేయబడింది. వైరల్ అవుతున్న ఈ వీడియొ ను ఇప్పటివరకు 33.4 వేలమంది వీక్షించారు. అలాగే 1.3 వేలమంది ఈ వీడియోకు లైక్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్న ఈ వీడియోని చూసి నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. అలాగే ఈ వీడియొ కు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.
Panditji had enough… pic.twitter.com/ADLrDcLyEq
— Kumar Manish (@kumarmanish9) December 26, 2024