Collecter Story: కొన్ని వాస్తవాలు.. కొన్ని కన్నీటి గాథలు వినగానే కన్నీళ్లు వస్తాయి. మనం సౌకర్యవంతానికి వాడే ఉత్పత్తుల వెనుక ఎందరో కన్నీటి గాథ ఉంది. వారి నెత్తుటి చెమటను మనం సుగంధంగా రాసుకుంటున్నాం.. కానీ ఆ కష్టాన్ని అనుభవించిన వారు ఈ విలాసాలకు దూరంగా ఉంటారు. అలా ఒకప్పుడు మైకా గనుల్లో పనిచేసిన కలెక్టర్ అయిన ‘రాణి సోయామోయి’ చెప్పిన ఒక వాస్తవ గాథ చదివితే మీ కళ్ల వెంట కూడా నీళ్లు తెప్పిస్తాయి.. ఆమె అందానికి మేకప్ ఎందుకు వేసుకోద్దని చెప్పాక సభకు హాజరైన విద్యార్థులు, తల్లిదండ్రులు, మేధావులు లేచి నిలుచొని కన్నీళ్లను అదిమిపట్టుకుంటూ కలెక్టర్ రాణికి చప్పట్లతో ప్రశంసలు కురిపించారు. ఆమె పడిన కష్టానికి సెల్యూట్ చేశారు. జార్ఖండ్ కలెక్టర్ రాణి సక్సెస్ స్టోరీ మీ కోసం..
* మలప్పురం జిల్లా కలెక్టర్ మిస్ రాణి సోయామోయి కళాశాల విద్యార్థులతో సంభాషిస్తున్నారు. ఆమె చేతి గడియారం తప్ప మరే ఇతర నగలు ధరించలేదు. చాలా మంది విద్యార్థులను ఆశ్చర్యపరిచిన విషయం ఏమిటంటే, ఆమె ఫేస్ పౌడర్ కూడా ఉపయోగించలేదు. ప్రసంగం ఆంగ్లంలో ఉంది. ఆమె ఒకట్రెండు నిముషాలు మాత్రమే మాట్లాడింది, కానీ ఆమె మాటల్లో దృఢ నిశ్చయం ఉంది. అనంతరం చిన్నారులు కలెక్టర్‌ను కొన్ని ప్రశ్నలు అడిగారు.
ప్ర: మీ పేరు ఏమిటి?
నా పేరు రాణి, సోయామోయి నా ఇంటి పేరు. నేను జార్ఖండ్ వాసిని.
ఇంకేమైనా అడగాలా?
ఒక సన్నని అమ్మాయి ప్రేక్షకుల నుండి లేచి నిలబడింది.
అడగండి..
“మేడమ్, మీరు ఎందుకు మేకప్ వేసుకోరు?”
కలెక్టర్ ముఖం ఒక్కసారిగా పాలిపోయింది. ఆమె సన్నటి నుదుటి మీద చెమట కారింది. ఆమె ముఖంలో చిరునవ్వు మాయమైంది. ప్రేక్షకులు ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు.
టేబుల్ మీద ఉన్న వాటర్ బాటిల్ తెరిచి కొంచెం నీళ్లు తాగింది. తర్వాత విద్యార్థిని కూర్చోమని నెమ్మదిగా సైగ చేసింది. అప్పుడు ఆమె నెమ్మదిగా మాట్లాడటం ప్రారంభించింది.
మీరు ఇబ్బందికరమైన ప్రశ్న అడిగారు. ఇది ఎప్పటికీ ఒక్క మాటలో సమాధానం చెప్పలేని విషయం. దానికి సమాధానంగా నా జీవిత కథ మీకు చెప్పాలి. నా కథ కోసం మీ విలువైన పది నిమిషాలు కేటాయించడానికి మీరు సిద్ధంగా ఉంటే నాకు తెలియజేయండి.
సిద్ధమే అన్నట్టు స్పందన వచ్చింది.
నేను జార్ఖండ్‌లోని గిరిజన ప్రాంతంలో పుట్టాను. కలెక్టర్ ఆగి పిల్లల వైపు చూసింది.
నేను కోడెర్మా జిల్లాలోని “మైకా” గనులతో నిండిన గిరిజన ప్రాంతంలో చిన్న గుడిసెలో పుట్టాను.మా నాన్న, అమ్మ మైనర్లు. నాకు ఇద్దరు అన్నలు మరియు ఒక చెల్లెలు ఉన్నారు. వర్షం పడితే కారుతున్న చిన్న గుడిసెలో మేము నివసించేవారం.వేరే ఉద్యోగం దొరక్కపోవడంతో నా తల్లిదండ్రులు తక్కువ జీతానికి గనుల్లో పనిచేసేవారు. ఈ పని చాలా దారుణం గా ఉంటుంది. నాకు నాలుగేళ్ల వయసులో మా నాన్న, అమ్మ, ఇద్దరు అన్నదమ్ములు రకరకాల జబ్బులతో మంచం పట్టారు.గనుల్లోని ప్రాణాంతక మైకా ధూళిని పీల్చడం వల్లే ఈ వ్యాధి వస్తుందని అప్పట్లో వారికి తెలియదు.నాకు ఐదేళ్ల వయసులో మా అన్నలు అనారోగ్యంతో చనిపోయారు.
చిన్న నిట్టూర్పుతో కలెక్టర్ మాట్లాడటం ఆపి, రుమాలుతో ఆమె కళ్ళు తుడుచుకున్నారు. చాలా రోజులు మా ఆహారంలో నీరు మరియు ఒకటి లేదా రెండు రోటీలు ఉంటాయి. నా సోదరులిద్దరూ తీవ్రమైన అనారోగ్యం మరియు ఆకలితో ఈ లోకాన్ని విడిచిపెట్టారు. కరెంటు, పాఠశాల, ఆసుపత్రి, మరుగుదొడ్డి లేని గ్రామాన్ని మీరు ఊహించగలరా? .
ఒకరోజు నాన్న నన్ను పట్టుకున్నప్పుడు ఆకలితో,ఎండిపోయిన నా చర్మం, ఎముకలాంటి నా చేతిని పట్టుకున్న నాన్నతో కలిసి టిన్ షీట్లతో కప్పబడిన ఒక పెద్ద గని వద్దకు పనికోసం వెళ్ళాను. కాలక్రమేణా ఖ్యాతి గడించిన మైకా గని.అది ఒక పురాతన గని,తవ్వి, తవ్వి, పాతాళం వరకు విస్తరించింది.దిగువన ఉన్న చిన్న చిన్న గుహల గుండా వెళ్లి మైకా ఖనిజాలను సేకరించడం నా పని. పదేళ్లలోపు పిల్లలకు మాత్రమే సాధ్యమైయ్యేది.నా జీవితంలో మొదటి సారి కడుపు నిండా రోటీలు తిన్నాను. కానీ ఆ రోజు నేను వాంతి చేసుకున్నాను. నేను ఫస్ట్ క్లాస్‌లో ఉండాల్సిన సమయంలో, నేను విషపూరిత దుమ్ము పీల్చుకునే చీకటి గదులలో మైకాను సేకరిస్తున్నాను. అప్పుడప్పుడు కొండచరియలు విరిగిపడటంతో దురదృష్టవంతులైన పిల్లలు చనిపోవడం,అప్పుడప్పుడు కొందరు ప్రాణాంతక వ్యాధులతో చనిపోవడం అక్కడ సర్వసాధారణం. రోజుకు ఎనిమిది గంటలు పనిచేస్తే ఒకసారి భోజనానికి సరిపడా సంపాదించవచ్చు. ప్రతిరోజు విషపూరిత వాయువులను పీల్చడం, ఆకలి కారణంగా నేను సన్నగా మారాను. ఒక సంవత్సరం తర్వాత మా చెల్లి కూడా గనిలో పనికి వెళ్లడం ప్రారంభించింది. అలా నాన్న, అమ్మ, చెల్లి, నేను కలిసి పనిచేసి ఆకలి లేకుండా బతకగలం అనే స్థితికి వచ్చాము.
కానీ విధి మరో రూపంలో మమ్ముల్ని వెంటాడడం ప్రారంభించింది. ఒకరోజు నేను విపరీతమైన జ్వరంతో పనికి వెళ్ళనప్పుడు, అకస్మాత్తుగా వర్షం కురిసింది. గని బేస్‌లో ఉన్న కార్మికులపై గని కూలిపోవడంతో వందలాది మంది చనిపోయారు. వారిలో నాన్న, అమ్మ, చెల్లి ఉన్నారు.కలెక్టర్ రాణికి రెండు కళ్లలోనూ కన్నీళ్లు కారడం మొదలయ్యాయి. ప్రేక్షకులంతా ఊపిరి పీల్చుకోవడం కూడా మర్చిపోయారు. చాలా మంది కళ్లలో నీళ్లు తిరిగాయి.అప్పుడు నాకు ఆరేళ్లు మాత్రమే చివరికి ప్రభుత్వ అనాధ ఆశ్రమానికి వచ్చాను. అక్కడ నేను చదువుకున్నాను. నేను నా మొదటి వర్ణమాలలను మా గ్రామం నుండి నేర్చుకున్నాను. ఇప్పుడు కలెక్టర్ గా మీ ముందు ఉన్నాను.
నేను మేకప్ ఉపయోగించక పోవడానికి దీనికి మధ్య సంబంధం ఏమిటని మీరు ఆశ్చర్యపోవచ్చు.ఆమె ప్రేక్షకులను చూస్తూ చెప్పడం కొనసాగించింది.
ఆ రోజుల్లో చీకట్లో పాకుతూ సేకరించిన మైకా మొత్తం మేకప్ ఉత్పత్తుల కోసం వినియోగిస్తున్నారని నేను చదువుకొనే సమయంలోనే తెలుసుకున్నాను. మైకా అనేది ముత్యాల సిలికేట్ ఖనిజంలో మొదటి రకం. పెద్ద పెద్ద కాస్మెటిక్ కంపెనీలు అందించే మినరల్ మేకప్‌లలో, 20,000 మంది చిన్నపిల్లలు తమ ప్రాణాలను పణంగా పెట్టిన బహుళ-రంగు మైకా మీ చర్మాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది.కాలిపోయిన కలలతో, ఛిద్రమైన జీవితాలతో, శిలల మధ్య నలిగిన మాంసాలతో, రక్తాలతో గులాబీ మెత్తదనం మీ చెంపల మీద విస్తరిస్తుంది. మిలియన్ల డాలర్ల విలువైన మైకా ఇప్పటికీ ఉపయోగించబడుతుంది, గనుల నుండి శిశువు చేతులను కైవసం చేసుకుంది. మన అందాన్ని పెంచుకోవడానికి. ఎంతోమందిని బలిగొన్న, నలిగిన పిల్లల చేతుల నుండి వచ్చి మన అందాన్ని పెంచుకోవడానికి వచ్చిన ఈ మేకప్ ని నేను నా ముఖానికి ఎలా వేసుకోవాలి? ఆకలితో మరణించిన నా సోదరుల జ్ఞాపకార్థం నేను కడుపునిండా ఎలా తినగలను? ఉన్నన్నాళ్లు చిరిగిన బట్టలతో గడిపిన మా అమ్మను స్మరిస్తూ నేను ఖరీదైన పట్టు వస్త్రాలు ఎలా ధరించగలను? రాణి పెదవులపై చిరునవ్వుతో, కళ్లలోని కన్నీళ్లు తుడుచుకోకుండా, తల నిమురుతూ వెళ్లిపోతుంటే ప్రేక్షకులంతా తెలియకుండానే లేచి నిలబడ్డారు.
(జార్ఖండ్‌లో ఇప్పటికీ అత్యంత నాణ్యమైన మైకాను తవ్వుతున్నారు. 20,000 కంటే ఎక్కువ మంది చిన్నారులు పాఠశాలకు వెళ్లకుండానే అక్కడ పని చేస్తున్నారు. అనేక మంది చనిపోతున్నారు కొండచరియలు విరిగిపడటం, కొన్ని వ్యాధుల కారణంగా)
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: Collector rani soyamoi real story
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com