https://oktelugu.com/

Sikandar Teaser : ‘పుష్ప 2’ రికార్డ్స్ పై కన్నేసిన సల్మాన్ ఖాన్..బాలీవుడ్ పరువు కాపాడుతాడా..? ‘సికందర్’ టీజర్ ఎలా ఉందంటే!

ఇప్పుడు బాలీవుడ్ సినీ ప్రేమికుల చూపు మొత్తం సల్మాన్ ఖాన్ మీదనే ఉంది. మురగదాస్ దర్శకత్వం లో తెరకెక్కిన 'సికందర్' చిత్రంతో భారీ బ్లాక్ బస్టర్ ని కొట్టి, పుష్ప 2 వసూళ్లను అధిగమించాలని బలమైన కోరికతో ఉన్నారు. నేడు ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని విడుదల చేసారు.

Written By:
  • Vicky
  • , Updated On : December 28, 2024 / 04:56 PM IST
    Follow us on

    Sikandar Movie Teaser : ఇండియా లోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ లో ఒకరు సల్మాన్ ఖాన్. కరోనా కి ముందు పదేళ్ల వరకు బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ మేనియా ముందు ఏ హీరో కూడా నిలబడలేకపోయారు. ఇండియా లోనే అత్యధిక ఓపెనింగ్ రికార్డ్స్, అత్యధిక వంద కోట్ల సినిమాలు, అత్యధిక ఆల్ టైం రికార్డ్స్ కలిగిన హీరో గా సల్మాన్ ఖాన్ చరిత్ర తిరగరాసాడు. కానీ కరోనా లాక్ డౌన్ తర్వాత ఆయన నటించిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసిన ‘దబాంగ్ 3 ‘ చిత్రం నుండి సల్మాన్ ఖాన్ కి బ్యాడ్ టైం మొదలైంది. ఆ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఇక ఆ తర్వాత ఆయన ‘అనిటిమ్’, ‘గాడ్ ఫాదర్’ వంటి చిత్రాల్లో ముఖ్య పాత్రలు పోషించాడు. ఇవి ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు.

    అదే విధంగా గత ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలైన ‘టైగర్ 3’ చిత్రం కూడా కమర్షియల్ గా యావరేజ్ రేంజ్ లోనే ఆడింది. మరోపక్క మన సౌత్ హీరోలు వరుసగా పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్ హిట్స్ తో బాలీవుడ్ ని కబ్జా చేసేస్తున్నారు. రీసెంట్ గా విడుదలైన ‘పుష్ప 2 ‘ చిత్రం బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ అన్నిటిని బద్దలు కొట్టి ఆల్ టైం నెంబర్ 1 చిత్రం గా నిల్చింది. ఇప్పుడు బాలీవుడ్ సినీ ప్రేమికుల చూపు మొత్తం సల్మాన్ ఖాన్ మీదనే ఉంది. మురగదాస్ దర్శకత్వం లో తెరకెక్కిన ‘సికందర్’ చిత్రంతో భారీ బ్లాక్ బస్టర్ ని కొట్టి, పుష్ప 2 వసూళ్లను అధిగమించాలని బలమైన కోరికతో ఉన్నారు. నేడు ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని విడుదల చేసారు. స్టైలిష్ యాక్షన్ మూవీ లాగా అనిపిస్తున్న ఈ టీజర్ ని చూసి సల్మాన్ ఖాన్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

    అయితే ఈ టీజర్ లో చూపించిన యాక్షన్ షాట్స్ చూసేందుకు చాలా బాగున్నాయి కానీ, ఎందుకో వీటిని మన సౌత్ సినిమాల్లోని సన్నివేశాలను రిఫరెన్స్ గా తీసుకొని చేసినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇలాంటి షాట్స్ ఇప్పుడు చాలా రొటీన్ అయిపోయాయి, సల్మాన్ ఖాన్ కం బ్యాక్ అంటే కచ్చితంగా ఆడియన్స్ ని థ్రిల్ కి గురి చేసేలా ఉండాలి, అంటే చాలా కొత్తగా అనిపించాలి. అలా కొత్తగా అనిపించకపోతే ఇప్పుడు ఎంత పెద్ద సూపర్ స్టార్ సినిమాని అయినా ఆదరించట్లేదు ప్రేక్షకులు. మన సౌత్ సినిమాల్లో ఆ కొత్తదనం కనిపిస్తుంది కానీ, బాలీవుడ్ లో మాత్రం ఇంకా కనిపించడం లేదు. అక్కడి మేకర్స్ నేటి తరం ఆడియన్స్ అభిరుచికి తగ్గట్టుగా మారాలి అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.ఈ టీజర్ ని క్రింద మీరు కూడా చూసి మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి.