
Yuki-No-Otani: ఎండ మండుతోంది. మాడు పగలగొడుతోంది. బయటికి వెళ్లాలంటేనే భయం పుడుతోంది. ఇంట్లో ఫ్యాన్ తిరగకుండా ఉంటే క్షణం కూడా ఉండలేని పరిస్థితి.. ఇలాంటప్పుడు చాలామంది శీతల ప్రాంతాలకు విహారయాత్రకు వెళ్తుంటారు.. మనదేశంలో అయితే ఊటీ, కొడైకెనాల్, కేరళ, హిమాచల్ ప్రదేశ్, జమ్ము కాశ్మీర్ ప్రాంతాలు వేసవి విడిది కేంద్రాలుగా ప్రాచుర్యం పొందాయి.. ఇతర దేశాల్లో ముఖ్యంగా యూరప్ ఖండం లో దేశాలు వేసవి లోనూ చల్లగా ఉంటాయి. ఎందుకంటే మన దగ్గర వేసే ఉంటే అక్కడ శీతాకాలం ఉంటుంది గనక.. ఎక్కడికో ఫ్లైట్ లు ఇబ్బంది పడే బదులు..ఆసియా ఖండంలోనూ అత్యంత మంచు ప్రాంతం ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణగా మారింది. పర్యాటకుల మనసు దోచుకుంటున్నది.
ఆసియా ఖండంలో జపాన్ ఒక చిన్న దేశం. అయినప్పటికీ ఆ దేశంలో జీవవైవిధ్యం అధికంగా ఉంటుంది. ప్రకృతి రమణీయ ప్రాంతాలకు ఆ దేశం పెట్టింది పేరు. ప్రస్తుతం మన దేశంలో మాడు పగిలేలా ఎండలు కాస్తున్నాయి. ఆ దేశంలో విపరీతంగా మంచు కురుస్తోంది..ముఖ్యంగా తోయామా, నాగానో ప్రావిన్స్ మధ్య విస్తరించి ఉన్న 90 కిలోమీటర్ల రహదారి మంచు కారిడార్ గా మారింది. ఇది దట్టమైన మంచుతో కప్పబడి ఉండడంతో ఆ ప్రాంతవాసులు దానిని జపాన్ పైకప్పుగా అభివర్ణిస్తున్నారు.. ఏప్రిల్ 15 నుంచి ఈ కారిడార్ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. అక్కడివారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఈ కారిడార్ “యుకీ నో ఒటాని” అని పిలుస్తుంటారు. 20 మీటర్ల వెడల్పు గల ఈ కారిడార్ లో పర్యాటకులు దట్టంగా కురిసే మంచు మధ్య ప్రయాణం చేస్తున్నారు. శీతల గాలులను ఆస్వాదిస్తూ సాహస యాత్ర చేస్తున్నారు. ఈ కారిడార్ జూన్ 25 వరకు అందుబాటులో ఉంటుందని అక్కడి ప్రజలు చెబుతున్నారు.
కేవలం ప్రయాణం మాత్రమే కాదు తోయామా, నాగానో ప్రావిన్స్ మధ్య విస్తరించి ఉన్న మంచు మీద సాహస యాత్రికులు ట్రెక్కింగ్ కూడా చేస్తారు.. ఇక్కడ కొన్ని సంస్థలు ట్రెక్కింగ్ పోటీలు కూడా నిర్వహిస్తాయి. జపాన్ లోని ఎత్తైన వేడి నీటి లోయ ఈ మంచు ప్రాంతంలో ఉంది. సాహస యాత్రికులు ట్రెక్కింగ్ చేసి దీనిని చేరుకుంటారు.. ఇక ఈ కాలంలో సాహస యాత్రికులతో టటేయామా కురోబే ఆల్ఫైన్ మార్గంలో పర్యటకుల రద్దీ కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చే సందర్శకులు డైకాన్బో స్టేషన్ లోని స్నో కమకురా(జపనీస్ ఇగ్లూ), స్నో టన్నెల్ ఇక్కడ ప్రధాన ఆకర్షణ. అయితే ఈ ప్రాంతాలను సందర్శించేందుకు ప్రపంచ వ్యాప్తంగా పర్యటకులు వస్తూ ఉంటారు.. మన దేశం నుంచి కూడా ఔత్సాహిక సహాస యాత్రికులు వెళ్తూ ఉంటారు. ప్రస్తుతం దట్టంగా మంచు కురుస్తున్న నేపథ్యంలో ఇక్కడి సాహస యాత్రకు రండి అంటూ జపాన్ పర్యాటకులను సాదరంగా ఆహ్వానిస్తోంది. మరి మంచు కొండల్లో శీతల గాలులను ఆస్వాదిస్తూ సాహస యాత్ర చేసేందుకు మీరు సిద్ధమేనా?!