Homeఅంతర్జాతీయంDonald Trump : అమెరికా కాబోయే అధ్యక్షుడికి షాక్‌.. ఆ స్టార్‌ హష్‌ మనీ కేసులో...

Donald Trump : అమెరికా కాబోయే అధ్యక్షుడికి షాక్‌.. ఆ స్టార్‌ హష్‌ మనీ కేసులో దోషిగా నిర్ధారణ!

Donald Trump : నవంబర్‌లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ ఘన విజయం సాధించారు. 2025, జనవరి 20 అగ్రరాజ్యాధినేతగా వైట్‌హౌస్‌లో అడుగు పెట్టబోతున్నారు. ఈ క్రమంలో తన మంత్రివర్గాన్ని ఎంపిక చేసుకున్నాడు. కీలక పదవుల భర్తీపై దృష్టిపెట్టారు. బాధ్యతలు చేపట్టగానే అక్రమ వలసలపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈతరుణంలో ట్రంప్‌ను కొన్నేళ్లుగా కేసులు వేధిస్తున్నాయి. కొన్ని కేసుల్లో అతను దోషిగా నిర్ధారణ అయ్యారు. దీంతో కేసులు ట్రంప్‌కు ఇబ్బందిగా మారాయి. ఒక దశలో ట్రంప్‌ పోటీ చేయడానికి అర్హత కోల్పోతాడనిపించింది. కానీ, కోర్టు అనుమతి ఇచ్చింది. అయితే తాజాగా ట్రంప్‌కు షాక్‌ తగిలింది. ఆ స్టార్‌కు ముడుపులు ఇచ్చిన కేసులో న్యూయార్క్‌ కోర్టు తాజాగా ట్రంప్‌ను దోషిగా తేల్చింది.

సోమవారం తీర్పు..
న్యూయార్క్‌ కోర్టు న్యాయమూర్తి జువాన్‌ మెర్చాన్‌ సోమవారం ఈ కేసులో తీర్పు ఇచ్చారు. అధ్యక్షుల విస్తృతమైన రక్షణ కల్పించే సుప్రీంకోర్టు నిర్ణయం ఈ కేసుకు వర్తించదని తెలిపారు. అధికారిక చర్యలకు సంబంధించిన కేసుల్లో మాత్రమే ఉపశమనం ఉంటుందని స్పష్టం చేశారు. అధికారిక చట్టాల ప్రకారం ఇమ్యూనిటీకి అవకాశం లేదని తెలిపారు. అనధికారిక ప్రవర్తనకు సంబంధించిన అంశమని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.

క్రిమినల్‌ కేసుతో వైట్‌హౌస్‌లోకి..
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన ట్రంప్‌.. 2025, జనవరి 20న వైట్‌హౌస్‌లో అడుగు పెట్టనున్నారు. తాజా తీర్పుతో క్రిమినల్‌ కేసులో శిక్ష ఖరారయిన దోషిగా ట్రంప్‌ వైట్‌హౌస్‌లోకి అడుగు పెట్టబోతున్న మొదటి అధ్యక్షుడిగా నిలవనున్నారు. హాష్‌ మనీ కేసులో ట్రంప్‌ అప్పీల్‌పై జ్యూరీ విచారణ ఇంకా పెండింగ్‌లో ఉంది. 2016లో అధ్యక్ష ఎన్నికల మసయంలో ఆ ర్న్‌స్టార్‌తో తనకున్న సంబంధం బయట పడకుండా ఉండేందుకు ట్రంప్‌ ఆమెకు డబ్బులు ఇచ్చారన్నది ప్రధాన ఆరోపణ. నవంబర్‌ 22న తీర్పు ఇవ్వాల్సి ఉన్నా.. ట్రంప్‌ గెలవడంతో వాయిదా వేశారు. తాజాగా దోషిగా తేల్చింది. అయితే ట్రంప్‌ న్యాయవాదులు మాత్రం జూలైలోనే ఆయనకు సుప్రీం కోర్టు ఇమ్యూనిటీ ఇచ్చిందని పేర్కొంటున్నారు. పోర్న్‌స్టార్‌ స్టార్మీ డేనియల్స్‌తో చీకటి ఒప్పందం వ్యవహారంలోనే ట్రంప్‌పై కేసు నమోదైంది. అభియోగాల్లోనూ న్యూయార్క్‌ జ్యూరీ గతేడాది ఆయనను దోషిగా నిర్ధారించింది. ట్రంప్‌ అప్పీల్‌కు వెళ్లడంతో సుప్రీం కోర్టు ఇమ్యూనిటీ(రక్షణ) కల్పించింది. ఈ కేసులో తాను ఆమాయకుడిని అని ట్రంప్‌ వాదిస్తున్నారు. సుప్రీం కోర్టు అనుకూల తీర్పు ఇచ్చినా.. న్యూయార్క్‌ కోర్టు మాత్రం దోషిగా తేల్చింది.

పలు కేసులు..
మరోవైపు వాషింగ్‌టన్‌ డీసీ, ఫ్లోరిడా రాష్ట్రాల్లో నమోదైన మరో రెండు కేసులు కూడా ట్రంప్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది. దీంతో ఆ కేసుల విచారణ కూడా కొంతకాలం వాయిదా పడేలా చూసేందుకు ట్రంప్‌ లాయర్లు ప్రయత్నిస్తున్నారు. ఆ స్టార్‌కు ఇచ్చిన నిధులు కూడా ఎన్నికల విరాళాలు అని ఆరోపణ ఉంది. దీనికోసం రికార్డులు తారుమారు చేశారన్నది ప్రధాన అభియోగం.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular