New Ookla CEO : కార్పొరేట్ కంపెనీలు వేలకోట్ల టర్నోవర్ సాగిస్తుంటాయి కాబట్టి.. వ్యాపార విస్తరణను పెంచుకుంటాయి కాబట్టి.. అన్ని విభాగాలలో సత్తా చాటే సీఈఓలను నియమించుకుంటాయి. పేరుపొందిన విశ్వవిద్యాలయాలలో చదివిన వారికి కార్పొరేట్ కంపెనీలు ప్రాధాన్యం ఇస్తుంటాయి. ముఖ్యంగా బిజినెస్ మేనేజ్మెంట్లో గొప్ప గొప్ప కాలేజీల్లో చదువుకున్న వారికి ఊహించనంత స్థాయిలో వేతనాలు ఇచ్చి నియమించుకుంటాయి. కంపెనీలు ఆ స్థాయిలో వేతనాలు ఇస్తాయి కాబట్టే.. సేవలు కంపెనీలకు నమ్మిన బంటు లాగా ఉంటారు. అయితే ఇప్పుడు మీరు చదవబోయే ఈ కథనంలో ఓ కంపెనీ సీఈవో తన పనితీరును సరికొత్తగా నిరూపించుకున్నారు. తన కంపెనీలో ఓ వృద్ధుడికి కలిగిన అసౌకర్యానికి చింతిస్తూ కఠిన నిర్ణయం తీసుకున్నారు. దీనికి కారణమైన ఉద్యోగులపై అత్యంత కఠినంగా వ్యవహరించారు. సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు పాఠశాలలో విద్యార్థులకు ఇచ్చినట్టుగా.. పనిష్మెంట్ ఇచ్చారు. ఏకంగా 20 నిమిషాల పాటు నిలబడి పని చేయాలని సూచించారు..
ఇంతకీ ఏం జరిగిందంటే
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో న్యూ ఓక్లా పేరుతో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీ అనే పేరుతో ఓ సంస్థ ఉంది. ఇందులో 16 మంది విధులు నిర్వహిస్తున్నారు.. ఈ సంస్థలో వివిధ పనుల నిమిత్తం కార్యాలయానికి నోయిడా ప్రజలు వస్తుంటారు. ఈ అథారిటీకి సరిగ్గా గత ఏడాది క్రితం ఐఏఎస్ అధికారి డాక్టర్ లోకేష్ సీఈవోగా నియమితులయ్యారు.. విధి నిర్వహణలో ఎంతో నిక్కచ్చిగా ఉండే ఈయన.. ఏమాత్రం అసౌకర్యం కలిగినా సహించరు.. వృద్ధుల విషయంలో ఆయన ఎంతో ఉదారత చూపిస్తుంటారు. వృద్ధులను ఎక్కువసేపు నిలబడితే ఊరుకోరు. వృద్ధులకు అందిస్తున్న సేవలను.. ఒకవేళ సేవలను లోపాలు తలెత్తితే పర్యవేక్షించేందుకు సీసీ కెమెరాలు ఎప్పటికప్పుడు చూస్తుంటారు. డిసెంబర్ 16, సోమవారం నాడు ఓక్లా కార్యాలయానికి ఓ వృద్ధుడు వచ్చాడు. తన పని నిమిత్తం కౌంటర్ వద్ద నిలబడ్డాడు.. ఆ విషయాన్ని లోకేష్ సీసీ కెమెరాలు చూశాడు. ఆయనకు కావలసిన పనిని చేసిపెట్టాలని లోకేష్ ఓ మహిళా ఉద్యోగికి సూచించారు. ఆ పని సాధ్యం కాకపోతే.. వెంటనే ఆ వృద్ధుడికి చెప్పాలని సూచించారు. లోకేష్ ఇలా చెప్పి 20 నిమిషాలు గడిచినప్పటికీ.. ఆ వృద్ధుడు కౌంటర్ వద్ద నిలబడ్డాడు. దీంతో ఆ సీఈవో ఆ విషయాన్ని మొత్తం గమనించారు. వెంటనే కార్యాలయం వద్దకి వేగంగా వచ్చారు. వెంటనే అటల్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 20 నిమిషాల పాటు నిలబడి పని చేయాలని సూచించారు. వారు నిలబడి పనిచేస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాలలో వ్యాప్తిలో ఉన్నాయి. అయితే ప్రభుత్వ కార్యాలయాలలో వెంటనే ఉద్యోగులు స్పందించాలంటే ఇలాంటి చర్యలు తీసుకోవాలని నెటిజన్లు ఈ సందర్భంగా సూచిస్తున్నారు.